Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా?
తలస్నానం చేసిన వెంటనే తల దువ్వుకునేటప్పుడు జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటే.. జుట్టు ఎందుకు రాలిపోతోందో అర్థం కాక వాడే షాంపూలు, నూనెలు మార్చేస్తుంటారు. కానీ అసలు సమస్య మీరు వాడే ప్రొడక్ట్స్ లో కాకుండా, మీరు తలస్నానం చేసే విధానంలోనే ఉండి ఉండొచ్చు. తలస్నానం చేసేటప్పుడు మనం తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లే జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా కూడా ఉంటాయి. అందమైన, ఒత్తైన జుట్టు కావాలంటే తలస్నానం సమయంలో అస్సలు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇక్కడ చూడండి.

వేడి నీటితో స్నానం
చలికాలమైనా, వర్షాకాలమైనా చాలామందికి వేడివేడి నీళ్లతో తలస్నానం చేయడం అలవాటు. కానీ, ఇది మీ జుట్టు పాలిట శాపం లాంటిది. వేడి నీరు మాడు మీద ఉండే నేచురల్ ఆయిల్స్ ని పూర్తిగా తొలగించి, కుదుళ్లను డ్రైగా మారుస్తుంది. దీనివల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు సులువుగా రాలిపోతుంది.
ఏం చేయాలి?: తలస్నానానికి ఎప్పుడూ సాధారణ (నార్మల్) వాటర్ లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం బెస్ట్.
గోర్లతో గట్టిగా గీరుతూ రుద్దడం
తలలో మురికి పోవాలని లేదా దురదగా ఉందని చాలామంది తమ చేతి గోర్లతో గట్టిగా గీరుతూ తలకడుగుతారు. దీనివల్ల మాడుపై గాయాలు కావడమే కాకుండా, హెయిర్ ఫాలికిల్స్ దెబ్బతిని జుట్టు శాశ్వతంగా రాలిపోయే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?: మీ చేతి వేళ్ల కొనలతో మాత్రమే తలను చాలా సున్నితంగా, వృత్తాకారంలో మసాజ్ చేస్తూ కడుక్కోవాలి.
షాంపూను నేరుగా తలపై
షాంపూను నేరుగా చేతిలోకి తీసుకుని తలమీద పెట్టుకుని రుద్దడం అతిపెద్ద పొరపాటు. షాంపూలలో ఎంతో కొంత రసాయనాలు తప్పనిసరిగా ఉంటాయి. నేరుగా అప్లై చేయడం వల్ల ఆ కెమికల్స్ ప్రభావం కుదుళ్లపై తీవ్రంగా పడి జుట్టు దెబ్బతింటుంది.
ఏం చేయాలి?: ఒక చిన్న మగ్గులో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో షాంపూ వేసి బాగా కలిపిన తర్వాతే ఆ నీటిని తలకు పట్టించాలి. దీనివల్ల కెమికల్స్ తీవ్రత తగ్గుతుంది.
తడి జుట్టుతో దువ్వెన
స్నానం చేయగానే చిక్కులు తీయాలని తడిగా ఉన్నప్పుడే దువ్వెన పెట్టి లాగేస్తుంటారు. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే.. తడిగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో దువ్వితే జుట్టు మూలాల నుంచే ఊడి వచ్చేస్తుంది.
ఏం చేయాలి?: జుట్టు కనీసం 70 శాతం గాలికి ఆరిన తర్వాత మాత్రమే, పెద్ద పళ్లు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా కింది నుంచి పైకి చిక్కులు తీసుకోవాలి.
టవల్ తో జుట్టును యుద్ధం చేసినట్లు రుద్దడం
తలస్నానం అయ్యాక టవల్ తో జుట్టును ఇష్టం వచ్చినట్లు గట్టిగా దులుపుతూ, రుద్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు మధ్యలోనే తెగిపోతుంది, చివర్లు చిట్లిపోతాయి.
ఏం చేయాలి?: గరుకుగా ఉండే టవల్ కి బదులుగా సాఫ్ట్ గా ఉండే మైక్రో ఫైబర్ టవల్ లేదా పాత కాటన్ టీ షర్ట్ వాడండి. జుట్టును గట్టిగా రుద్దకుండా, కేవలం సున్నితంగా అద్దుతూ తడిని ఆరబెట్టుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
