Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
జపానోళ్ల దీర్ఘాయుష్షు సీక్రెట్ లీక్..ఇట్ల చేస్తే 100 ఏళ్లు ఈజీగా బతకొచ్చు!
ఈ మధ్య కాలంలో తరచూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఫిట్ నెస్ గురించి ప్రజలకు ఎక్కవగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన తరుచుగా తన ఉపన్యాసాల్లో కూడా ఫిట్ నెస్ గురించి ప్రస్తావిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండటం చాలా అవసరం.ఈ బిజీ లైఫ్ స్టైయిల్ లో చాలామంది తాము తక్కువ టైంలోనే ఫిట్ నెస్ సాధించాలని కోరుకుంటారు. ఈ కోరికే జపనీస్ వాకింగ్ ను పాపులర్ చేసింది. ప్రస్తుతం జపనీస్ వాకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్(IWT)అని పిలుస్తుంటారు. దీని అద్భుతమ ప్రయోజనాలు తెలిశాయంటే మీరు కూడా ఈ రోజు నుంచే దీన్ని స్టార్ట్ చేస్తారు.
IWT అంటే ఏమిటి?
నిజానికి IWT చాలా సులభం. IWTలో మూడు నిమిషాల పాటు చురుకైన నడక, మూడు నిమిషాల పాటు సులభమైన నడక విరామాలు ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలు కలిపి 30 నిమిషాల సెషన్ లో 5 సార్లు పునరావృతమవుతాయి. అంటే మీరు 30 నిమిషాల నడకలో 3 నిమిషాలు వేగంగా 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఈ పద్ధతి మీ ఫిట్ నెస్ ని మెరుగుపర్చడమే కాకుండా మీ వయస్సును తగ్గించుకున్నట్లు కనిపించంలో కూడా సహాయపడుతుంది.

IWT ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా నెమ్మదిగా నడవడం కంటే IWT మీ జీవక్రియ, గుండె ఆరోగ్యం, కొవ్వును కరిగించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జపాన్ లో జరిగిన శాస్త్రీయ పరిశోధనలు ఈ నడక శైలిని అనుసరించిన వ్యక్తులలో కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు,కండరాల బలం కూడా మెరుగుపడ్డాయని నిరూపించాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక 68 ఏళ్ల వ్యక్తి చురుకైన నడక సమయంలో తన హృదయ స్పందన రేటును నిమిషానికి 130 బీట్స్ పెంచుకున్నాడు.. ఇది మితమైన సైక్లింగ్ సెషన్‌కు సమానం.
IWTలో కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా నడవడం వల్ల శరీర శక్తి ఉత్తేజితమవుతుంది. ఇది జీవక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ మోడల్ మీ హార్ట్ బీట్ రేటును పెంచుతుంది, కండరాల సమన్వయాన్ని, వృద్ధులలో సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది, అవయవాలను విషరహితం చేస్తుంది, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది.
ఇలా కూడా
మీరు మీ 30 నిమిషాల జపనీస్ నడకకు మరింత తీవ్రతను జోడించాలనుకుంటే కొన్ని వైవిధ్యాలను ప్రయత్నించవచ్చు. మీ నడకకు తేలికపాటి బరువులను జోడించడం వల్ల మీ కండరాలు టోన్ అవుతాయి, ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. మీరు ఇంట్లోనే వ్యాయామం చేయాలనుకుంటే జిగ్ జాగ్ మార్గాలు, వెనుకకు నడకలు లేదా ఫిగర్-8 ట్రాక్‌లు వంటివి ట్రై చేయండి. ఇవి మీ కండరాలను సక్రియం చేయడమే కాకుండా మీ మనస్సును కూడా బిజీగా ఉంచుతాయి. ఈ జపనీస్ నడక కేవలం వ్యాయామం కాదండోయ్ ఇది మీ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును పెంపొందించే ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
