థైరాయిడ్ సమస్యను నివారించే హెల్తీ ఫుడ్స్

By Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుత కాలం మారుతున్న జీవన శైలీ, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అవి హైపోథైరాయిడ్ (అండరాక్టివ్ థైరాయిడ్)మరియు హైపర్ థైరాయిడిజం(ఓవరాక్టివ్ థైరాయిడ్). ప్రస్తుతం ఇది కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ గా మారింది. చాలా మందికి ఆ లక్షణాలు బయటపడే వరకూ వారి థైరాయిడ్ ఉందని కనుక్కోలేరు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం, నిరాశ, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, అలసట, బరువులో హెచ్చుతగ్గుల తేడాలు లేదా తక్కువ శరీర శక్తి వంటి రుగ్మతల యొక్క తీవ్రమైన లక్షణాలు ఎదురైతే తప్ప థైరాయిడ్ ను గుర్తించలేరు.

థైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలు

థైరాయిడ్ గ్రంథి కేవలం వాయిస్ బాక్స్ క్రింద ఉంటుంది. ఇది గొంతు బాగానికి ఇరువైపులా రెండు అంగుళాల పొడవు గ్రంథి. ఇది శరీరం యొక్క జీవక్రియ మరియు కాల్షియం సంతులనం నియంత్రిస్తుంది. చాలా మంది ఈ సమస్యతో (థైరాయిడ్ గ్రంధి అతిక్రియ లేదా హైపోథైరాయిడిజం) బాధపడుతున్నారు. ఈ సమస్యకు వైద్యపరంగా చికిత్స్ ఉంది. అయితే హైపోథైరాయిడిజంను సహజపద్దతుల ద్వారా నివారించుకోవడానికి లేదా ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి మీ ఆహారంలో కొన్ని థైరాయిడ్ ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చి థైరాయిడ్ కు మీరే సొంతంగా థైరాయిడ్ చికిత్స చేసుకోవచ్చు.

అలర్ట్ : థైరాయిడ్(హైపో థైరాయిడ్)కు చెక్ పెట్టే వన్ అండ్ ఓన్లీ హెల్తీ డ్రింక్..!!

మరి మీకు థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా లేదా ఉన్న థైరాయిడ్ సమస్యను నివారించుకోవాలన్నా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు, మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. వీటితో పాటు థైరాయిడ్ హెల్త్ ను మెరుగుపరుచుకోవాలంటే ఈ క్రింది నియమాలను పాటించాలి.

1. స్వయంగా మీ అంతట మీరు థైరాయిడ్ ఉందో లేదో , అందుకు అండర్ లైయింగ్ కారణాలేంటో తెలుసుకోవాలి.

2. ఆహారాల్లో ఉప్పు కొద్దిగా చేర్చుకోవాలి.

3. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

4. మెడిటేషన్ చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది.

5. శుద్దమైన నీళ్లు తాగడం,స్వచ్చమైన గాలి పీల్చడం మంచిది.

6. బాగా నిద్రపోవాలి.

7. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవల్సిన ఆహారాలేంటో తెలుసుకుందాం..

1) పండ్లు

1) పండ్లు

ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా,కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఉపాయం. పండ్లలో ముఖ్యంగా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీస్, గోజి బెర్రీ, క్రాన్ బెర్రీ, చెర్రీస్, రెడ్ ప్లమ్, కివి, టమోటోలు, క్యారెట్స్, స్వీట్ పొటాటో వంటివి మీ డైలీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి.

2) వెజిటేబుల్స్

2) వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. కూరగాయల ద్వారా ఎక్కువ ఫైబర్ శరీరానికి అందటం వల్ల అలసట నుండి బయటపడవచ్చు. అంతే కాదు జీర్ణ శక్తిని పెంపొందించుకోవచ్చు. హైపోథైరాయిడిజం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ధాన్యాలు, మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న బ్రొకోలీ, కాలీఫ్లవర్, కేల వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ హెల్త్ మెరుగుపడుతుంది.

3) త్రుణ ధాన్యాలు

3) త్రుణ ధాన్యాలు

బీన్స్ స్ప్రౌంట్స్, థైరాయిడ్ హెల్త్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బీన్స్ శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. బీన్స్ స్పౌట్స్ సూప్స్, సలాడ్స్, స్టీవ్, వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం

4) టోఫు

4) టోఫు

టోఫులో అమినో యాసిడ్స్ , ఐరన్, క్యాల్షియం, మరియు ఇతర మైక్రో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ హెల్త్ ను మెయింటైన్ చేయడానికి ఇది చాలా సహాయపడుతుంది. టోఫును సోయాతో తయారుచేస్తారు. దాంతో థైరాయిడ్ గ్రంథులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రొసెస్ చేసిన సోయా ప్రోటీన్ షేక్, సోయా పౌడర్, వంటి థైరాయిడ్ ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని తీసుకోకూడదు.

5) నట్స్

5) నట్స్

బ్రాజిల్ నట్స్, మకడామియా నట్స్, హాజల్ నట్స్ వంటి వాటిలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇవి థైరాయిడ్ గ్రంథుల పనితీరు క్రమబద్దం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజులో 1 లేదా 2 బ్రాజిల్ నట్స్ , గుప్పెడు ఇతర నట్స్ ను కూడా తీసుకోవాలి. ఆకలిగా ఉన్నప్పుడు, గుప్పెడు నట్స్ తింటే మంచిది.

6) ఆలివ్ ఆయిల్

6) ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో హెల్తీ ఫ్యాట్స్,న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ను విడుదలకు సహాయపడుతాయి. ఇంకా ఇది ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసి, బరువు తగ్గిస్తాయి. హార్ట్ ను హెల్తీగా మార్చుతాయి. అయితే ఆలివ్ ఆయిల్ ను 10 టేబుల్స్ స్పూన్లకు మించి తీసుకోకూడదు.

7) తేనె

7) తేనె

తేనె థైరాయిడ్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. నయం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. తేనెను రోజూ లెమన్ వాటర్ తో కలిపి తీసుకోవడం మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Foods That Help To Keep Your Thyroid Healthy

    Now let us look at some of the foods that you should consume to keep your thyroid healthy:
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more