Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మానసిక ఒత్తిడిని ఇలా సింపుల్‌గా తగ్గించుకుందాం..! 100 % శాంతి..!
ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్య మానసిక వత్తిడి. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల వళ్లు నొప్పుడు వచ్చేవి. ఇప్పుడు మానసకి శ్రమతో పాటు కొత్త సమస్యలు చాలా రావడం వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చనేదానిపై మీకు కొన్ని టిప్స్‌ను అందిస్తున్నాము. వీటిని ఫాలో అయి మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.
మెడిటేషన్
మెడిటేషన్, లేదంటే ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనసు మెదడు ప్రశాంతంగా మారుతుంది. మెడిటేషన్‌లో చాలా పద్ధతులు వున్నాయ్. ఏ పద్ధతి ఫాలో అయినా మానసిక ఒత్తిడి దూరమౌతుంది. ఒత్తిడి తగ్గించడంలో చాలా శక్తివంతమైన ఆయుధమని గ్రహించాలి. ధ్యానం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయ్. ఒక రకమైన ధ్యాన పధ్దతిలో కళ్లుమూసుకొని ఏమీ ఆలోచించకుండా కేవలం మనసులో జ్యోతి వున్నట్లు ఊహించుకోవమంటారు, ఇంకో రకమైన ధ్యాన పధ్దతిలో శ్వాసపైన ధ్యాస పెట్టమంటారు.
సంబంధాలు
సమాజంలో సంబంధాలు పెంచుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని కనుగ్గొన్నారు. ఎక్కువ సంబంధాలు వున్న వారిలో ఒత్తిడి లక్షనాలు తగ్గువగా వున్నట్లు గుర్తించారు. బంధువులను, కుటుంబ సభ్యులకు కలవడానికి తగిన సమయాన్ని కేటాయించాలి. నేరుగా కలవకున్న వారితో ఫోన్ కాల్స్ లో , వీడియో కాల్స్‌లో కనెక్ట్ అయి వుండాలి.

అరోమా థెరపీ
కొన్ని రకాల ద్రవాలు, నూనెలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయ్. చామోమైల్, యలాంగ్, లావెండర్ లాంటి నూనెలు శరీరం చర్మంపై రాసుకొని మసాజ్ చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
క్రియేటివ్ పనులు
క్రియేటివ్ పనులను చేస్తూ వుంటే వాటి నుంచి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. పెయింటింగ్, డ్రాయింగ్ సంగీతాన్ని ఇన్స్‌ట్రుమెంట్లతో వాయిచడం లాంటి చేయడం వల్ల మానకిక ఒత్తిడి తగ్గుతుంది.
డీప్ బ్రీతింగ్
గట్టిగా గాలిపీల్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెదడు, మనసు ప్రశాంతంగా మారుతుందని అంటున్నారు. బ్లడ్ ప్రెజెర్ కూడా ఆటోమెటిక్‌గా తగ్గుతుంది. బీపీ మెషిన్ ద్వారా పల్స్ రేట్ చూసుకొని తరువాత 7 నుంచి 8 సార్లు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల పల్స్‌రేట్ నార్మల్‌లోకి రావడాన్ని మనం నేరుగా చూడవచ్చు.
నవ్వడం యోగం
ఎక్కువగా నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. నవ్వడం వల్ల హ్యపీ హార్మోన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. నవ్వడం వల్ల ఆక్సీజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని చెబుతున్నారు.
కుక్కలు
కుక్కలను పెంచుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కుక్కలను నిమరడం వల్ల వాటిని చూడ్డం వల్ల అవి దగ్గరకు రావడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గడమే కాకుండా స్ట్రెస్ హార్మోన్లు కూడా తగ్గుతాయని అంటున్నారు.
గార్డనింగ్
గార్డెనింగ్ వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెట్లను నాటుతూ వుంటే, పువ్వులను కోస్తూ వుంటే అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రకృతితో కలిసి వుండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఇష్టమైన సినిమా
మీరు చిన్న వయసులో చూసిన మీకు నచ్చిన సినిమాలను చూడ్డం వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అప్పటి ఘ్నాపకాలు గుర్తుకురావడంతో రిలాక్స్ అవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications