Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
టాయిలెట్ లో ఫోన్ వాడితే..ఈ భయంకరమైన రోగం గ్యారెంటీ!
స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది. చాలామంది ఫోన్ లేనిదే అన్నం తినరు, బాత్రూమ్ కి కూడా పోలేకపోతున్నారు. ఫోన్ కి బానిసలుగా మారిపోతున్నారు చాలామంది. టాయిలెట్ లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడటం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. న్యూస్ చూడటం, సోషల్ మీడియా చూడటం, వీడియోలు ప్లే చేయడం వంటివి చేస్తూ సమయాన్నే మర్చిపోతాం. అయితే ఈ చిన్న అలవాటే మనల్ని ఒక బాధాకరమైన సమస్యలోకి నెట్టగలదని మీకు తెలుసా? టాయిలెట్‌లో ఫోన్ వాడకం వల్ల పైల్స్ (మొలలు) వచ్చే ప్రమాదం ఏకంగా 46 శాతం పెరుగుతుందని ఒక కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.
పైల్స్ అంటే ఏమిటి?
పైల్స్ లేదా హెమోరాయిడ్స్ అంటే.. మలద్వారం లోపల, చుట్టూ ఉండే రక్తనాళాలు ఉబ్బి, వాపునకు గురవడం. దీనివల్ల తీవ్రమైన నొప్పి, దురద, రక్తస్రావం వంటి ఇబ్బందులు కలుగుతాయి.

టాయిలెట్ లో ఫోన్ వాడకానికి, పైల్స్ కు సంబంధం ఏమిటి?
సమస్య ఫోన్ తో కాదు, దానివల్ల మనం టాయిలెట్ లో గడిపే సమయంతో. మనం టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మన శరీర నిర్మాణం వల్ల పొత్తికడుపు కింది భాగంలోని కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మలద్వారం వద్ద రక్త ప్రసరణ నెమ్మదించి రక్తం అక్కడే నిలిచిపోతుంది. ఇదే క్రమంగా రక్తనాళాలు ఉబ్బి, బలహీనపడి పైల్స్ గా మారడానికి దారితీస్తుంది. సాధారణంగా అయితే మనం పని పూర్తికాగానే బయటకు వస్తాం. కానీ చేతిలో ఫోన్ ఉంటే సమయం తెలియకుండానే నిమిషాల తరబడి అక్కడే కూర్చుండిపోతాం. ఈ అదనపు సమయమే పైల్స్ ముప్పును పెంచుతోంది.
అధ్యయనం ఏం చెబుతోంది?
ఇటీవల అమెరికాలో 45 ఏళ్లు పైబడిన వారిపై నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించింది. ఈ పరిశోధనలో తేలిన ముఖ్య విషయాలు ఇక్కడ చూడండి.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది అంటే 66శాతం మంది టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నట్లు అంగీకరించారు.
ఫోన్ వాడేవారిలో 37శాతం మంది ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సమయం గడుపుతుంటే.. ఫోన్ వాడని వారిలో కేవలం 7శాతం మంది మాత్రమే అంత సమయం తీసుకుంటున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా, వయసు, బరువు, ఆహారపు అలవాట్లు వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా టాయిలెట్‌లో ఫోన్ వాడేవారికి పైల్స్ వచ్చే ప్రమాదం 46శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాబట్టి టాయిలెట్ లో ఫోన్ ను స్క్రోల్ చేయడం అనేది కేవలం కాలక్షేపం కాదు, ఆరోగ్యానికి హానికరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
