Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
నోటి వాసనను నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!
నోటి దుర్వాసనకు ముఖ్య కారణం నోటి పరిశుభ్రత పాటించకపోవడం , హైపోథైరాయిడిజం,చిగుళ్ల వ్యాదులు, నోట్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్, కొన్ని జీర్ణ సమస్యలు, సైనస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కారణం కావచ్చు.
నోటి నుండి దుర్వాస, పాచి వాసన కొడుతుంటే, ఎవరితో అయినా మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా సోషియల్ లైఫ్ ను గడిపేవారిలో ఇటువంటి సమస్య అస్సలుండకూడదు. కొన్ని ఆహారాలు బ్యాడ్ బ్రీత్ ను తొలగించి, వెంటనే నోట్లో రిఫ్రెష్ గుణాలను అందిస్తాయన్న విషయం మీకు తెలుసా?
నోటి దుర్వాసనే అసిడిక్ బ్రీత్ అని కూడా అంటారు, ఇటువంటి పరిస్థితిలో వ్యక్తి నోటి నుండి వచ్చే వాసన ఎదుటి వారిని చాలా ఇబ్బందికి గురిచేస్తుంది.

నోటి దుర్వాసనకు ముఖ్య కారణం నోటి పరిశుభ్రత పాటించకపోవడం , హైపోథైరాయిడిజం,చిగుళ్ల వ్యాదులు, నోట్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్, కొన్ని జీర్ణ సమస్యలు, సైనస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కారణం కావచ్చు.
ఇటువంటి ఇబ్బంది కలిగించే, నలుగురూ అసహ్య పడేలా చేసే బ్యాడ్ బ్రీత్ ను తొలగించుకోవడానికి ప్రయత్నించకపోతే, పరిస్థితి మరింత వరెస్ట్ గా తయారవుతుంది. ఈ నోటి సమస్య కారణంగా మీకు ఇష్టమైన వ్యక్తులు కూడా మిమ్మల్ని దూరం చేసుకుంటారు.
బ్యాడ్ బ్రీత్ ను ఎఫెక్టివ్ గా తొలగించుకోవడానికి సరైన నోటి పరిశుభ్రత మార్గాలను ఎంపిక చేసుకుని, వాటిని రెగ్యులర్ గా అనుసరించాలి. . అయితే వీటితో పాటు, ఇన్ స్టాంట్ గా నోటి దుర్వాసనను దూరం చేసే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. రిఫ్రెషింగ్ బ్రీత్ ను అందిస్తుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఫాలీ ఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉండటం వల్ల ఇవి బ్యాడ్ బ్రీత్ ను తొలగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. నోట్లో, నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ ఫాలీఫినాల్స్ ఉపయోగపడుతాయి.

క్యాప్సికమ్:
పచ్చి క్యాప్సికమ్ తిడనం వల్ల నోటి దుర్వాసన ఇన్ స్టాంట్ గా తొలగించుకోవచ్చు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

యాపిల్స్ :
యాపిల్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తుంది. బ్రీతింగ్ ను రిఫ్రెష్ చేస్తుంది, ముఖ్యంగా గార్లిక్ ఎక్కువ తినే వారిలో ఇటువంటి సమస్యను కంట్రోల్ చేస్తుంది.

లవంగాలు:
లవంగాలు మంచి ఆరోమా వాసనతో, మంచి రుచి కలిగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు, కాబట్టి, నోట్లో ఒకటి రెండు లవంగాలు వేసుకుని నమిలినా,ఇన్ స్టాంట్ గా ఫ్రెష్ బ్రీత్ పొందుతారు.

బ్రొకోలి:
బ్రొకోలిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో మంచి సామర్థ్యం కలది బ్రొకోలి. ఇది ఎక్కువ వాసన రాకుండా , మంచి వాసన వచ్చేట్లు సహాయపడుతుంది.

సోంపు :
సోంపులో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నోట్లో పెరిగే బ్యాక్టీరియాను తొలగిస్తుంది .దాంతో మీ నోటి వాసన ఫ్రెష్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications
