Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
మహిళలు రీప్రొడక్టివ్ హెల్త్ కు కపాలభాతి ప్రాణాయామం
కపాలభాతి ప్రాణాయామం అనేక సమస్యల నుండి బయట పడటానికి చాలా సహాయపడుతుంది. ఒక నిర్దిష్ట సమయంలో అనేక భంగిమలను సాధన చేయవచ్చు.
కపాలభాతి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. కపాల అంటే మస్తిష్కం అని,భాతి అంటే కాంతి లేదా మెరుపు అని అర్ధం.
ఈ భంగిమను అనుసరించటం ద్వారా చర్మంలో మెరుపు మరియు తాజాదనాన్ని గమనించవచ్చు. ఈ మార్పు అనేది ఒక్క రాత్రిలో రాదు. దీనిని సాధించటానికి చాలా కష్టపడాలి.
యోగా వ్యాయామాలు శ్వాస నియంత్రణ మరియు సంతులనం నిర్వహణలో సహాయపడి శరీర అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

ప్రాణాయామం శ్వాసతో సంబంధం కలిగి ఆరోగ్యకరమైన శరీరం,మనస్సు,ఆత్మలను అందిస్తుంది.
ఈ శక్తివంతమైన భంగిమ ప్రాధమికంగా చైతన్యాన్ని నింపటంలో సహాయపడి,వ్యవస్థకు ఒక టానిక్ వలే పనిచేస్తుంది.
అందువల్ల ఈ ప్రాణాయామం వల్ల కపాలం శ్వాసలో మెరుస్తూ మంచి శ్వాస తీసుకుంటుంది. నిర్దిష్ట సమయంలో కపాలభాతి వ్యాయామాన్ని సాధన చేయటం ద్వారా కాపాలానికి మంచి శ్వాసను అందించవచ్చు.
ఈ టెక్నిక్ ని నిర్వహించటానికి దశలు
1. ఈ భంగిమను ప్రారంభించటానికి మీరు ఒక సౌకర్యవంతమైన స్థానంలో కూర్చొవాలి. అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచి,ఉదరాన్ని సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా ఉంచాలి.
2. మోకాళ్ళపై చేతులను ఉంచాలి. మోకాళ్ళ మీద అరచేతులను ఉంచాలి.

3. పొట్ట కింద బాగంలో దృష్టి పెట్టాలి. మంచి పరిపూర్ణత సాధించడానికి అరచేతులను మోకాళ్ళ మీద నుంచి పొట్ట కింద బాగంలో పెట్టి, ధ్యానం చేయాలి.
4. ఇప్పుడు ముక్కు రెండు రంద్రాల ద్వారా లోతైన శ్వాసను తీసుకోవాలి.
5. ఇప్పుడు అరచేతులతో పొట్టను శాంతంగా నొక్కి శ్వాసను నియంత్రించాలి.
6. గాలిని పీల్చటం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందువల్ల గాలిని వదిలే క్రమం మీద దృష్టిని కేంద్రీకరించాలి.
7. మొదట 60 నుంచి 70 శ్వాసలతో ప్రారంభించాలి. ఆ తర్వాత 95 నుంచి 105 వరకు నిదానంగా పెంచుకుతూ వెళ్ళాలి. ఊపిరి అడనట్టు అన్పిస్తే, ఆపి సాదారణ శ్వాస తీసుకోని మరల ప్రారంభించవచ్చు.
8. ఈ ఆసనం వేసేటప్పుడు నోరు,ముక్కు రెండు అవయవాలు పనిచేస్తాయి. ముక్కు గాలి పీల్చుకోవటానికి మరియు నోరు గాలిని వదలటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

ఈ ఆసనం వలన కలిగే ఇతర ప్రయోజనాలు
సైనస్ ,ఊపిరితిత్తులు మరియు శ్వాస వ్యవస్థ ను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
అలెర్జీలకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
ఉదర కండరాలు మరియు డయాఫ్రాగమ్ కు శక్తినిస్తుంది.
ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును క్రమపరుస్తుంది.
జాగ్రత్తలు
గుండె సమస్యలు,ఉబ్బసం, అధిక రక్తపోటు, హెర్నియా ఉన్నవారు మరియు
గర్భిణీ స్త్రీలు ఈ ఆసనానికి దూరంగా ఉండటం మంచిది.
ఈ భంగిమ ఆరోగ్యకరమైన జననేంద్రియ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తుంది. పునరుత్పత్తి కోసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ భంగిమలను పుస్తకాల్లో చదివి లేదా ఫోటోలను చూసి చేయకూడదు. గురువు దగ్గర నేర్చుకొని మాత్రమే చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











