For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్ : లక్షణాలు, కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స మరియు నివారణ

|

మన దేశంలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి (మూత్రపిండ లిథియాసిస్ లేదా నెఫ్రోలిథియాసిస్) భారతదేశంలో సర్వసాధారణమైన అనారోగ్య సమస్యలలో ఒకటి. మూత్రపిండాల ప్రధాన విధి ఏమిటంటే, శరీరంలోని అదనపు నీరు మరియు రక్తంలోని మలినాలను బయటకు విసర్జించడం. కాల్షియం ఆక్సలేట్, అమైనో ఆమ్లాలు మరియు యూరిక్ యాసిడ్ వంటి కొన్ని పదార్థాలు చిన్న కణాల రూపంలో మిగిలిపోతాయి.అలా పేరుకుపోయిన పదార్థాల సాంద్రత పెరిగినప్పుడు, కఠినమైన మరియు పదునైన స్ఫటికాకార రాళ్లుగా మారుతాయి. అవి మూత్రపిండాల్లో రాళ్ళుగా ఏర్పడుతాయి. వాటినే కిడ్నీ స్టోన్స్ గా పిలువబడుతున్నాయి.

Kidney Stones

కిడ్నీలో రాళ్ళ సైజు 3 మి.మి వరకు ఉంటాయి, ఇవి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కానీ పెద్దగా ఉండే రాళ్ళు విసర్జించాలంటే మూత్ర విసర్జన సమయంలో ఎక్కువ నొప్పిగా మరియు రక్తస్రావం జరుగుతుంది. కిడ్నీలు మరియు బ్లాడర్ (మూత్రాశయాన్ని) కలిపే గొట్టమైన యురేటర్‌లో రాళ్ళు చిక్కుకున్నప్పుడు మరియు మూత్రం యొక్క మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నొప్పి విపరీతంగా వస్తుంది. కిడ్నీస్టోన్స్ గోల్ఫ్ బంతి పరిమాణమంత కూడా పెరుగుతాయి.

1. కిడ్నీ స్టోన్స్ రకాలు:

1. కిడ్నీ స్టోన్స్ రకాలు:

కాల్షియం రాళ్ళు: పాలకూర, బాదం, గ్రిట్స్ మరియు కోకో పౌడర్ వంటి ఆహారాలలో సహజంగా లభించే కాల్షియం ఆక్సలేట్ కారణంగా సాధారణంగా ఇటువంటి రాళ్ళు ఏర్పడతాయి.

సిస్టిన్ స్టోన్స్ : సిస్టిన్ రాళ్ళు వంశపారంపర్య రుగ్మత (సిస్టినురియా) ఫలితంగా మూత్రపిండంలో మూత్రంలో అమైనో ఆమ్లం అధికంగా విసర్జించబడుతుంది.

యూరిక్ యాసిడ్ స్టోన్స్: యూరిక్ యాసిడ్ స్టోన్స్ సాధారణంగా తగినంత నీరు త్రాగని లేదా ఎక్కువ నీరు శరీరం నుండి బయటకు పోయే వారిలో ఇటువంటి స్టోన్స్ ఏర్పడుతాయి, అధిక ప్రోటీన్లున్న ఆహారం తీసుకునే వారిలో మరియు గౌట్ తో బాధపడేవారిలో ఇటువంటి రాళ్ళు ఏర్పడతాయి.

స్ట్రువైట్ రాళ్ళు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి ఇన్ఫెక్షన్ ఫలితంగా ఇటువంటి రాళ్ళు సంభవిస్తాయి. ఈ స్థితిలో, రాళ్ళు త్వరగా మరియు గుర్తించకుండా పెరుగుతాయి.

2. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిపే లక్షణాలు:

2. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిపే లక్షణాలు:

కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు తెలిపే లక్షణాలు ఆ రాళ్ళ సైజును బట్టి తెలుస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ళ చిన్నసైజులో ఉంటే వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మూత్రంలో బయటకు వచ్చేస్తుంది. అదే పెద్ద సైజు రాళ్ళు ఉన్నట్లైతే మూత్రాశయం నుండి కిడ్నీల నుండి బ్లాడర్ కు మూత్రం చేరే మార్గంను అడ్డుకుంటుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాడు:

మూత్రం గ్రే లేదా రెడ్ కలర్లో పాస్ అవుతుంది:

కిడ్నీ స్టోన్స్ పెద్ద సైజ్ లో బయటకు రాలేని పరిస్థిలో మూత్రం గ్రే లేదా రెడ్ కలర్లో ఫ్యూయల్ వాసన కలిగి ఉంటుంది. బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ కారణంగా కూడా ఇలా జరగవచ్చు. ఈ బ్యాక్టీరియ మూత్రాశయంలో ఉండటం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటుంది. కిడ్నీ టిష్యులలో చీకాకు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో యూరిన్ ఎర్రగా వస్తుంది.

నొప్పి:

కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా కనబడే లక్షణం నొప్పి. కడుపులో నొప్పి వస్తుంది. మూత్రాశయంలోని రాయిని క్రిందికి నెట్టడానికి యురెత్రా ప్రయత్నించినప్పుడు నొప్పి వస్తుంది. ఇది పొత్తి కడుపులో తిమ్మిరి నొప్పి, మంట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

తరచూ మూత్ర విసర్జన:

యూరిన్ ఇన్ఫెక్షన్ కు ముఖ్య కారణం ఫ్రీక్వెంట్ యూరినేషన్. మూత్రం పాస్ చేసే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, మూత్రవిసర్జన పూర్తిచేయనట్లు భావన కలుగుతుంది. నొప్పితో తరచూ మూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన సమయంలో మంటను ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదుజ

3. ఫ్లూ వంటి లక్షణాలు:

3. ఫ్లూ వంటి లక్షణాలు:

వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు రోగి అలసట, జ్వరం మరియు ఒళ్ళు నొప్పులకు గురి అవుతారు. యోనిలో నొప్పి కూడా ఒక లక్షణమే. వీటిని హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు.

4. కిడ్నీ స్టోన్స్ కు కారణాలు :

4. కిడ్నీ స్టోన్స్ కు కారణాలు :

మన శరీరంలో కిడ్నీస్టోన్స్ ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో కామన్ గా :

తగినన్ని నీళ్ళు త్రాగకపోవడం, లేదా చాలా తక్కువగా నీళ్ళు త్రాగడం. అంటే శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటకు పంపడం వల్ల, దాని వల్ల ఇతర వ్యర్థాలు శరీరంలో పెరిగిపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ గా మారుతాయి.

కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా ఉంటాయి .

మూత్రంలో రసాయనాలు కాల్షియం, యూరిక్ ఆమ్లం మొదలైన వాటి సాంద్రత పెరగడం వల్ల కూడా రాయి ఏర్పడటానికి కారణం అవుతుంది.

మూత్రపిండాల రాళ్ళు ఏర్పడటానికి ఊబకాయం మరొక కారణం, ఎందుకంటే ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మారుస్తుంది మరియు రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.

మూత్ర మార్గము(యూరినరీ ట్రాక్ట్) అంటువ్యాధులకు గురైనప్పుడు కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ కు కారణం కావచ్చు.

క్రోన్'స్ వ్యాధి, మెడుల్లారి స్పాంజ్ కిడ్నీ, హైపర్‌పారాథైరాయిడిజం మరియు డెంట్స్ వ్యాధి వంటి వైద్య పరిస్థితుల వల్ల కూడా కిడ్నీస్టోన్స్ ఏర్పడవచ్చు.

ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్( ప్రేగు వ్యాధి)తో బాధపడేవారు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది.

డ్యూరియాటి, క్యాల్షియం మరియు ప్రొటీస్ ఇన్హిబిటర్ : ఇండినావిర్ వంటివి కలిగి మందులు వాడినప్పుడు .

గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వల్ల కూడా..

5. కిడ్నీ స్టోన్స్ నిర్ధారణ:

5. కిడ్నీ స్టోన్స్ నిర్ధారణ:

మన శరీరంలో కిడ్నీస్టోన్స్ ఉన్నట్లు గుర్తించడానికి అనేక పరీక్షలు మరియు పద్దతులు ఉన్నాయి. వాటిలో :

యూరిన్ టెస్ట్

బ్లడ్ టెస్ట్

సిటి స్కాన్ లేదా X-ray

ఆల్ట్రా సౌండ్ స్కానింగ్

ఇంట్రావీనస్ యూరోగ్రఫీ

మూత్రపిండాల బయట పడిన రాళ్ళుపై విశ్లేషణ

6. కిడ్నీ స్టోన్స్ చికిత్స:

6. కిడ్నీ స్టోన్స్ చికిత్స:

కిడ్నీ స్టోన్స్ సైజ్ మరియు ఏరకమైనవో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం. వైద్యపరంగా కాకుండా..

ఎక్కువగా నీళ్ళు తాగాలి కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాలి.

ఐబ్రూఫిన్ మరియు నెప్రోక్సిన్ సోడియం వంటి నొప్పి నివారిణిలు వాడవచ్చు.

మూత్రాశయం కండరాల నొప్పి నుండి సడలింపు పొందడానికి ఆల్ఫా-బ్లాకర్ వంటి ఉపశమన మందులు వాడవచ్చు.

7. పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ చికిత్స కొరకు ఈ క్రింది వాటిని కలిగి ఉన్న విస్తృతమైన చికిత్స అవసరం:

7. పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ చికిత్స కొరకు ఈ క్రింది వాటిని కలిగి ఉన్న విస్తృతమైన చికిత్స అవసరం:

బలమైన ప్రకంపనల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL)పద్దతి.

మూత్రపిండాల్లో పెద్ద రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స

రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి యురిటోరోస్కోప్ పద్దతి ఉపయోగించి మూత్రం ద్వారా సులభంగా వెళ్ళవచ్చు రాళ్ళు పాస్ అయ్యేలా చేస్తారు.

పారాథైరాయిడ్ గ్రంథి శస్త్రచికిత్స

8. కిడ్నీ రాళ్లను ఎలా నివారించాలి:

8. కిడ్నీ రాళ్లను ఎలా నివారించాలి:

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జీవనశైలిలో మార్పులు తీసుకోవాలి. అవి

ఎట్టి పరిస్థితిలోనూ నీళ్ళు తక్కువ తాగకండి , సాద్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా త్రాగాలి.

సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు. లెగ్యుమ్ వంటి వెజ్ ప్రోటీన్ తగ్గించాలి.

ఆక్సాలేట్ లు అధికంగా ఉన్నసోయా ప్రొడక్ట్స్, నట్స్ వంటి ఆహారాలు తగ్గించాలి.

క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించండి.

English summary

Kidney Stones: Symptoms, Causes, Diagnosis, Treatment And Prevention

Kidney stones (renal lithiasis or nephrolithiasis) are one of the most common illnesses in India. The main function of the kidney is to flush out all the excess water and blood impurities in the form of urine [1] . Certain substances like calcium oxalate, amino acids, and uric acid are left behind in the form of tiny particles and when the concentration of those accumulated substances increases, they get converted into hard and sharp crystalline stones known as kidney stones.
Story first published:Saturday, September 7, 2019, 16:20 [IST]
Desktop Bottom Promotion