Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Badam Milk Recipe : ఈజీగా బాదాం మిల్క్ రెడీ.. టేస్టు టేస్టు.. ఎనర్జీకి ఎనర్జీ..
ఈ ఎండా కాలంలో బయట పానియాలు తాగకుండా వాటిని ఇంట్లోనే చేసుకోండి. దీని వల్ల మీ బడ్జెట్ ఖర్చు తగ్గడమే కాదు మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా వుంచుతుంది. బయట తాయారు చేసే చల్లటి జ్యూసు షాపుల్లో నాణ్యమైన పళ్లను, పదార్ధాలను ఉపయోగించరు. వారికి వ్యాపారం ఒక్కటే ముఖ్యం, రుచికి ఇచ్చిన ప్రాధాన్యత శుభ్రతకు ఇవ్వరు కాబట్టి సమ్మర్ డ్రింక్స్‌ను సాధ్యమైనంతవరకు ఇంట్లోనే తయారు చేసుకోండి. మీకోసం ఈసారి బాదాంపాలను ఎలా తయారు చేసుకోవాలో అందిస్తున్నాం. బాదాం పాలల్లో ఫైబర్, వైటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ లాంటి పోషకాలు ఉంటాయ్. ఇందులో మెండుగా ఉండే క్యాల్షియం బొక్కలను బలంగా వుంచుతుంది. రోజూ బాదాం తీసుకుంటే చర్మం కూడా ఆరోగ్యవంతంగా కాంతివంతంగా తయారవుతుంది.
బాదాం మిల్క్ తయారు చేసే విధానం
ముందుగా 1 బౌల్‌లో 50 బాదాం పప్పులను తీసుకోవాలి. సమయం కుదిరితో 4 లేదా ఐదు గంటలు ముందుగానే ఈ బాదాం పప్పులను నానబెట్టుకోవాలి. ఒక వేళ ముందుగానే నానబెట్టకపోతే బాదాంపప్పు ఉన్న బౌల్‌లో కొన్ని వేడి నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత బాదాం పప్పులపైన ఉన్న పొట్టును తీసివేయాలి. నీళ్లల్లో బాదాం పప్పులు పూర్తిగా నానడం వల్ల వాటి పొట్టు సులభంగా వచ్చేస్తుంది.

బాదాం పేస్ట్
బాదాం మిల్క్ చేయడానికి ఒక అర లీటరు చిక్కని పాలను తీసుకోవాలి. చిక్కటి పాలైతే బాదాం మిల్క్ చాలా టేస్టీగా తయారౌతుంది. ఇప్పడు ఈ అరలీటరు పాలల్లోనంచి పావు కప్పు పాలు తీసుకోవాలి. ఈ పావుకప్పు పాలను, ఇంతకు ముందు పొట్టు తీసి పెట్టుకున్న బాదాం పప్పులను చిన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా రుచి, ఘాటు కోసం 4 యాలాకులను అందులో వేయాలి. మొత్తం మెత్తని పేస్ట్ అయ్యేంతవరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
బాదాం మిల్క్ రెడీ
ఇప్పుడు అరలీటరులో మిగిలిన పాలను ఒక కడాయ్‌లో తీసుకొని బాగా మరిగించాలి. అంతకుముందు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్‌ను పాలు మరుగుతున్న కడాయ్‌లో వేసి బాగా కలపాలి. బాదాంపేస్ట్ పాలల్లో ఉండలు రాకుండా చిన్న ఫ్లేమ్‌పైనే బాగా కలుపుకోవాలి. అందులో ఓ చిటికెడు సాఫరాన్‌ను వేయాలి. అయితే ఇది తప్పనిసరి కాదు. తరువాత రెండు కప్పుల చెక్కరను వేసుకొని కలపాలి. అలా 5 నిమిషాల పాటు కడాయ్‌లో ఉన్న పాలను చిక్కగా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఉండలు రాకుండా, అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. 5 నుంచి 7 నిమిషాల తరువాత కడాయ్‌ను కిందకు దించుకోవాలి. ఇక దీంతో మీ బాదాం మిల్క్ రెడీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications