Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Samantha Breakfast Menu: సమంత తినే బ్రేక్ ఫాస్ట్ ఏంటి? అదెలా ప్రిపేర్ చేయాలో చూసెయ్యండి...
సమంత రుతు ప్రభు తను ఆరోగ్యకరంగా ఉండేందుకు రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో చెప్పేసింది. ఆ విశేషాలేంటో మీరూ చూసెయ్యండి.
ఇటీవలే 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ లో హాట్ గా కనిపించడమే కాదు.. తన సొగసులతో కుర్రకారును పిచ్చెక్కిచ్చింది. తాజాగా 'శకుంతలం' షూటింగులో అచ్చం అందాల దేవతలా కనిపించింద. ఇలా ప్రతిరోజూ బిజీ బిజీగా గడిపే ఈ తమిళ కుట్టి తన రియల్ లైఫ్ లోని అనేక విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అందాల తార తాజాగా తను హెల్దీగా ఫిట్ గా ఉండేందుకు ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాననే విషయాలతో పాటు మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...


బ్రేక్ ఫాస్ట్ బౌల్..
మూడు పదుల వయసు దాటినప్పటికీ.. తాను ఇప్పటికీ అందంగా.. ఆరోగ్యకరంగా.. ఫిట్ గా ఉండేందుకు కారణం తాను తీసుకునే ఆహారమని.. అందులోనూ బ్రేక్ ఫాస్ట్ ముఖ్య కారణమని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తను తీసుకునే బ్రేక్ ఫాస్టులో పండ్లు, కూరగాయలు కచ్చితంగా ఉండాలని.. అవి తింటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పింది. వీటితో పాటు కొన్ని గింజలు లేదా విత్తనాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపింది.

ఆకుపచ్చని రంగులో అల్పాహరం..
తాను రెగ్యులర్ గా తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా పిస్తా, చియా విత్తనాలు, కొబ్బరి తురుములు ఉంటాయని.. అందుకు సంబంధించిన ఓ బౌల్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో ఓ బౌల్ లో ఉత్తేజకరమైన ఆకుపచ్చని మిశ్రమ పదార్థం ఉంది.

ఎలా చేయాలంటే..
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలలో అనేక మంది ఆహారం తీసుకునే ధోరణిలో చాలా మార్పు వచ్చింది. చాలా మంది ఇళ్లలోనే ఆహారాన్ని తయారు చేసుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సులభం. మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడానికి.. ఆరోగ్యకరమైన మార్గాలలో ఇదొకటి. ముందుగా మీకు నచ్చిన పండ్లను, కూరగాయలు మరియు ఇతర గింజలను తీసుకోండి. వాటిని ఒకదానితో కలపండి. దానిపైన కొన్ని కరకరలాడే గింజలు వేయండి. వాటినిన్నంటిని ఒక బౌల్ లో వేసేయండి. అంతే మీరు కోరుకున్న అల్పహారం అత్యంత తక్కువ సమయంలో సిద్ధమైనట్టే. సమంత కూడా ఈ ఉదయం తన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ బౌల్ ను మనతో షేర్ చేసుకుంది. వీటిలో చియా విత్తనాలు మరియు కొబ్బరి తరుముతో పాటు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి.

కొబ్బరి పెరుగు..
సమంత కేవలం బ్రేక్ ఫాస్ట్ ఒక్కటే కాదు.. కొన్నిక్రీములు మరియు రుచికరమైన పెరుగు అంటే తనకెంత ఇష్టమో అనే విషయాలను చెబుతూ ఇన్ స్టాలో షార్ చేసుకుంది. అయితే మనం అనుకునే సాధారణ పెరుగు కాదు. ఇది ప్రసిద్ధ కొబ్బరి పెరుగు. ‘మీరు నాకు ఈ కొబ్బరి పెరుగును ఎప్పుడు పంపుతున్నారు' అని ఫన్నీ కామెంట్ కూడా చేస్తూ.. ఓ ఎమోజీని పోస్ట్ చేసింది.
సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సులభం. మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడానికి.. ఆరోగ్యకరమైన మార్గాలలో ఇదొకటి. ముందుగా మీకు నచ్చిన పండ్లను, కూరగాయలు మరియు ఇతర గింజలను తీసుకోండి. వాటిని ఒకదానితో కలపండి. దానిపైన కొన్ని కరకరలాడే గింజలు వేయండి. వాటినిన్నంటిని ఒక బౌల్ లో వేసేయండి. అంతే మీరు కోరుకున్న అల్పహారం అత్యంత తక్కువ సమయంలో సిద్ధమైనట్టే. సమంత కూడా ఈ ఉదయం తన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ బౌల్ ను మనతో షేర్ చేసుకుంది. వీటిలో చియా విత్తనాలు మరియు కొబ్బరి తరుముతో పాటు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications