Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే!
కొన్ని వంటకాలు చూస్తుంటేనే నోరూరతాయి, తింటుంటే ఆహా అనిపిస్తాయి. అలాంటి వంటకాల ముందు వరుసలో ఉండేదే మన బెండకాయ పెరుగు పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పెరుగు పచ్చడిని కలుపుకుని తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. ఇది కేవలం రుచికరమైనదే కాదు, మన పొట్టకు ఎంతో చలువ చేస్తుంది కూడా. వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు, కేవలం 10 నిమిషాల్లో చేసుకోగలిగే బెస్ట్ కంఫర్ట్ ఫుడ్ ఇది.

బెండకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా పెరుగు - 400 గ్రాములు
బెండకాయలు - 200 గ్రాములు
ఉల్లిపాయ - 1
అల్లం, పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
పసుపు - కొద్దిగా
కారం- 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
మెంతులు - పావు టీస్పూన్
ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్ చొప్పున
పచ్చి శనగపప్పు, మినప్పప్పు - 1 టీస్పూన్ చొప్పున
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెండు రెమ్మలు
బెండకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో 400 గ్రాముల తాజా పెరుగును వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి, ఉండలు లేకుండా ఎంతో క్రీమీగా, మృదువుగా వచ్చేలా బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు ఇందులో సుమారు ⅓ కప్పు నీళ్లు పోసి మళ్లీ కలుపుకోవాలి. పెరుగు పచ్చడి మరీ చిక్కగా కాకుండా, మీకు నచ్చిన విధంగా ఉండేలా నీళ్లను అడ్జస్ట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో తరిగి పెట్టుకున్న 200 గ్రాముల బెండకాయ ముక్కలను వేసి వేయించాలి. ముక్కలకు కొద్దిగా ఉప్పు, పసుపు పట్టించి మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి. బెండకాయలోని జిగురు పూర్తిగా పోయి, ముక్కలు కాస్త క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి.
-వేయించిన వేడి బెండకాయ ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు తాలింపు కోసం అదే పాన్ లో మరో స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఈ తాలింపు సువాసన వస్తుండగానే.. అందులో సన్నగా తరిగిన అల్లం-పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా 2-3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొద్దిగా పసుపు, కారం వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేయాలి.
-సిద్ధమైన ఈ వేడి వేడి స్పైసీ తాలింపును నేరుగా తీసుకెళ్లి బెండకాయపెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు పెరుగులో కలవగానే వచ్చే సువాసన మీ ఆకలిని రెట్టింపు చేస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పెరుగు పచ్చడి రెడీ.
-దీనిని తయారు చేసిన వెంటనే కాకుండా కాసేపు ఫ్రిజ్ లో పెట్టి చల్లగా వడ్డించండి. వేడి అన్నంలో ఈ చల్లటి పచ్చడి కలుపుకుని తింటుంటే.. ప్రతి ముద్దలోనూ క్రిస్పీ బెండకాయ, కరకరలాడే తాలింపు పప్పులు తగులుతూ ఆహా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications