Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎక్కువ ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా..? ఐతే ఈ టిప్స్ పాటించాల్సిందే..!
మనిషి ఎక్కువ ఏళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే దానికి తగిన ఆహారాన్ని, క్రమశిక్షణను కలిగి వుండాలి. ఎన్నో పరిశోధనల తరువాత మనిషి ఎక్కువ ఏళ్లు జీవించడానికి అతని జీవన విధానమే కారణమని కనుగ్గొన్నారు. ఆహారం తీసుకునే పద్ధతి వల్ల కూడా ఎన్నేళ్లు బ్రతకవచ్చో అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా కావడం వల్ల కొవ్వు ఎక్కువగా పెరిగి చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్న విషయం మనకు తెలిసిందే.

శ్వాస ముఖ్యం
మంచి గాలిని పీల్చాలి. ప్రతీ రోజూ ఉదయం ప్రాణాయామాన్ని తప్పకుండా చేసుకోవాలి. శరీరంలో ప్రాణవాయు సంచారం బాగా జరగాలంటే ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చుట్టూ పెరిగిపోతున్న కాలుష్యం, వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రాణాయామం తప్పకుండా చేయాల్సిందే. మెదడుకు ఆక్సీజన్ బాగా అందితేనే మెదడు చురుగ్గా వుంటుంది, శరీరంలో బలం పెరగాలన్నీ ఊపిరి బాగా పీల్చుకోవాలి. కాబట్టి దేనికైనా ముందుగా కావాల్సింది శరీరంలో మంచి గాలిని పీల్చుకోవడం. ప్రాణాయామం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజూ కనీసం 20 నిమిశాలు కచ్ఛితంగా ప్రాణాయామం చేయాలనే నియమాన్ని పెట్టుకోవాలి.
నీళ్లు తాగాలి
శరీరానికి అవసరమైనన్ని నీళ్లను తాగాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. నీళ్లని ఎలా పడితే అలాకూడా తాగకూడదు. సమయం, సందర్భం చూసుకొని తాగాలి. క్రమపద్ధతిలో నీళ్లను తాగితేనే లాభం వస్తుంది. తాగకూడని సమయాల్లో నీళ్లను తాగితే నష్టాలు ఎక్కువగా వస్తాయ్.
సరైన పోషకాలు
తినే ఆహారంలో సరైన పోషకాలు వుండేలా జాగ్రత్తపడాలి. రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా తినే ఆహారంలో వైటమిన్లు, ప్రొటీన్లు బాగా వున్నాయా లేదా చూసుకోవాలి. జంక్ ఫుడ్ ను మానుకోవాలి, నూనె, కొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవద్దు. శాఖాహారాల్లో ఎన్నో పోషకాలు వున్న కూరగాయలు, పళ్లు వున్నాయ్. ఇవి జీర్ణం కూడా సులభంగా అవుతాయ్. వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

వ్యాయామం
తిన్న ఆహారం వల్ల వచ్చే క్యాలరీలు బర్న్ కావాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రోజూ పనిచేసేందుకు శరీరంలో స్టామినా కావాలి. దానికోసం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. రాత్రి భోజనం చేసిన తరువాత అరగంట వాకింగ్ చేసుకోవాలి. ఉదయం లేవగానే సూర్యనమస్కారం చేసుకోవడం వల్ల మంచి లాభం వుంటుంది. దీని వల్ల మలవిసర్జన బాగా అవుతుంది. ఉదయమే శరీరం బాగా యాక్టివ్ అవడం వల్ల రోజంతా ఉల్లాసంగా వుంటారు. ఎంత బిజీగా వున్నా కూడా వ్యాయామాన్ని వాయిదా వేయవద్దు.
పొట్టను శరీరాన్ని శుద్ధిగా వుంచుకోవాలి
నీళ్లు ఎక్కువగా తాగుతారు కాబట్టి పొట్టను ఎప్పుడు శుద్ధిగా వుంచుకోవాలి. మూత్రం సరైన సమయానికి పోవాలి. రోజుకు రెండు సార్లు మలవిసర్జన చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగుతారు కాబట్టి మలబద్దకం సమస్య వుండదు. ఇలా చేయడం వల్ల కడుపులో బ్యాక్టీరియా, విషపు పదార్ధాలు ఏవి వున్నా అవి బయటకు వెళ్లిపోతాయ్.
విశ్రాంతి
శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇవ్వాలి. ఈ మధ్య చాలా మంది రాత్రి లేటుగా పడుకోవడం వల్ల రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. అలా కాకుండా త్వరగా నిద్రపోవాలి. కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరిగా వుండాలి. నిద్రబాగా పట్టాలంటే రాత్రి భోజనం త్వరగా చేయాలి. మానసిక ఒత్తిడిలను కూడా తగ్గించుకోవాలి. దీని వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయ్. శరీరం కూడా యాక్టివ్‌గా వుంటుంది.
పైన వున్న వాటన్నింటినీ క్రమం తప్పకుండా పాటిస్తే కచ్ఛితంగా 80 ఏళ్లపైగా బ్రతుకుతారని పరోశోధకులు, నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications