Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అధ్భుత ప్రయోజనాల ఔషధం - వేప!

1. వేప రసానికి మంటను తగ్గించే గుణం వుంది. వేపరసం మొటిమలను తగ్గించటానికి కూడా వాడతారు. ముఖ వర్చస్సు పెరగాలంటే వేప రసం రాయాలి.
2. వేప రసం తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. దానితో జుట్టు, చర్మం మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా వుంటాయి. వేప రసం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
3. డయాబెటీస్ రోగులకు వేప ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ వేప రసం తాగితే రక్తంలోని షుగర్ లెవెల్ నియంత్రణలో వుంటుంది.
4. కళ్ళపై కొద్ది చుక్కల వేప రసం కంటి చూపును మెరుగుపరుస్తుంది. కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది.
5. వేప రసం శరీరానికి మర్దన చేస్తే నల్లటి మశూచి మచ్చలు కూడా పోతాయి. గజ్జి, స్మాల్ పాక్స్ మొదలైనవి కూడా వేపరసంతో నివారణ చేసుకోవచ్చు.
6. గర్భవతికి నొప్పులు తగ్గాలంటే, కడుపు, యోని భాగాలకు వేపరసం మర్దన చేస్తే ఫలితం వుంటుంది.
ఇన్ని ప్రయోజనాలు కల వేపరసం తాగాలంటే ఎంతో చేదు. కనుక, దీనిలో కొద్దిపాటి ఉప్పు లేదా మిరియంపొడి కలిపి తాగవచ్చు. వాసన కూడా వుంటుంది. అయితే దీనిలోగల లాభాల కారణంగా వాసన తగ్గటానికి గాను ఫ్రిజ్ లో 15 నుండి 20 నిమిషాలు వుంచి లేదా ఐస్ ముక్కలు కలిపి తాగవచ్చు. వేపరసం తీసిన వెంటనే తాగండి. అరగంటకు మించి నిలువ వుంచరాదు. వేపరసంలో షుగర్ కలిపితే దాని ఫలితాలు తక్కువగా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications