Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
5 లివర్ (కాలేయం) యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రెండ్లీ ఫుడ్స్
లివర్ (కాలేయం)మన శరీరంలోని అది పెద్ద అవయవం. మన శరీరంలోని జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో ఉదరంలో కుడివైపున ఉంటుంది. లివర్ జబ్బుపడినా కూడా తనను తాను బాగు చేసుకోగల సామర్థ్యం కలది . శరీరానికి కావల్సిన శక్తిని తయారుచేసుకోగలదు. జీర్ణక్రియలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వర్తించే అవయం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది పెద్దగ్రంధి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా .
కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.
READ MORE:లివర్(కాలేయాన్ని)శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్...
ఇన్నిరకాలుగా బాధ్యతలు నిర్వహించే కాలేయం ధూమపానం, మద్యం వల్ల త్వరగా జబ్బునపడుతుంది. కాబట్టి, అలా జరగకుండా ఎప్పటికప్పుడు కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి. కాలేయాన్ని శుభ్రం చేసే ఆహారాలను తినడం చాలా మంచిది. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. మరియు ఈ ఆహారాలు లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఇది మీ జీవక్రియలను ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

వెల్లుల్లి:
ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది. సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

బీట్ రూట్ :
బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. డయాబెటిక్ లివర్ ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

ఆపిల్స్ :
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :
శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.

ఉల్లిపాయలు:
ఉల్లిపాయల్లో ఫైబర్, పొటాషియం, ఫ్లెవనాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రీషీయన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications