Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Heart Health: గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ వ్యాయామాలు చేయండి
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఎలాంటి వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజూ ఎక్కడో ఒకచోట గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే చిన్న వయస్సు వారిలోనూ గుండె పోటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు మనతో ఉన్న వారు ఉన్నట్టుండి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేస్తోంది. గుండెపోటు రావడానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అయితే గుండెను కాపాడుకోవడం మాత్రం మన చేతుల్లోని ఉంటుంది.

మంచి జీవనశైలి, శారీరక శ్రమ, మంచి ఆహారం తీసుకోవడం, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా కీలకం. శారీరకంగా చురుకుండా ఉండటం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో మొదటి అడుగు. గుండె కండరాలను బలోపేతం చేయడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి, గుండెపోటుకు, స్ట్రోక్‌కు దారితీసే అధిక కొలెస్ట్రాల్, అధిక రక్త చక్కెర, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి వ్యాయామం చాలా కీలకం.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఎలాంటి వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏరోబిక్ వ్యాయామం:
ఏరోబిక్ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా రక్తపోటు, హృదయ స్పందన రేటు తగ్గుతుంది. వీటితో పాటు ఏరోబిక్ వ్యాయామం చేస్తే శరీరం ఫిట్ గా ఉంటుంది. ఏరోబిక్స్ తో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉంటే రక్తంలో గ్లూకోజ్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు, వారానికి కనీసం 5 రోజులు ఏరోబిక్స్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జంపింగ్ రోప్, హార్ట్ పంపింగ్ లాంటివి ఏరోబిక్ వ్యాయామాల కిందకు వస్తాయి.

రెసిస్టెన్స్ ట్రైనింగ్:
రెసిస్టెన్స్ ట్రైనింగ్ శరీరంపై నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది. కొవ్వును ప్రభావవంతంగా తగ్గిస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కలయిక వల్ల చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది.
వారంలో కనీసం రెండు రోజులు వరుసగా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ సిఫార్సు చేస్తోంది. బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ బ్యాండ్లతో పుషప్స్, పులప్స్, స్క్వాట్స్ లాంటివి రెసిస్టెన్స్ ట్రైనింగ్ కిందకు వస్తాయి.

స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్:
స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్ గుండె ఆరోగ్యానికి దోహదం చేయవు. వాటి వల్ల మస్క్యులోస్కెలెటల్ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. కీళ్ల నొప్పులు, తిమ్మిరి, కండరాల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
రోజూ వ్యాయామం చేయడానికి ముందు ఆ తర్వాత తప్పనిసరిగా స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ వర్కవుట్స్ తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications