Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కంటి నిండా నిద్రపోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు..! హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
మనిషికి నిద్ర చాలా అవసరం. బ్రతకడానికి ఉద్యోగం, తిండి, నీళ్లు, ఇళ్లు మాత్రమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోకపోతే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. అటు మెదడు, ఇటు శరీరం రెండూ రీచార్జ్ కావాలంటే నిద్ర చాలా ముఖ్యం. మనం నిద్రలోకి జారుకున్నప్పుడు మనకు స్పృహ లేకుండా వుండవచ్చు కానీ అదే సమయంలో బ్రెయిన్ చాలా యాక్టివ్ అయి వుంటుంది. శరీరంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేసేలా మెదడు పని మొదలుపెడుతుంది.
కంటి నిండా నిద్రపోతే శరీరం చాలా ఆరోగ్యవంతంగా వుంటుంది. శరీర బరువు కూడా అదుపులోకి స్తుంది. గుండె సమస్యలు ఎక్కువ కాకుండా వుంటాయ్. శరీరంలో ఏవైనా కణాలు దెబ్బ తిన్నా అవి నిద్రపోయే సమయంలో రిపేర్ అవుతాయ్. నిద్రించే సమయంలో శరీరంలో ఆరోగ్యంగా మారడానికి చార్జ్ అవుతున్న విధంగా అనుకోవచ్చు. ఫోన్‌కు చార్జింగ్ ఎలాగైతే వుంటుందో, నిద్రపోయినప్పుుడు కూడా శరీరం అలా రీచార్జ్ అవుతుంది.
నిద్రకు మెదడుకు చాలా దగ్గరి సంబంధాలు వున్నాయ్. వీటి వెనకవున్న మిస్టరీలను చేధించేదుకు పరిశోధకులు ఎంతో కృషి చేస్తున్నారు. నిద్రించే సమయంలో బ్రెయన్ ఎలా పనిచేస్తందో పరిశోధకులు ఇప్పుడే కనుగ్గొన్నారు.

నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఏమి జరుగుతుందో స్వయంగా ల్యాబుల్లోనే పరీక్షించారు. కంటినిండా నిద్రపోకపోవడం వల్ల బ్రెయిన్ వీక్‌గా మారుతుందన్నారు. ఇలాంటి సమయంలో భావోద్వేగాలను కూడా నియంత్రించుకోలేని స్థితికి చేరుకుంటారు, నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటి బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు.
వయసు పెరుగుతున్నా కొద్ద నిద్రించే సమయం తగ్గుతూ వస్తుంది. ప్రారంభంలోనే నిద్రసమస్యలు ఎక్కువగా ఎదుర్కోవడం వల్ల డిమెన్షియా బారిన పడే అవకాశం వుందని అంటున్నారు. నిద్రలేమి సమస్యతో ఆల్జీమర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం వుందని అంటున్నారు. కంటి నిండా నిద్రపోతే ఈ సమస్యలు వచ్చే అవకాశం లేదని కుండ బద్దలు కొడుతున్నారు.
నిద్రించే సమయంలో ఘ్నాపకాలను మరింత బలంగా మెదడులో నిక్షిప్తమయ్యేలా మెదడు పనిచేస్తుందని పరిశోధకులు కనుగ్గొన్నారు.
కింటి నిండా నిద్రపోయేందుకు పరిశోధకులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. 2022లో మొదటి సారి ఇంగ్లాండ్ నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ హెల్త్ యాండ్ కేర్ ఎక్సలెన్స్ వారు మొదటి సారి నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నవారిపై ఈ ప్రయోగాలను చేపట్టారు.
నిద్ర సరిగ్గా వెళ్లకపోతే రోజంతా బలహీనంలో, అలసటా వుంటారు. ఉదయం నిద్రలేవడంతోనే సోమరిగా వుంటారు. నిద్రపోకపోవడం వల్ల నిద్రమత్తులో వుంటారు. ఏ పనులను సరిగ్గా పూర్తి చేయలేరు. ఆఫీస్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనలేరు.
నిద్ర సరిగ్గాపోకపోవడం వల్ల కంటి కింద నల్ల మచ్చలు వస్తాయ్. కల్లు చాలా బరువుగా మారుతాయ్. కళ్లు ఎర్రగా కూడా అవుతాయ్. చాలా అలసిపోయినట్లు కనబడతారు. నిద్రసరిగ్గాపోకపోవడం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్టిసాల్ కొల్లెజెన్‌ను దెబ్బతీస్తుంది. చర్మం మృదువుగా మారడానికి ఈ కొల్లెజన్ దోహదం చేస్తుంది. ఇప్పుడు కొల్లెజెన్ దెబ్బ తినడంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయ్.
నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. కార్టిజాల్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోతాయ్. ఇది బరువు పెరగడానికి, గుండె సమస్యలు రావడానికి, వయసు పెరగడానికి కారణమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications