Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
వేగంగా బరువు తగ్గాలా..? అయితే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి..!
బరువు వేగంగా తగ్గడానికి రకరకాల మందులను, ప్రోటీన్ పౌడర్లను, వెయిట్ లాస్ పరికరాలను కొనుక్కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇవన్నీ కాకుండా సహజమైన పద్ధతిలో సహజమైన జ్యూస్ లను చేసుకొనివేగంగా బరువు తగ్గవచ్చు. సహజమైన పద్ధతిని పాటించి నెలకి ఐదు నుంచి ఆరు కేజీల వరకు బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. శరీరంలో అనవసరంగా పేరుకున్న కొవ్వు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంటర్మీడియరీ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
60 రోజులపాటు ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్ ని పాటించడం ద్వారా శరీరం లోపల గుండెపై, లివర్ పై పేరుకున్న కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ 60 రోజుల డైట్ ప్లాన్ లో రోజుకి ఒకసారి భోజనం రెండుసార్లు జూస్ లను తాగుతాము.

ఉదయం లేవగానే పళ్లు తోముకోకుండానే లీటరున్నర నీళ్లను తాగండి. తరువాత 1 గంటలోపు మీకు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఈ గ్యాప్‌లో మీకు తోచిన మంచి వ్యాయామాలను, యోగాసనాలను చేసుకోవాలి. ఆఫీస్‌కు ఏమీ తినకుండానే అలాగే వెళ్లిపోవాలి. పదకొండు గంటలకు మళ్లీ రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లను తాగండి.
ఇలా మధ్యాహ్నం వరకు మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల ఫ్యాట్ లాస్ త్వరగా జరిగిపోతుంది. మధ్యాహ్నం వరకు ఇలా చేయడం వల్ల శరీరంలో వున్న కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. 12 గంటలకు ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే కూరగాయల జ్యూస్ కానీ తాగాలి. ఈ ఫ్రూట్ జ్యూస్‌లో కొంత ఎండు ఖర్జూర పొడిని, తేనెను కూడా వేసుకోవచ్చు.

మద్యహ్నం 1 నంచి 2 గంటలలోపు రెండు పుల్కాలను ఆకుకూరతో తినాలి. మిల్ మేకర్, రాజుమా గింజలతో కూరను చేసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయ్. పుల్కాతో కూరను ఎక్కువగా కలుపుకొని తినాలి. దీనివల్ల ప్రొటీన్లు, వైటమిన్లు పుష్కలంగా అందుతాయ్.
భోజనం చేసిన 2 గంటల తరువాత మధ్యమధ్యలో ఒక్కో గ్లాసును సాయంత్రం 6 గంటల వరకు తాగుతూనే వుండాలి. సాయంత్రం 7 గంటలకు ఒక గ్లాసు బత్తాయి జ్యూస్‌ను తీసుకోవాలి. ఇక దీంతో ఆరోజు ఆహారం తీసుకోవడం పూర్తయినట్టే. పడుకునే వరకు ఇక ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అవసరమైతే కొన్ని సార్లు నీళ్లను తాగవచ్చు. ఇలా 60 రోజులు చేయడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఒకవైపు కొవ్వు కరుగుతూనే మరోవైపు శరీరానికి అవసరమైన పోషకాలను, ప్రొటీన్లు అందుతాయ్.
పైన వున్న ఈ డైట్ పాటిస్తే నెలలో 6 కేజీల వరకు బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గడం, పోషకాలు అందడం మాత్రమే కాదు రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
ఈ డైట్ ను పాటించడం వల్ల నీరసం అస్సలు రాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు జ్యూస్‌లను పౌష్టికాహారన్ని కూడా అందిస్తున్నాం కాబట్టి. ఇక నీళ్లు తాగడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. కేవలం 60 రోజుల పాటు బయటి ఆహారాన్ని, జంక్ ఫుడ్‌ను తినకుండా వుండాలి. నాలుకను అదుపులో పెట్టుకుంటే బరువు తగ్గి మంచి శరీర ఆకృతి మీ సొంతం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications