Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గాసిప్ మంచిదే... ! పురుషులూ వెనకాడకండి!!

కాబట్టి గుస గుసలు ఏవైనా సరే.....పక్కింటి పిన్నిగారు లేచిపోయింది!...మూడో ఇంట్లో పిల్ల పెళ్ళి ఆగిపోయింది! లేదా వాళ్ళ అబ్బాయి రౌడీ షీటర్, రోజూ తాగి ఇంటికి వస్తాడట....! లాంటి గుసగుసలు ప్రత్యేకించి మహిళలనుండే వస్తాయని, మహిళలలో పదిమందిలో కనీసం ఒక్కరు కూడా రహస్యం దాచుకోలేక, ఇటువంటి గుస గుసలకు పాల్పడతారని, అయితే ఇవి ఆరోగ్య రీత్యా మంచివేనని ఇవి శరీరంలోని పాజిటివ్ హార్మోన్ సెరోటోనిన్ లెవెల్ పెంచి ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తాయని సైకాలజిస్టు కోలిన్ గిల్ తన పరిశోధనలో వెల్లడించినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
ఈ రకంగా ఎదుటివారి గురించి మాట్లాడుకునేటపుడు, వారితో ఒక బంధం ఏర్పరచుకుంటూ సంతోషపడుతూ శరీరంలోని 'ఫీల్ గుడ్' రసాయనాలు రిలీజ్ చేసుకుంటామట. అంతేకాదు, గాసిపింగ్ లో ఒక్కోసారి పెద్దగా నవ్వేసుకోడం బ్రెయిన్ లో సంతోషాన్ని కలిగించి కొన్ని కండరాలకు మంచి చేస్తుందట. గాసిప్ అనేది మనలో ఇతరుల ప్రవర్తనపై సమాచారం సేకరించే అలవాటు కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది మనం మరల అబద్ధాలు చెప్పేవారుగాను, మోసం చేసేవారుగాను అవటానికి వీలు లేకుండా చేస్తుందట. అంతేకాదు, ఈ గాసిప్ చేసే వారు కోతులు గుంపులుగా కూర్చొని తమ బొచ్చులోని పేలు తీసుకుంటున్నట్లు, కొన్ని గ్రూపుల్లో బాగా ఇమిడిపోయి మరింత ఆనందం పొందుతూంటారని పరిశోధకులు వెల్లడించారు.
కనుక మహిళలే కాదు, పురుషులు సైతం ఇకపై మరిన్ని గ్రూపులుగా ఏర్పడి గాసిప్ కొనసాగిస్తే...ఎంత ఆనందం... ?
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications