Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కండలు తిరిగిన దేహం కోసం కష్టపడుతున్నారా? ఇవి తెలుసుకుంటే మీ శ్రమ వృథా కాదు
మంచి కండలు తిరిగిన శరీరం కావాలని చాలా మందికి ఉంటుంది. సిక్స్ ప్యాక్, బైసెప్స్, వి షేప్డ్ బాడీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అదేమంత సులభంగా వచ్చేది కాదు. తీవ్రంగా చెమటోడ్చాల్సిందే. నోరు కట్టేసుకుని, తీవ్రంగా శ్రమిస్తే కానీ మంచి కండలు తిరిగిన దేహం సాధ్యం కాదు.
మీరు కోసం మంచి ఫ్యాట్ లెస్ బాడీ, కండలు, సిక్స్ ప్యాక్ కావాలని, రోజూ జిమ్ లో కష్టపడుతుంటే.. కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడం వల్ల మీరు పడే కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. కండలు పెంచే చాలా మంది కొన్ని అపోహలను నిజాలని నమ్ముతుంటారు. వాటి వల్ల పడిన కష్టం వృథా అవుతుంది. అందుకే ఆ అపోహలేంటో, నిజాలేంటో తెలుసుకోవడం ముఖ్యం.

వ్యాయామం చేయకపోతే కండరాలు కొవ్వుగా మారతాయి!
వ్యాయామాలు చేయకపోతే కండరాలు తగ్గిపోతాయన్నది నిజం. వెయిట్ లిఫ్టింగ్ సమయంలో తీసుకున్నన్ని కేలరీలు తీసుకుంటూ ఎక్సర్‌సైజ్‌లు మానేస్తే తీసుకున్న కేలరీలు కరగక కొవ్వుగా పేరుకుపోతాయి. దీనర్థం కండరాలు కొవ్వుగా మారడం కాదు. వ్యాయామం చేయకుండా కేలరీలు అదే స్థాయిలో తింటూ పోతే కండరాలు తగ్గడం, కొవ్వు పెరగడం జరుగుతుంది. కండరాలు కొవ్వుగా మారడం అనేది అసాధ్యం.
ఉదయం వ్యాయామం చేస్తే కండరాలు త్వరగా పెరుగుతాయి!
ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా ఎప్పుడూ వ్యాయామం చేసినా, వెయిట్ లిఫ్టింగ్ చేసినా కండరాలు పెరుగుతాయి. అయితే ఒక రోజు ఉదయం, మరికొన్ని రోజులు సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల బాడీ ఒక రొటీన్ కు అలవాటు పడలేదు. కాబట్టి మీకు ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వీలైతే సాయంత్రం చేయడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి.
బరువు ఎత్తడం వల్ల స్త్రీలు బల్కీగా కనిపిస్తారు!
ఆడవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి చాలా కీలకం. అయితే వారిలో ఈ హార్మోన్ మోతాదు తక్కువగా ఉండటం వల్ల వారు బల్కీగా కనిపించే అవకాశాలు తక్కువ. టెస్టోస్టెరాన్ స్థాయిలు ఆడవారిలో ఉన్నదాని కంటే మగవారిలో 10 రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే వారు బల్కీగా కనిపిస్తారు.
కండలు కావాలంటే భారీ బరువు ఎత్తాలి!
ఎంత బరువులు ఎత్తుతున్నారన్నది కాదు, ఎంత తరచుగా ఎత్తుతున్నారన్నదానిపైనే కండరాల పెరగడం ఆధారపడి ఉంటుంది. వీలైనంత ఎక్కువ కాలం కండరాలను టెన్షన్ లో ఉంచడం కండరాల పెరుగుదలకు కీలకం. అధిక బరువులు లేకుండా ఇంటి పట్టునే ఉంటూ కూడా కండలు పెంచుకోవచ్చు. తక్కువ బరువుతో ఎక్కువ రిపిటీషన్లు చేసినా, ఎక్కువ బరువుతో తక్కువ రిపిటీషన్లు చేసినా అదే స్థాయిలో ప్రయోజనం ఉంటుంది.
వ్యాయామం తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి!
వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా ప్రోటీన్ తీసుకోవచ్చు. ప్రోటీన్ తీసుకోవడం, కండర ద్రవ్యరాశి లాభాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. కండరాలను పునర్నిర్మించడంలో, రికవరీలో ప్రోటీన్ షేక్ లు మరింత ప్రభావవంతంగా పని చేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.
మజిల్ సోర్‌నెస్ అంటే కండరాలు పెరుగుతున్నాయని సంకేతం!
నో పెయిన్ - నో గెయిన్ అనే సూత్రం ఇక్కడ పని చేయదని పలు అధ్యయనాల్లో తేలింది. కండరాలు నొప్పి పెట్టినంత మాత్రాన అవి పెరుగుతున్నట్లు కాదని, నొప్పి పెట్టడం లేదు కాబట్టి అవి పెరగడం లేదని కాదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications