Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
లోదుస్తులు లేకుండా పడుకుంటే ఇన్ని లాభాలా?.. శృంగార సామర్థ్యం కూడా..!
ప్రతి మనిషికి మాట్లాడుకోవడానికి సిగ్గుపడే విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం ఎక్కడా బహిరంగంగా చర్చించుకోము. కానీ అలాంటి వాటి గురించి మనం తెలుసుకుంటే మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అందులో ఒకటే రాత్రిపూట లోదుస్తులు లేకుండా పడుకోవడం. రాత్రి పూట లోదుస్తులు లేకుండా పడుకోమని చెబితే నవ్వే వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ లోదుస్తులు లేకుండా పడుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి నిద్రకు సహాయపడుతుంది..
లోదుస్తులు లేకుండా పడుకోవడం వల్ల గాలి సరఫరా బాగా జరుగుతుంది. దీని కారణంగా ప్రైవేట్ భాగాల్లో అనవసర తేమను నివారిస్తుంది. దీంతో సుఖవంతమైన నిద్రపడుతుంది. అలాగే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వంటి వ్యాప్తిని నిరోధిస్తుంది. అలాగే ఆ భాగాల్లో బ్యాక్టీరియా ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

ఇన్ఫెక్షన్ సమస్యను నివారిస్తుంది..
ప్రైవేట్ భాగాన్ని వెంటిలేషన్ చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు. తరచుగా ఇబ్బంది పెట్టే దురద, తామర వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఎలాంటి మందులు లేకుండా చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. లోదుస్తులు తీసేసి నిద్రపోతే ఆ ప్రాంతంలో తేమ ఉండదు, ఈ రకమైన దురద సమస్య దరిచేరదు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..
ప్రైవేట్ భాగంలో రక్త ప్రసరణ బాగా జరగాలి. లేకపోతే పలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ భాగాల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే అది లైంగిక సామర్థ్యాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. లోదుస్తులు లేకుండా నిద్రపోవడం పెల్విక్ ఆరోగ్యానికి మంచిది.
చర్మ ఆరోగ్యానికి మంచిది
లోదుస్తులు లేకుండా పడుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మంపై బొబ్బలు, దుర్వాసన, దురద వంటి సమస్యలు నివారిస్తుంది. అలాగే గోకుడు వంటి సమస్యలు రాకుండా
ఉంటాయి. నలుగురిలో ఇబ్బందికరంగా కూడా అనిపించదు.
పురుషులకు..
లోదుస్తులు ధరించి పడుకోవడం పురుషులకు చాలా మంచిది. ఇది పురుషుల ప్రైవేట్ ప్రాంతాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.స్త్రీలు లోదుస్తులనే కాదు, బ్రా కూడా తీయాలి. దీనివల్ల స్త్రీలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారిలో సంతానోత్పత్తి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications