Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పోషకాహార పదార్ధాలను రుచికరం చేసుకోడమెలా?

1. తినే పదార్ధాలకు మంచి రుచి రావడానికి కొన్ని మంచి మసాలా దినుసులు వాడండి. చాలామంది డైట్ ఆహారమంటే చప్పగా వుంటుందంటారు. కనుక కొద్దిపాటి మసాలా తగిలిస్తే అదే బాగుంటుంది. మసాలా దినుసులు కేలరీలు జత చేయవు. అయితే శరీరానికి హానికరం కాని మసాలా దినుసులు వాడాలి.
2. మిరియాలు నూరి వేసినా లేదా అలాగా వేసినా వంటకాల్లో మంచి రుచినిస్తాయి. మీరు తాగే సూపులు, సలాడ్లకు మిరియం వేసి వ్యత్యాసం చూడండి. అదే విధంగా ధనియాలు, జీలకర్ర మెంతులు వంటివి కూడా కొన్ని పదార్ధాలకు కలిపి నోటికి రుచిగా అందించవచ్చు. సాధారణంగా ఆరోగ్యం కొరకు తినే వాటిలో మొలకెత్తిన విత్తనాలు ప్రధానమైనవి. వీటికి రుచి కల్పించటానికి గాను పచ్చమిరపకాయ ముక్కలు చిన్నవి గా తరిగి లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపి తింటే చాలా తేలికగాను, రుచికరంగాను తినవచ్చు. లేదా మొలకలకు తగినంత నిమ్మరసం కలిపి తినవచ్చు. నిమ్మ రసాన్నితగుమాత్రంగా ఏ రకమైన డిష్ కు కలిపినప్పటికి నోరూరించే రుచి తప్పక ఏర్పడగలదు.
3. సువాసనలు వెదజల్లే కొత్తిమీర లేదా వెల్లుల్లి వంటివి కూడా కొన్ని తిండి పదార్ధాలలో వేసి మంచి రుచిని వాసనను కల్పించవచ్చు. కరివేపాకు కూడా కొన్ని పదార్ధాలలో కలిపి ఆరోగ్యకరమైనది మంచి వాసన కలదిగాను తయారు చేయవచ్చు.
4. అదే విధంగా తక్కువ కొవ్వు కల కోడిగుడ్డు సొన అనేక తిండి పదార్ధాలలో కలిపి రుచికరం చేయవచ్చు. తక్కువ కొవ్వు కల వెన్న లేదా పాలు తినే పదార్ధాలకు కలిపి రుచి తీసుకు రావచ్చు. ఈ కొద్దిపాటి మార్పులు పెద్ద తేడా చేస్తాయి.
చిట్కాలు తెలిశాయి కనుక మంచి పోషకాహార విలువలు కల తిండిపదార్ధాలకు చక్కటి రంగు, రుచి, వాసనలు వచ్చే విధంగా హాని లేని విధంగా తయారు చేసుకోని ఇక తినడం మొదలుపెట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
