Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఇవి తప్పకుండా తినాల్సిందే..
శరీరంలో హెమోగ్లోబిన్ లేకపోతే చాలా అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఎర్ర రక్తకణాల్లో ఉండే ఈ ప్రొటీన్‌ను హెయోగ్లోబిన్ అంటాము. రక్త పరీక్షల ద్వారా ఇది రక్తంలో ఎంత స్థాయిలో ఉందో తెలుస్తుంది. వైద్యులు చెబుతున్న లెక్కల ప్రకారం పురుషుల్లో హెమోగ్లోబిన్ స్థాయి 14 నుంచి 18 లోపు, మహిళల్లో 12 నుంచి 16 లోపుండాలి. కొందరికి ఇది చాలా తక్కువ స్థాయిలో 8,9, 6 గా ఉంటుంది. వీరు ఎనేమియాతో బాధపడుతున్నట్లుగా పరిగణించవచ్చు. శరీరంలో మొత్తానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే పనిని హెమోగ్లోబిన్ చేపడుతుంది. హెమోగ్లోబిన్ స్థాయి తక్కువుంటే ఆక్సిజన్ కూడా తక్కువగా అంది బీపీ, అలసట, శ్వాస సంబంధిత సమస్యలకు గురౌతాము.
మందుల ద్వారా కన్నా ఆహారం ద్వారా హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుకుంటే ఆరోగ్యం మెరుగుబడుతుంది. ఏ ఆహారం తింటే హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, ఫైబబర్, ఫాలిక్ యాసిడ్ లాంటి పోషకాలు ఉంటాయ్. ఈ పోషకాలన్నీ ఎర్రరక్తకణాల స్థాయిని పెంచుతుంది. కాబట్టి బీట్‌రూట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి జ్యూస్ చేసుకొని అలాగే తాగినా మంచి ఫలితం ఉంటుంది.

నల్ల నువ్వులు
నల్ల నువ్వుల్లో కూడా హెమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేసే పోషకాలు మెండుగా ఉంటాయ్. ఇందులో ఐరన్‌తో పాటు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి2, ఫోలేట్ ఉంటాయ్. ఈ నల్లనువ్వులను నేరుగానైనా లేక ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.
పళ్లు
ఐరన్ కంటెంట్ ఉండే పళ్లను తీసుకోవాలి. పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మలో ఐరన్‌తో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కంటెంట్ ఉంటాయ్. ప్రతి రోజూ సాయంత్రం, భోజనం తరువాత ఈ పళ్లను తీసుకుంటే శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
ఖర్జూరం, ఎండు ద్రాక్ష
ఖర్జూరం ఎండు ద్రాక్షల్లో కూడా ఐరన్ ఉంటుంది. వీటిని ఉదయం లేవగానే పరిగడుపున వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతీ రోజూ తింటే కేవలం కొన్ని వారాల్లోనే హెమోగ్లోబిన్ పెరుగుదలలో మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆకుకూరలు
హెమోగ్లోబిన్ స్థాయి త్వరగా పెరగాలంటే రోజూ ఆకుకూరలు తినాల్సిందే. వీటిని ఉడికించి కర్రీలు చేసుకోవచ్చు లేదంటే కడిగి మిక్సిలో వేసి జ్యూస్‌లుగా కూడా తాగవచ్చు.
గుమ్మడిపండు విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పాలల్లో బ్రెడ్‌పైన, సలాడ్ పైన వేసుకొని తినవచ్చు. నేరుగా అలాగే తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విత్తనాలను స్వీట్లపైన వేసి డెకొరేట్ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications