Latest Updates
-
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే!
ఒక్క హోంమేడ్ హెల్త్ డ్రింక్ తో.. ఎనిమిది రకాల వ్యాధులకు చెక్..!!
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. కొంతమందికి చిన్న సమస్య ఉంటుంది. మరికొందరికి ప్రాణాంతమైన వ్యాధులు ఉంటాయి. ఎలాంటి వ్యాధి అయినా.. సమస్య సమస్యగానే ఉంటుంది. అయితే ప్రతి అనారోగ్య సమస్యకి, వ్యాధికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే.. ఉపశమనాన్ని కలిగించే రెమిడీస్ కూడా ఉంటాయి.
మనుషులకు చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. వాటికి ఉపయోగించే మందుల వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి.. కొన్ని రకాల వ్యాధులకు న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. అది కూడా ఇంట్లోనే ఉండే సింపుల్ పదార్థాలతో.. తయారు చేసుకునే హోం మేడ్ డ్రింక్.. ఎనిమిది రకాల వ్యాధులను నయం చేస్తుంది. మరి ఆ మిరాకిలస్ హోంమేడ్ డ్రింక్ ఏంటో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు
అర టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ చెక్క, అరకప్పు పాలు, ఒక టీ స్పూన్ తేనె తీసుకోవాలి.

తయారు చేసే విధానం
డ్రింక్ తయారు చేయడానికి తీసుకున్న పదార్థాలన్నింటినీ బ్లెండర్ లో వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని ఒక ప్యాన్ లో వేసి.. ఉడికించాలి. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకోవాలి. అంతే హెల్తీ డ్రింక్ రెడీ.

ప్రయోజనాలు
ఈ డ్రింక్ లో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది అనేక వ్యాధులు నివారించి.. ఇమ్యునిటీని పెంచుతుంది. అలాగే ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో చూద్దాం..

ఒబేసిటీ
ఈ డ్రింక్ లో ఉండే అల్లం, పసుసు మెటబాలిజం రేట్ ని మెరుగుపరుస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది. దానివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

బ్లోటింగ్
ఈ హెల్త్ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్లోటింగ్ సమస్యను తగ్గిస్తుంది. పోషకాలు అందించడంతో పాటు, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలను నివారిస్తుంది.

ఇమ్యునిటీ
పసుపు, అల్లం ఉన్న ఈ డ్రింక్ తాగడం వల్ల.. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి.

కీళ్ల నొప్పులు
ఈ హోంమేడ్ హెల్తీ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లు, కండరాలపై పనిచేసి.. ఇన్ల్ఫమేషన్, వాపు తగ్గిస్తాయి. దీనివల్ల ఎలాంటి పెయిన్ నుంచి అయినా ఉపశమనం పొందవచ్చు.

ఫ్లూ
పసుపు, అల్లంతో తయారు చేసిన ఈ డ్రింక్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. దానివల్ల ఫ్లూ, జ్వరం, తగ్గు, జలుబు నివారించవచ్చు.

గొంతు నొప్పి
ఈ హెల్త్ డ్రింక్ రెగ్యులర్ గా తాగడం వల్ల.. గొంతు నొప్పి నివారించవచ్చు. అలాగే గొంతులో ఇబ్బంది, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.

నిర్జీవమైన చర్మం
పసుపు, అల్లంతో తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల చర్మంలోపలి కణాలకు పోషణ అంది.. స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీనివల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

ఆస్టియోపోరోసిస్
ఈ హెల్త్ డ్రింక్ లో ఉపయోగించిన పాల వల్ల.. క్యాల్షియం, విటమిన్స్ ఎముకలకు అంది.. బలంగా తయారవుతాయి. కాబట్టి ఈ నొప్పులతో బాధపడేవాళ్లు.. ఈ డ్రింక్ తాగడం వల్ల.. కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ నివారించవచ్చు.



Click it and Unblock the Notifications