For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంగస్తంభన మెరుగుపరచడంలో వయాగ్ర కంటే శక్తివంతమైనవి

|

చాలా మంది మధ్య వయస్కులకు అంగ స్థంభన ఓ సమస్యగా ఉంటుంది. దీంతో తమలోని సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయగ్రా వంటి మాత్రలను వాడుతుంటారు. వయాగ్ర అంటేనే కామేచ్చను పెంచడం మరియు మొత్తం సెక్సువల్ ఆరోగ్యానికి సహాయపడుతుందని భావిస్తారు. అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. ఇది ఒక సాధరణ సమస్య. ముఖ్యంగా ఈ మద్యకాలంలో, ఆహారపు అవాట్లు, ఒత్తిడి, లైఫ్ స్టైల్ వల్ల మధ్యవయస్కుల వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. ముఖ్యంగా వయాగ్ర మందుల వల్ల సెక్స్ హార్మోనులు ఉత్తేజపరిచి అంగస్తంభన సమస్యను నివారించడానికి సహాయపడుతుంది.

ఇలా తాత్కాలికంగా అంగస్తంభన సమస్యను నివారించుకోవడానికి ఇలాంటి రసాయనిక మందుల వాడకంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఉత్తమమైన మార్గం. పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్నవారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు.

ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలను పురుషులు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారి శరీరంలోని(అంగాలకు) రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దాని వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగి, తత్ఫలితంగా బలమైన అంగస్తంభనలు ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈక్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలు వయాగ్ర కంటే పవర్ ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి, వీటిని పురుషులు తప్పనిసరిగా రెగ్యులర్ గా తీసుకోవాలి. మరి వయాగ్ర అంతటి శక్తి సామర్థ్యాలు, పోషక విలువలు కలిగి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

వాటర్ మెలోన్(పుచ్చకాయ)

వాటర్ మెలోన్(పుచ్చకాయ)

పుచ్చకాయ: పుచ్చపండు చల్లటిదే కావచ్చు రోజులో తరచుగా తీసుకుంటే, మీ లైంగిక జీవితం మెరుగవుతుంది. సహజమైన వయాగ్రా గా పేర్కొనవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్లు వుంటాయి. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి లైంగిక ఆనందం పెంచుతుంది. అంగ స్తంభన సమస్యలకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది.

వాల్ నట్

వాల్ నట్

అంగస్తంభన సమస్యలను నివారించడంలో డ్రై నట్స్ ఎప్పుడు గ్రేట్ గా సహాయపడుతాయి. డ్రైఫ్రూట్స్ ఒకటి అయిన వాల్ నట్ లో ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ బి3 పుష్కలంగా ఉన్నాయి. ఇవి పురుషుల్లో వీర్యకణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. మరియు మేల్ సెక్స్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణను పెంచుతుంది.

గుడ్డు

గుడ్డు

అంగస్తంభన మెరుగుపరిచే ఫుడ్స్ లో గుడ్డు ఒక బ్రిలియంట్ ఫుడ్. గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

ఆకుకూరలు

ఆకుకూరలు

యూనివర్సల్ హెల్తీ ఫుడ్స్ లో గ్రీన్ లీఫ్ ఒకటి. ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా గ్రేట్ ఫుడ్. ఇది వయాగ్రకంటే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు మెగ్నీషియం, విటిమిన్ ఇ పుష్కలంగా ఉండి ఒక నేచురల్ వయగ్రాల పనిచేస్తుంది. పురుషుల్లో శారీరక ఆరోగ్యానికి మరియు లైంగిక జీవితానికి బాగా సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ఒత్తిడి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చాక్లెట్ ను 'గాడ్స్ ఆహారం' అని కూడా పిలుస్తారు. చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్ లో ఫెని లెథ్య్లమినె (PEA) మరియు సెరోటోనిన్ ఉండుట వల్ల మెదడు ఉత్తేజం కొరకు మరియు శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి. చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని స్టడీలు చెపుతున్నాయి.

అరటిపండు

అరటిపండు

ఇది దాని లింగ ఆకారంతో మాత్రమే కాకుండా, అరటిలో అసంఖ్యాకంగా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. నేచురల్ బూస్టర్ గా పనిచేస్తుంది. సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది . ఒక అరటి పండులో విటమిన్ A,B మరియు C మరియు పొటాషియం ఉంటాయి. విటమిన్B మరియు పొటాషియం శరీరంలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి. అరటి పండులో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే బ్రోమేలిన్ ఉంటుంది. అరటిపండులో అధిక స్థాయిలో చక్కెర ఉండుట వల్ల కొద్దిసేపు శక్తి ఇవ్వటానికి సహాయపడుతుంది.

అవొకాడో

అవొకాడో

ఈ పండు స్త్రీ, పురుషుల ఇద్దరి సెక్సువాలిటీకి సంబంధం కలిగి ఉంటుంది. పండు విలాసవంతమైన మరియు ఆకారంలో స్త్రీ లింగములో ఉంటుంది. కానీ పండ్లు చెట్టు నుండి జతలలో వేళ్ళాడుతూ ఉంటాయి. అవి ఎక్కువగా పురుషుడు వృషణాలను ప్రతిబింబించేలా ఉంటాయని చెబుతారు. అజ్టెక్ గా ఉపయోగించే అవకాడో చెట్టును వృషణాల చెట్టు అని పిలుస్తారు. అవకాడోలో విటమిన్ బి6 మరియు హెల్తీ ఫ్యాట్స్, బీటా కెరోటిన్,మెగ్నీషియం,విటమిన్ E, పొటాషియం మరియు ప్రోటీన్ ల ఒక గొప్ప మూలం కలిగి ఉంటుంది. ఇవి అన్ని మీ లైంగిక వాంఛను పెంచటానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి.

యాలకలు

యాలకలు

వయాగ్రాకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ఆహారాల లిస్ట్ లో టాప్ లో ఉండే ఆహారపదార్థం యాలకలు. ఇది పురుషుల్లో వయాగ్ర వలె పనిచేస్తుంది పురుషుల్లో లైంగిక సమస్యల నివారణకు యాలకులను అనేక ఆయుర్వేధ చికిత్సలో ఉపయోగించారు. ఇది వ్యక్తిలో ఉత్సుకతకు జతచేస్తుంది.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

ఫ్రాన్స్ లో 19 వ శతాబ్దంలో పెండ్లి కొడుకులకు ఆస్పరాగస్ ను వివాహానికి కేవలం ఒక రోజు ముందు ఇచ్చేవారు. ఆస్పరాగస్ పొటాషియం,విటమిన్ B6,విటమిన్ ఎ,సి,థయామిన్ మరియు ఫోలిక్ ఆమ్లం వంటి గొప్ప మూలాలను కలిగి ఉంది. ఫోలిక్ ఆమ్లం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉద్వేగం చేరుకోవడానికి సహాయం చేసే హిస్టామిన్ ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ పుట్టుక లోపాలు తగ్గిస్తుంది. అందువల్ల ఆస్పరాగస్ ఒక గర్భిణికి బాగా సహాయపడుతుంది. ఆస్పరాగస్ జెనిటో మూత్ర వ్యవస్థ లో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ప్రసిద్ధి చెందింది.

English summary

10 Excellent Foods That Naturally Act Like Viagra


 Viagra is widely talked about when it comes to boosting sexual drive and overall sexual health. The drug sees its application in treating erectile dysfunction and impotency in men. A common disorder that widely affects adult men, the drug helps to boost erection by stimulating sex hormones.
Story first published: Thursday, November 27, 2014, 16:27 [IST]
Desktop Bottom Promotion