ఓ మై గాడ్, జిమ్ లో వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇలా ఎందుకు?

ఓ మై గాడ్, జిమ్ లో వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇలా ఎందుకు?

ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు అకస్మిక గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోతున్నారు. ముఖ్యంగా జిమ్ లో వర్కౌట్ చేస్తే చనిపోయే వారికి సంఖ్య ఎక్కువగా ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ స్థానికంగా ఒక జిమ్ సెంటర్లో వ్యాయామం చేస్తూ గుండె పోటుతో మరణించాడు. అలాంటి దురదృష్టకర ఘటన మరొకటి కర్నూలులో జరిగింది. ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 28ఏళ్ళ యువకుడు జిమ్ సెంటర్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు, సాధారణ ప్రజలు గుండెపోటుతో చనిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి. వ్యాయామం శరీరానికి మంచిదని మనం విన్నాం. అయితే వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోతే...ఇటీవల కాలంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీని గురించి వైద్యనిపుణులు ఏమంటున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Heart Attack While Working Out In Gym:doing gym is good to health but not to heart what doctor says

నిశ్చల జీవనశైలిని అనుసరిస్తూ , రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వ్యాయామానికి స్త్రీ, పురుషుల మధ్య తారతమ్యం ఉండదు. చిన్నవారి నుంచి పెద్దల వరకు ఎవరైనా వ్యాయామం చేయవచ్చని విన్నాం. అయితే వృద్ధుల కంటే యువకులు వ్యాయామానికి మృత్యువాత పడుతుండడం నిజంగా బాధాకరం. వ్యాయామ సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఒక సందర్భం ఈ వ్యాసంలో ఉదాహరణ రూపంలో మీకు అందించబడింది.

సీసీటీవీ ఫుటేజీలో !

ఈ సందర్భంలో, జిమ్ చేస్తున్న వ్యక్తి పుష్-అప్ వ్యాయామం చేసిన తర్వాత కాస్త ఆయాసంగా ఉన్నట్లు ఈ CCTV ఫుటేజ్ చూపిస్తుంది.

కాసేపటి తర్వాత నేలపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్క సారిగా క్రిందకి కుప్పకూలిపోయాడు .

ఈ ఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతే కాకుండా ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య చాలా సార్లు ఎన్నో ఉదాహరణలుగా చూస్తూనే ఉన్నాం

జిమ్ చేస్తున్న వ్యక్తికి గుండెపోటు!

జిమ్ చేస్తున్న వ్యక్తికి గుండెపోటు!

సెలబ్రిటీలు ఈ తరహా మరణాలకు మినహాయింపు కాదు. జిమ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడం నిన్నటిది కాదు. గత ఏడాది టీవీ నటుడు సిద్దాంత సూర్యవంశీ, రాజు శ్రీవాస్తవ, పునీత్ రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ఇలాంటి కసరత్తులో మరణించారు. రోజురోజుకు ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి.

ఇలా అకస్మికంగా గుండెపోటు రావాడానికి కారణం ఏంటి?

ఇలా అకస్మికంగా గుండెపోటు రావాడానికి కారణం ఏంటి?

ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్నగా అనిపించవచ్చు. ఇలా వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెజబ్బులు ఎందుకు వస్తాయి? వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని మరియు గుండె బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల గుండె భరించలేదా? కార్డియాలజిస్ట్ లు ఏం చేబుతున్నారో తెలుసుకుందాం...

గుండెపోటు అంటే ఏమిటి?

గుండెపోటు అంటే ఏమిటి?

ఏదైనా సందర్భంలో, గుండె కండరాలకు అకస్మికంగా రక్త సరఫరా ఆగిపోతే, దానిని గుండెపోటు అంటారు. ప్రధానంగా గుండె కండరాలకు రక్తం అవసరం. అప్పుడే గుండె సక్రమంగా పని చేస్తుంది. కానీ గుండెపోటుకు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో అధిక రక్తపోటు, ధూమపానం, మధుమేహం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, అతిగా మద్యం సేవించడం మొదలైనవి.

వ్యాయామం చేయాల్సి వస్తే గుండెపోటు?

వ్యాయామం చేయాల్సి వస్తే గుండెపోటు?

దీనిని కార్డియాక్ అరెస్ట్ అని కూడా అనవచ్చు. విపరీతమైన వ్యాయామం చేసే సమయంలో గుండె రక్తనాళాలు, కండరాల కణజాలంలో విద్యుత్ అవాంతరాలు ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు

గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు

  • కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజలలో హార్ట్ అటాక్ లు పెరుగుతున్నాయి.
  • ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు.
  • దీనికి సంబంధించి కొన్ని సూచనలు ముందుగా ఇవ్వబడతాయి
  • ఛాతి నొప్పి
  • ఛాతీలో ఒక రకమైన చికాకు
  • కాళ్లు, చేతులు మొద్దుబారిపోతాయి
  • అలసట
  • సరిగా శ్వాస తీసుకోలేకపోవడం
  • చెమట పట్టుట
  • దవడ దంతాలు, మెడ, చేయి, వెన్ను, భుజం ఈ భాగాలలో నొప్పి

    వికారంగా అనిపిస్తుంది

  • తలతిరగడం
  • శరీరం సడలించే స్థాయికి అలసట
  • మహిళల్లో గుండెపోటు సంకేతాలు

    మహిళల్లో గుండెపోటు సంకేతాలు

    గుండెపోటు యొక్క లక్షణాలు స్త్రీలలో విభిన్నంగా కనిపిస్తాయి మరియు తక్కువ స్పష్టంగా లేదా పరిస్థితికి సంబంధం లేకుండా కనిపించవచ్చు.

    ఛాతీ నొప్పిని అనుభవించినా లేకున్నా స్త్రీలు గుండెపోటు యొక్క క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

    • నిద్రకు ఆటంకాలు
    • బలహీనత యొక్క ఆకస్మిక ఆగమనం
    • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
    • వికారం, అజీర్ణం లేదా ఇతర జీర్ణ రుగ్మతలు వంటి లక్షణాలు
    • వొళ్ళు నొప్పులు
    • సాధారణ అనారోగ్యం యొక్క భావన
    • వెనుక లేదా ఎగువ శరీర అసౌకర్యం
    • తుది గమనికలో...

      తుది గమనికలో...

      నష్టాన్ని తగ్గించడానికి మరియు గుండెపోటు నుండి పూర్తిగా కోలుకునే అవకాశాలను పెంచడానికి, మీరు వీలైనంత త్వరగా వాటిని గుర్తించి, తక్షణ వైద్య సంరక్షణను కోరడం అత్యవసరం. చిన్న సూచనను కూడా తీవ్రంగా పరిగణించాలి మరియు తనిఖీ చేయాలి. మీరు ఈ సమస్యలలో ఏవైనా అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వీటిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి...

      కొన్ని సందర్భాల్లో, మీ శరీరం భయంకరమైన సంకేతాలను ప్రదర్శిస్తూ ఉండవచ్చు, కాబట్టి మీ శరీరం వ్యక్తం చేస్తున్న సంకేతాలను విస్మరించవద్దు.

Desktop Bottom Promotion