Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మజిల్స్ అండ్ మజిల్ మాస్ బిల్డ్ చేయడానికి 10 బెస్ట్ ప్రోటీన్ షేక్స్
అందమైన మజిల్స్ ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ మజిల్స్ బిల్డ్ చేయడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా పురుషులు, మజిల్ బిల్డప్ కోసం జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే జిమ్ తో మాత్రమే సరిపోదు,. జిమ్ తో పాటు, ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు, మజిల్ బిల్డప్ చేసుకోవచ్చు.
ప్రోటీన్ షేక్స్ ఆరోగ్య పరంగా వివిధ రకాలుగా పనిచేస్తుంది . మీకు తెలిసిన ప్రోటీన్ షేక్స్ అన్నింటిని మజిల్ బిల్డింగ్ కోసం రెగ్యులర్ గా తీసుకోవడం ఉత్తమం. రెగ్యులర్ డైట్ తో పాటు ప్రోటీన్ షేక్స్ తీసుకొనే వారికి ఇతర సప్లిమెంట్స్ ఏవి అవసరం ఉండవు . గుడ్లు, చీజ్, మిల్క్, పెరుగు, చికెన్, సాల్మన్, రైస్, బ్రెడ్, బీన్స్, నట్స్, మరియు టోఫు వంటి ఆహారాల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.
ముఖ్యంగా క్రీడాకారులు శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. మరియు ఎక్కువ లాభం కూడా. ఇది మజిల్ మాస్ మరియు ఎక్స్ ట్రా ప్రోటీన్ సప్లిమెంట్ . కొన్ని పరిశోధన ద్వారా ప్రతి క్రీడాకారుడు వారి శరీర బరువును బట్టి, ఒక కేజి బరువుకు 1గ్రాము ప్రోటీన్ అవసరం అవుతుందని కనుగొన్నారు. అదేవిధంగా ట్రైనర్ మరియు బిగినర్స్ కు కూడా మజిల్ మాస్ ఏర్పడుటకు ఎక్కువ ప్రోటీనులు అవసరం అవుతాయి. అలాగే వర్కౌట్స్ వల్ల ఏర్పడ్డ గాయాలను మాన్పడానికి ప్రోటీనులు అధికంగా అవసరం అవుతాయి.
ప్రోటీన్ సప్లిమెంట్ పౌడర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి (ఎగ్ వైట్, సోయా, పచ్చిబఠానీలు మరియు రైస్ ప్రోటీన్ )వంటి వాటిలో ఎక్కువగా ఉన్నాయి. మజిల్స్ ఏర్పడటానికి ఇంకా కొన్ని బెస్ట్ ప్రోటీన్ మిల్క్ షేక్స్ ఈ క్రింది విధంగా...

హాట్ కోక:
హాట్ కోక ప్రోటీ షేక్. అందుకు 1 కప్పు ఫ్యాట్ ఫ్రీ మిల్క్, 2 ప్యాకెట్ మిల్క్ చాక్లెట్ హాట్ కోక, 1 స్కూప్ చాక్లెట్ మరియు అరకప్పు లోఫ్యాట్ కాటేజ్ చీజ్ తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసి బ్లెడ్ చేయాలి. మొత్తం మిశ్రమం బ్లెండ్ అయ్యే వరకూ స్మూత్ గా బ్లెండ్ చేయాలి. దీన్ని బెడ్ టైమ్ కు ముందు తీసుకోవడం మంచిది.

క్రీమీ ఆరెంజ్ :
కలర్ ఫుల్ స్మూతీ డ్రింక్ కోసం : 1కప్పు ఆరెంజ్ జ్యూస్, అరకప్పు ఫ్యాట్ ఫ్రీ వెనీల యోగర్ట్ మరియు 1స్కూప్ వెనీలా వే ప్రోటీన్ , ఈ పదార్థాలన్నింటిని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయాలి . ఆరెంజ్ ప్రోటీన్ షేక్ మార్నింగ్ డ్రింక్స్ కు ఫర్ఫెక్ట్ డ్రింక్ . 30గ్రాములు ప్రోటీన్స్ మరియు 280 గ్రాముల క్యాలరీలు అందుతుంది.

చాక్లెట్ బాదం బ్రౌనీ:
ఇది కూడా మునుపటి షేక్స్ వంటివే . వ్యాయామం చేయడానికి ముందు త్రాగడానికి ఫర్ఫెక్ట్ డ్రింక్ . దీన్ని బ్లెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్కూప్ చాక్లెట్ వే ప్రోటీన్ ను ఒక కప్పు ఫ్యాట్ ఫ్రీ మిల్క్ లో మిక్స్ చేయాలి. ఇప్పుడు దీని మీద చిన్న ముక్కలుగా తరిగిన బ్రౌనీ మరియు బాదంను గార్నిష్ చేయాలి. ఈ మిశ్రమంలో ప్రోటీన్స్ 40గ్రామలు 500క్యాలరీలు పొందుతారు.

చాక్లెట్ పీనట్ బట్టర్ :
మజిల్స్ బిల్డ్ చేయడంలో ప్రోటీన్ షేక్స్ తో పాటు చాక్లెట్ పీనట్ బటర్ ను కూడా ఒక బెస్ట్ ప్రోటీన్ షేక్. రెండు స్కూప్ ల చాక్లెట్ ప్రోటీన్, 2 స్పూన్ల హెవీ వైపింగ్ క్రీమ్, 1స్పూన్ ఫ్లాక్స్ మీల్, 1స్పూన్ పీనట్ బట్టర్, వాటర్, మరియు కొన్ని ఐస్ క్యూబ్స్ మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. ఈ పదార్థాల మిశ్రమం చాలా గ్రేట్ గా ఉంటుంది.

కాఫీ షేక్:
కాఫీ లవర్స్ కోసం ఇది ఒక అద్భుతమై డ్రింక్ . దీన్ని తయారుచేయడం చాలా సింపుల్ . ఒక కప్పు హాట్ కాఫీ , రెండు స్పూన్ల తేనె మరియు చాక్లెట్ వే ప్రోటీన్ తీసుకొని కాఫీలో వేసి బాగా మిక్స్ చేయాలి.

లెమన్ ట్విస్ట్:
లెమన్ ట్విస్ట్ ప్రోటీన్ షేక్ కు కావల్సినది లెమనేడ్, ఒక స్కూప్ వెనీలా, కేసిన్ ప్రోటీన్ మరియు ఒక కప్పు వెనీలా ప్రోటీన్ మరియు ఒక స్కూప్ వెనీలా వే ప్రోటీన్ ను బ్లెండర్లో వేసి బ్లెడ్ చేయాలి . ఈ ప్రోటీన్ షేక్ ను ట్రైనింగ్ షెషన్ పూర్తి అయిన తర్వాత త్రాగాలి . ఇందులో 40గ్రాముల ప్రోటీన్ అందుతుంది.

బనానా షేక్:
బానాన ప్రోటీన్ షేక్ ను దీన్ని వివిధ రకాలుగా వాడుకుంటారు . ఒక పద్దతిలో డార్క్ చాక్లెట్ ను , బానాన షేక్ తో మిక్స్ చేసి రిచ్లీ ఫ్లేవర్డ్ షేక్ గా తయారుచేసుకుంటారు . అందులో రెండు స్కూప్ ల చాక్లెట్ ప్రోటీన్ ను , తియ్యగా లేని బాదం పాలు వేసి , అరటిపండును ముక్కలుగా కట్ చేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా డార్క్ చాక్లెట్ చిప్స్ మరియు దాల్చిన చెక్కను వేయాలి.

ఫ్పూటీ ఫ్రోటీన్ షేక్:
ఈ ప్రోటీన్ షేక్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది . దీన్ని తయారుచేయడాకి కావల్సింది మూడు స్పూన్ల డైరీ బేస్డ్ ప్రోటీన్ పౌడర్, ఒక కప్పు ఆపిల్ జ్యూస్ లేదా నాన్ ఫ్యాట్ మిల్క్, సగం అరటిపండు, ఒక స్పూన్ వీట్ జెర్మ్, ఒక కప్పు పీచ్ లేదా 3స్ట్రాబెర్రీలు వేసి బ్లెండ్ చేయాలి . అంతే దీన్ని తీసుకోవడం వల్ల మజిల్ మాస్ ఏర్పడుతుంది.

కోకనట్ బాదం జాయ్ :
కోకనట్ బాదం చాలా అద్భుత టేస్ట్ కలిగిన మిల్క్ షేక్ రెండు స్కూప్స్ చాక్లెట్ ప్రోటీన్ , ఒక కప్పు అన్ స్వీటెండ్ బాదం మిల్క్, 2 స్పూన్ల డార్క్ చాక్లెట్ చిప్స్, రెండు స్పూన్ల బాదం బట్టర్ మరియు తియ్యగా లేని కొకొబ్బరి తీసుకోవాలి . వీటిని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి . ఈ ప్రోటీన్ షేక్ చాలా టేస్ట్ గా ఉంటుంది.

పీచ్ ప్రోటీన్ :
రోజులో తీసుకోవల్సిన మరో ప్రోటీన్ షేక్ పీచ్ ప్రోటీన్ . అరకప్ప ప్రోటీన్ పీచ్ ఫ్రూట్, ఒక కప్పు వాటర్ అరకప్పు పెరుగు మరియు రెండు స్కూప్ లా వెనీలా ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే షుగర్ ఫ్రీ ఆపిల్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకొని బ్లెడ్ చేసి త్రాగవచ్చు.



Click it and Unblock the Notifications











