Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఏ శ్రమా లేకుండా.. పొట్ట చుట్టూ కొవ్వను ఇలా సింపుల్‌గా తగ్గించేకోండి..!
పొట్ట తగ్గించడం ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్‌లా మారిపోయింది. ఎన్ని వేలు ఖర్చుపెట్టినా, ఎన్ని వ్యాయామాలు, ఆసనాలు వేసినా కొందరికి పొట్ట మొదట్లో ఎలా వుంటుందో ఇప్పుడు కూడా అలాగే వుంటుంది. ఇక జీవితంలో పొట్ట తగ్గదేమోనని ఆందోళన చెందుతూ వుంటారు. దీనినే బెల్లీ ఫ్యాట్ అని ఆంగ్లంలో చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో ఎన్నో రకాల జ్యూసులు, రసాయనాలు ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి అమ్ముతున్నారు. కొందరు ఈ జ్యూస్‌లను, సప్లిమెంట్లను తాగి అనారోగ్యానికి గురౌతున్నారు. తీసుకునే ఆహారంపై నియంత్రన పెట్టకుండా, ఒక వైపు డైట్ సరిగ్గా ఫాలో కాకుండానే పొట్టను తగ్గించాలనుకోవడం చాలా కష్టం. ఇక్కడ మేము మీకోసం పొట్ట తగ్గించడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కొన్ని చిట్కాలను మీముందుకు తీసుకొని వచ్చాము. వీటిని పాటించి బెల్లీ ఫ్యాట్‌ను త్వరగా తగ్గించుకుందాం.
ప్రతి రోజు భోజనంలో అన్నం తినడం మనకు అలవాటే. ఈ అన్నం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా పెరిగిపోతుంది. అన్నంలో పోషకాలు ఎక్కువగా వుండవు. వుండేవి కొన్ని కార్బోహైడ్రేట్లు మాత్రమే. అన్నంలో క్యాలరీలు కూడా ఎక్కువగా వుంటాయ్. కాబట్టి భోజనంలో అన్నాన్ని సాధ్యమైనంత తగ్గించాలి. అన్నం ఎంత తక్కువ చేస్తే బరువు అంత త్వరగా తగ్గడానికి ఆస్కారం వుంటుంది.

అన్నం స్థానంలో పుల్కాలను తీసుకోవాలి. రెండు నుంచి మూడు పుల్కాలను కూరతో కలపుకొని తినడం వల్ల పోషకాలు అంది క్యాలరీలు ఎక్కువగా పెరగకుండా, కొవ్వు ఎక్కువగా పెరగకుండా వుంటుంది.
ఒక వేల అనుకోకుండా, తప్పని పరిస్థితుల్లో ఒక పూట అన్నం గనుక ఎక్కువగా తింటే తరువాత రెండు పూటలు వాటర్ ఫాస్టింగ్ చేయాలి. నీళ్లల్లో తేనెవేసుకొని కలుపుకొని తాగాలి. ఇలా తరువాత రెండు పూటలు చేయడం వల్ల మంచి ఫలితం వుంటుంది. మధ్యహ్నం అన్నం గనుక ఎక్కువగా తింటే, ఆ రోజు రాత్రి, తరువాత రోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. ఈ రెండూ పూటలు వాటర్ ఫాస్టింగ్‌తో గడపడం వల్ల బరువు పెరగకుండా బ్యాలెన్స్ చేసిన వారవుతారు. మద్యాహ్నం రెండు గంటల వరకు వాటర్ ఫాస్టింగ్‌ను చేయాలి.
అన్నాన్ని పూర్తిగా మానివేసి పుల్కాలు, జొన్న రొట్టెలు తినడం అలవాటుగా చేసుకోవాలి. రైస్ ఐటెమ్స్ ఏవి వున్నా వాటిని పూర్తిగా మానివేయాలి.
జ్యూస్ ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. 20 రోజుల వరకు ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. రోజూ ఉదయం లేవగానే 7 గంటల సమయంలో కూరగాయల జ్యూస్‌ను, 12 గంటలకు ఏదైనా ఒక పళ్ల రసం, మద్యాహ్నం 3 గంటలకు ఒక పళ్ల రసం, సాయంత్రం 5 గంటలకు ఒక గ్లాసు చెరుకు రసం, ఇక చివర్లో సాయంత్రం 8 గంటలకు ఒక పళ్ల రసం తాగాలి. రోజుకు ఇలా 5 గ్లాసుల పళ్ల, కూరగాయల రసాన్ని 20 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే పొట్ట చుట్టూ వున్న కొవ్వు ఖచ్ఛితంగా తగ్గిపోతుంది.
రోజూ తినే ఆహారం కారం ఎక్కువగా వుండేలా చూసుకోవాలి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్ చేపలను తినడం వల్ల కూడా పొట్ట తగ్గుతుంది. సాల్మన్ చేపల్లో వుండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును కరిగించే లక్షణాన్ని కలిగి వుంటాయ్.
గుడ్డులో వున్న పచ్చ సొన వల్ల కూడా కొవ్వు తగ్గుతుందని పరిశోధకుడు చెబుతున్నారు. పచ్చసొనలో వుండే కొలిన్ అనే పదార్ధం, కొవ్వను కరిగిస్తుందని అంటున్నారు. అవకాడో పళ్లు కూడా పొట్టను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే అవకాడో పళ్లల్లో వుంటుంది.
రోజూ తినే భోజనంలో దాల్చిన చెక్క వుండేలా చూసుకోవాలి. శరీరం సన్నబడేలా చేసే లక్షణం దాల్చిన చెక్కలో వుంటుందని పరిశోధనలో తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











