Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సమ్మర్ ఫేవరెట్ ఫ్రూట్ వాటర్ మెలోన్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
వేసవికాలం వస్తోందంటే చాలు ప్రపంచంలో అందరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనికి వాటర్ మెలోన్ అనే పేరు స్థిరపడింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మనకు లభిస్తాయి.
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా, వేసవిలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్ కి, చిటికెడు పెప్పర్ కలిపి తీసుకుంటే.. సూపర్ బెన్ఫిట్స్
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. అలాగే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే ప్రయోజనాలు కూడా ఎన్నో....ఎన్నెన్నో...తెలుసుకోవాలంటే...

బరువు తగ్గడానికి:
కొవ్వు పదార్థాలు అత్యంత తక్కువుగానూ, పీచు పదార్థాలు అధికంగానూ ఉండే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి వరం లాంటింది.

గుండెకు:
గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్-బి6వల్ల గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.

కీళ్ళ నొప్పులు:
వబలమైన కీళ్ళ కోసం: దోసకాయలోని సిలికా కీళ్ళ జాయింట్లను, సహాయపడే కణజాలాలకు పటిష్టం చేయడానికి బాగా సహాయపడుతుంది.

పళ్ళు మరియు చిగుళ్ళ ఆరోగ్యానికి:
దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడేవారికి పుచ్చకాయ రసం చాలా సహాయపడుతుంది.

క్యాన్సర్:
పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడుతుంది.

డయాబెటిస్:
పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి. గుండెజబ్బులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి.

ఫ్లూ:
జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి సమయంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది.

పురుష హార్మోనులను రెట్టింపు :
వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ (తర్భూజా)లో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేగాకుండా ఈ లైకోపీన్ వీర్యకణాలు ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8 శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది.

జీర్ణశక్తికి పుచ్చకాయ చాలా మంచిది.
జీర్ణశక్తికి పుచ్చకాయ చాలా మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ శరీర జీర్ణప్రక్రియను సులువుగా, సజావుగా పనిచేయిస్తుంది. పుచ్చకాయ కడుపు నొప్పి, విరేచనాలను పోగొడుతుంది. పుచ్చపండు తింటే అజీర్ణంతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.

మూత్రవ్యాధులన్నిటినీ నివారిస్తుంది
పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి.

అధిక రక్తపోటు
అధిక రక్తపోటున్నవారు పుచ్చకాయలను ఎక్కువగా తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. హైబీపి: రక్తపోటు (హైబీపీ)ని తగ్గించడానికి, నివారించడానికి సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. సాధారణ స్థాయికి మించి హైపర్‌టెన్షన్ కనిపిస్తున్న వారు రోజూ పుచ్చకాయ తినడం మంచిది. దీనిలోని సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరచి ఉంచేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనల్లో తెలిసింది.

మలబద్దకం:
కర్బూజ తినడం వల్ల శరీరంలోని అధిక వేడి తొలగిపోతుంది. దీంతో పాటు కర్బూజలోని విటమిన్-ఏ, విటమిన్-బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తిగా శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. దీనికి తోడు ఇందులో ఉండే పొటాషియమ్ రక్తపోటును, గుండెపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. దీనివల్ల ఎన్నో వ్యాధులు నివారితమవుతాయి.

కంటి ఆరోగ్యానికి:
పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను (కంటిలోపలి పొర క్షీణించి పోవటం) సైతం నిరోధిస్తుంది.

వేడిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్ శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. ఇందులో అధికంగా ఉండే నీటిశాతం దాహాన్ని తీరుస్తుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

మహిళల్లో చక్కటి స్తన ఆకృతి:
వీటిలో పుష్కలంగా లభ్యమయ్యే కెరొటినాయిడ్లు మహిళల్లో స్తనాల ఆకృతి చక్కగా ఉండేలా చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.



Click it and Unblock the Notifications