Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
హై టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ తగ్గించే ఈ పవర్ ఫుల్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి..
హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి హైపర్ టెన్షన్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ ను ప్రమాధాన్ని తగ్గించుకోవాలంటే, మనం తీసుకొనే రెగ్యులర్ డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.
హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణం వల్ల ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, కిడ్నీ సమస్యలు మరియు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్ వల్ల, కిడ్నీ, మెమరీ పవర్ మరియు సెక్స్ డ్రైవ్ మీద తీవ్రప్రభావం చూపుతుంది.
READ MORE: హైబ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్ తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్
ఇలాంటి పరిస్థితిలో హైపర్ టెన్షన్ కు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల, రెగ్యురల్ గా చెకప్ చేయించుకోవడం మంచిది. తర్వాత హైపర్ టెన్షన్ ను అండర్ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి. మనం తీసుకొనే ఆహారం రక్తకణాల మీద ఎఫెక్టివ్ గా పనిచేసి హార్ట్ యొక్క బరువును తగ్గిస్తుంది మరియు శరీరం యొక్క ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది.
READ MORE: బిపిని కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్స్ తినండి..
మరి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం...

స్కిమ్డ్ మిల్క్(వెన్న తీసిన పాలు):
వెన్న తీసిన పాలను త్రాగాలి. వెన్న తీసిన పాలలో విటమిన్ డి మరియు క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మీలోని హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లూ బెర్రీస్:
పండ్లలో బ్లూబెర్రీస్ కూడా హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది. బ్లూబెర్రీస్ లో ఉండే యాంథోసైనిన్ ను హైపర్ టెన్షన్ యొక్క లక్షణాలను తగ్గిస్తుంది. మరియు బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూర్చుతుంది.

ఆకుకూరలు:
ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫొల్లెట్, పొటాసియం మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆకుకూరలు హెల్తీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఔషధగుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నది. రెగ్యులర్ గా కొన్ని లవంగాలు తినడం వల్ల హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

బంగాళదుంపలు:
పొటాటోలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల, ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

బీన్స్:
కిడ్నీ బీన్స్ లో కూడా పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ ను కొద్దిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది మరియు ఇది హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది.

సోయాబీన్స్:
మీరు హైపర్ టెన్షన్ తో బాధపడేటప్పుడు సోయాబీన్స్ ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని బిపి కంట్రోల్ అవుతుంది.

అరటిపండ్లు:
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో సోడియంను తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు.

బీట్ రూట్:
బిపిని అండర్ కంట్రోల్లో ఉంచడానికి బీట్ రూట్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. చాలా తక్కువ సమయంలోనే బిపిని కంట్రోల్ చేస్తుంది.

కోకనట్ వాటర్:
హైపర్ టెన్షన్ తగ్గించడంలో కోకనట్ వాటర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వారంలో మూడు సార్లు కొబ్బరి నీళ్లు త్రాగడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది.

తృణధాన్యాలు :
మీ రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలను తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను పాజిటివ్ మార్గంలో తీసుకెళుతుంది.



Click it and Unblock the Notifications