Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సిగరెట్ మానేస్తే...బరువెక్కటమే!

సిగరెట్ తాగే వారు ఏదో ఒకటి వేళ్ళతో నిరంతరం పట్టుకోడానికి ప్రయత్నిస్తూంటారు. మరి అటువంటపుడు ఆరోగ్యకరమైన వేళ్ళతో పట్టుకునే ఆహారం ఆపిల్, కేరట్ మొదలైనవి పట్టుకునే అలవాటు చేసుకోవాలి లేదా కనీసం వేళ్ళ మధ్య పెన్ లేదా పెన్సిల్ వంటిది పెట్టుకోవాలని మైండ్ మళ్ళించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఆహారం తీసుకోడానికి సిగరెట్ మానేసినవారు సమయాలు ఆచరించాలట. మూడు సార్లు సుష్టుగా భోజనం చేసే కన్నా దానిని నాలుగు లేదా అయిదుసార్లుగా తినాలట. బ్రేక్ ఫాస్ట్ ఎట్టిపరిస్ధితిలో మానరాదట. తినే ఆహారంలో పీచు వుంటే బరువెక్కకుండా వుంటుంది. ఆకలి తక్కువ వుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే ఆరెంజ్, గ్రేప్, స్ట్రాబెర్రీలు తీసుకుంటూ సిగరెట్ మానేసిన కారణంగా ఏర్పడే డీ హైడ్రేషన్ తగ్గాలంటే....రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.
నిద్ర తగినంత లేకుంటే మరోమారు సిగరెట్ కు అలవాటు పడే ప్రమాదముందట. కనుక నిద్రించాలి. కాఫీ తాగితే మరోమారు అది సిగరెట్ లోని నికోటిన్ కావాలంటుందట. అందుకని కాఫీ మానేయాలి. సిగరెట్ మానేశామనే ఒత్తిడి పోగొట్టుకోవాలంటే, మంచి హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లను పొందటానికి రోజూ కొద్దిపాటి వ్యాయామమేదైనా చేయాలి. దీనివలన మీ మెటబాలిజం పెరగటమే కాక, శారీరకంగా మంచి ఫిట్ నెస్ పొందుతారని నిపుణుల సూచన.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications