Latest Updates
-
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే..
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా..
ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. అందులోనూ మటన్ పాయా అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పాయా అనగానే దాని అద్భుతమైన రుచి, ఎముకల నుండి కరిగి వచ్చే జిగురు గుర్తుకొస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఎముకల బలానికి పాయా ఎంతో మేలు చేస్తుంది. అయితే పాయా వండాలంటే చాలా కష్టం, గంటల తరబడి ఉడికించాలి అని భయపడేవారే ఎక్కువ. కానీ ఒక గంట కంటే తక్కువ సమయంలోనే రుచికరమైన మటన్ పాయా కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మటన్ పాయా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
మటన్ పాయా (మేక కాళ్లు) - 1.5 కేజీలు
నూనె - అర కప్పు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో - 1
చిల్లీ ఫ్లేక్స్ (ఎండుమిర్చి ముక్కలు) - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
జాపత్రి - ఒక చిన్న ముక్క
లవంగాలు - 4 లేదా 5
నీళ్లు - 2 లీటర్లు
గార్నిష్ కోసం: కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం
మటన్ పాయా కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో అర కప్పు నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఓ నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే కట్ చేసిన టొమాటో ముక్కలను కూడా వేసి నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-అదే కుక్కర్ లో కొద్దిగా నూనెలో దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు వేయాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ ను వేయాలి. ఇందులోనే పసుపు, కశ్మీరీ కారం, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి, నూనె పైకి తేలే వరకు సన్నపు మంటపై ఉడికించాలి.
-నూనె పైకి తేలుతున్న సమయంలో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ పాయా (మేక కాళ్లు) వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి మసాలా అంతా ముక్కలకు పట్టేలా 5 నుండి 7 నిమిషాల పాటు బాగా వేయించాలి.
-పాయా ముక్కలు మసాలాలో బాగా వేగిన తర్వాత అందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి, సుమారు 45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాయా ఎంత మెత్తగా ఉడికితే గ్రేవీ అంత రుచిగా ఉంటుంది.
-ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే పాయా కర్రీ రెడీ. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, పొడవుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి.
-ఈ వేడి వేడి పాయా కర్రీని ఇడ్లీ, దోశ, నాన్, పరోటా లేదా బగారా రైస్ తో తింటే ఆ మజాయే వేరు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
