Latest Updates
-
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి!
బాబా రామ్‌దేవ్ చెప్పినట్లు చేస్తే..నెలలోనే కుండలాంటి పొట్ట కూడా కరిగి..నడుము నాజూగ్గా!
ఈ రోజుల్లో మనదేశంలో సగానికి పైగా ప్రజలను వేధిస్తున్న సమస్య ఊబకాయం. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు, ఒక పెద్ద సవాలుగా మారుతుంది. పొట్ట కొవ్వు కరిగించడం ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది. అయితే ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ సమస్యకు అద్భుతమైన, సహజసిద్ధమైన పరిష్కారాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సూచించారు. ఆయన సూచించిన పద్ధతులు ఆచరిస్తే,కుండలాంటి పొట్టను కరిగించి, నాజూకైన నడుమును సొంతం చేసుకోవడం ఖాయం.
ప్రాణాయామంతో కొవ్వుకు చెక్
బాబా రామ్‌దేవ్ చెప్పేదాని ప్రకారం పొట్ట కొవ్వును తరిమికొట్టడంలో ప్రాణాయామం ఒక శక్తివంతమైన ఆయుధం. ముఖ్యంగా కపాల్ భాతి ప్రాణాయామం దీనికి అమోఘంగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే..సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని, నెమ్మదిగా శ్వాస పీల్చుకుని, వేగంగా, శక్తివంతంగా శ్వాసను బయటకు వదలాలి. శ్వాసను బయటకు వదిలినప్పుడు, పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది ఒక లయబద్ధమైన ప్రక్రియ. ప్రతిరోజూ కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు కపాల్‌భాతి సాధన చేయాలి. ఈ ప్రక్రియలో పొట్ట కండరాలు చురుకుగా కదలడం వల్ల అక్కడ పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడం మొదలవుతుంది. అంతర్గత అవయవాలకు చక్కటి మసాజ్ అంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ రేటు పెరిగి, శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. ముఖంలో తేజస్సు కూడా పెరుగుతుంది.

అగ్నిసార్ క్రియ
పొట్ట తగ్గించడంలో బాబా రామ్‌దేవ్ సూచించిన మరో అద్భుతమైన యోగ క్రియ అగ్నిసార్ క్రియ. దీనిని ఎలా చేయాలంటే వజ్రాసనంలో లేదా నిలబడి కొద్దిగా ముందుకు వంగి, చేతులను మోకాళ్లపై ఉంచి, పూర్తిగా శ్వాసను బయటకు వదిలేయాలి. ఇప్పుడు,పొట్టను వేగంగా లోపలికి, బయటకు కదిలించాలి. శ్వాస తీసుకోకుండా వీలైనన్ని సార్లు ఈ కదలికను చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో చేయడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి. ఇది శరీరంలో జీర్ణశక్తి అనే అగ్నిని ప్రజ్వరిల్లజేస్తుంది. ఉదర కండరాలు ఉత్తేజితమై, కొవ్వు కణాలు విచ్ఛిన్నమవుతాయి. శరీరం నుండి విషపదార్థాలు బయటకు పంపబడతాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆసనాలతో ఆకర్షణీయమైన శరీరాకృతి
ప్రాణాయామంతో పాటు కొన్ని యోగాసనాలు కూడా పొట్టను తగ్గించి, శరీరాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడతాయని బాబా రాందేవ్ సూచించారు.
త్రికోణాసనం..నడుము భాగంలోని కొవ్వును, ప్రక్కల పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నెముకకు కూడా మేలు చేస్తుంది.
నౌకాసనం..పడవ ఆకారంలో శరీరాన్ని ఉంచే ఈ ఆసనం, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే,పొట్ట చదునుగా మారుతుంది.
ఆహార నియమాలు
బాబా రామ్‌దేవ్ యోగా ఎంత ముఖ్యమో, ఆహార నియంత్రణ కూడా అంతే కీలకమని తెలిపారు. వేపుళ్లు, నూనె పదార్థాలు, స్వీట్లు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, మైదాతో చేసినవి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి కేవలం రుచిని మాత్రమే అందించి, శరీరానికి హానికరమైన కొవ్వులను, అనవసరమైన కేలరీలను అందిస్తాయి.
వీటిని తినండి
మొలకెత్తిన గింజలు, తాజా ఆకుకూరలు, పీచుపదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు బీన్స్, క్యారెట్, క్యాబేజీ వంటివి, జామ, బొప్పాయి, ఆపిల్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతినిస్తాయి.
యోగా, ఆహారంతో పాటు కొన్ని ఆయుర్వేద పదార్థాలు కూడా బరువు తగ్గడంలో సహకరిస్తాయని బాబా రామ్‌దేవ్ సూచిస్తారు. త్రిఫల చూర్ణం,తిప్పతీగ రసం,కలబంద రసం,ఉసిరి రసం,నిమ్మరసం-తేనె తీసుకోవడం మేలు చేస్తుందని తెలిపారు.
జపానోళ్ల దీర్ఘాయుష్షు సీక్రెట్ లీక్..ఇట్ల చేస్తే 100 ఏళ్లు ఈజీగా బతకొచ్చు!
ఆరోగ్యకరమైన జీవనశైలి
శరీర హార్మోన్లను అదుపులో ఉంచడానికి సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం చాలా ముఖ్యం. ఒత్తిడి లేని జీవితం గడపడం వల్ల కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. యోగా, నిద్ర, మరియు ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తాయి, ఇది బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుందని బాబా రాందేవ్ తెలిపారు. మీరు గనుక మీ కుండ బొడ్డును వదిలించుకోవాలనుకుంటే, కనీసం ఒక నెల పాటు ఈ పద్ధతులను నిరంతరం పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











