Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హెత్తీ ఫుడ్సే కానీ, గ్యాస్ట్రిక్ మరియు పొట్టఉబ్బరానికి కారణం అవుతాయి? మరి నివారణ ఎలా?
ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లలో కారణంగా చాలా వరకూ ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మరియు కడుపుబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు . ఇది ప్రతి ఒక్కరిలోనూ ఏదోక సందర్భంలో ఎదుర్కొనే సమస్యలే. మరి ఈ సమస్యకు గల కారణాలు లేదా ఆహారాల గురించి ఖచ్ఛితంగా తెలుసుకోవాలి.
సాధారణంగా అప్పుడప్పుడు, పొట్టనిండుగా ఉన్న ఫీలింగ్, ఉబ్బరంగా ఉన్నట్లు అసౌకర్యంగా ఉన్నట్లైతే అది పొట్ట గ్యాస్ట్రిక్ ట్రబుల్ కు సంకేతంగా గుర్తించాలి. అంతే కాదు ఈ సమస్య ఉన్నప్పుడు ఏపనిచేయాలనిపించదు మరియు నలుగురిలో వెళ్ళాలినిపించదు. అంతే కాదు పొట్టలో గ్యాస్ వల్ల వేరే ఏఇతర ఆహారాలు తీసుకోవాలనిపించదు, ఆకలి కాదు, తరచూ వాష్ రూమ్ కు వెళ్ళాలనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా డిప్రెషన్ కు కూడా గురౌతుంటారు.
పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!
పొట్టలో గ్యాస్ మరియు కడుపుబ్బరానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు , కానీ పొట్టలలో చాలా ఇబ్బంది కలిగించే ఈ సమస్యకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా కారణం అవుతాయి. ఇవి పొట్టలో సరిగా జీర్ణం కాకపోవడం వల్ల క్రమంగా పొట్టలో గ్యాస్ చేరుతుంది. దాంతో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇది నొప్పి మరియు స్టొమక్ అప్ సెట్ కు దారితీస్తుంది.
ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు
స్టొమక్ గ్యాస్, మరియు బ్లోటింగ్ కు ఏ ఆహారాలు కారణం అవుతాయో వాటిని అనారోగ్యకరమైనవిగా గుర్తించాలి . అదే విధంగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా గ్యాస్ కు కారణం అవుతాయి. మరి అలాంటప్పుడు హెల్తీ ఫుడ్స్ ను తీసుకోకపోవడం మంచిది కాదు. అలా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోనందున శరీరంలో న్యూట్రీషియన్స్ లోపం ఏర్పడుతుంది . కాబ్టటి, గ్యాస్ కు కారణం అయ్యే ఆహారాలకు మాత్రమే దూరంగా ఉండాలి. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం....

బీన్స్ లేదా ధాన్యాలు:
బీన్స్ హెల్తీ ఫుడ్. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం రెగ్యులర్ డైట్ నుండి మిస్ చేయడానికి లేదు . కానీ ఈ హెల్తీ ఫుడ్ వల్ల చాలా మంది కడుపుబ్బరం మరియు బ్లోటింగ్ సమస్యలను ఎదుర్కొంటారు . కాబట్టి ఈ సమస్యనుండి బయటపడుటకు ఒక సులభ మార్గం ఉంది . వండటానికి ముందు రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం తయారుచేయడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లి తిన్న తర్వాత చాలా మంది కడుపుబ్బరం మరియు గ్యాస్ సమస్యలకు గురి అవుతుంటారు. వెల్లుల్లిలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ వీటిని తినడం వల్ల కడుపుబ్బరం, అసౌకర్యంగా ఉంటుందని ఈ హెల్తీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయడానికి లేదు. కాబట్టి, వెల్లుల్లి తినడానికి ముందు బాగా ఉడికించాలి. గార్లిక్ తినడానికి ఇది ఒక మంచి మార్గం .

ఉల్లిపాయ:
పచ్చిఉల్లిపాయా గ్యాస్ కు కారణం అవుతుంది. వీటిలో ఫ్రక్టాన్స్ ఉంటాయి. ఇది గ్యాస్ కు కారణం అవుతాయి. ఈ వెజిటేబుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కడుపబ్బరాన్ని నివారించడానికి వీటిని బాగా ఉడికించి తీసుకోవాలి. ఉడికించి లేదా వేయించి తిన్నా కూడా కడుపుబ్బరంగా ఉంటే కొన్ని మసాలాలు మరియు హెర్బ్స్ (యాలకలు, దాల్చినచెక్కతో) ఉడికించి తీసుకోవాలి.

బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజ్:
క్య్రూసిఫెరస్ వెజిటేబుల్స్ గ్యాస్ కు కారణం అవుతాయి . ఈ ఆహారాలు బరువుతగ్గడానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు వీటిలో ఫైబర్, ఐరన్, మరియు ఇతర విటమిన్స్, మినిరల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో వీటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి. స్టొమక్ ట్రబుల్స్ ను హ్యాండిల్ చేయాలన్నా, పొట్టఫుల్ గా బ్లోటింగ్ తో ఉన్నా, ఇలాంటి క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ దూరంగా ఉండాలి. వీటికి ప్రత్యామ్నాయంగా ఆకుకూరలు, కీరదోస, జ్యూసిచ్చిని మరియు లెట్యూస్ తీసుకోవచ్చు.

గోధుమలు:
గులిటిన్ సెన్సివిటి ఉన్నవారు కడుపుబ్బరం మరియు గ్యాస్ కు కారణం అవుతుంది . గోధుమల్లో ఉండే గులిటిన్ అలర్జీకి కారణం అవుతుంది. గులిటిన్ లోపం ఉన్నట్లైతే వివిధ రకాల లక్షణాలున్నాయి . వాటిలో స్కిన్ రాషెస్ నుండి కడుపుబ్బరం వరకూ కారణం అవుతాయి. గోధుమలు, లేదా గోధుమపిండితో తయారుచేసిన వంటలు తిన్న తర్వాత స్టొమక్ ట్రబుల్స్ తో బాధపడుతున్నట్లైతే అప్పుడు మీకు ఇది అలర్జీగా గుర్తించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా ఓట్స్, బక్వీట్, క్వీనా ను తీసుకోవచ్చు.

డైరీప్రొడక్ట్స్:
పాలు, చీజ్, పెరుగు, బట్టర్ మొదలుగునవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ ఇవి గ్యాస్ట్రిక్ కూడా కారణం అవుతాయి . కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా కోకనట్ మిల్క్, బాదం మిల్క్, సోయా మిల్క్, మొదలగునవి తీసుకోవాలి. ఈ డైరీప్రొడక్ట్స్ కు ప్రత్యామ్నాయంగా ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.

బార్లీ:
బార్లీ బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ . ఇందులో ఫైబర్స్, విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టను ఫుల్ ఫిల్ చేస్తాయి . ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకొన్న తర్వాత అసౌకర్యంగా ఫీలైతే , వాటి స్థానంలో బ్రౌన్ రైస్, బక్వీట్, ఓట్స్ మరియు క్వీనా వంటివి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications