Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మానసిక సంఘర్షణలకు గురవుతున్న యువతరం!

కాని యువత అలా కాదు. తమలో జరుగుతున్న మానసిక సంఘర్షణ కారణంగా వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు పైకి చెప్పరు. పైగా దాని నుంచి బయటపడాలనే ఆలోచన కూడా వారికి రాదు. ఇలాంటి పరిస్ధితి రాబోయే రోజుల్లో ఆరోగ్యపరమైన సమస్యలకు సంకేతాలని మానసిక శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వారిలో మార్పును గమనించాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
పిల్లలు యుక్త వయసుకు వచ్చే సందర్భంలో చాలా త్వరగా ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటుంటారు. అందరి మీద విసుక్కోవడంలాంటివి చేస్తుంటే వారు ఒత్తిడికి గురౌతున్నట్లు తల్లిదండ్రులు గుర్తించాలి. కుటుంబ సభ్యులకి, స్నేహితులకి దూరంగా ఉంటూ, శుభ కార్యాల్లో పాల్గొనకుండా ఉంటే బిడియం కారణంగా అని మాత్రం భావించకండి. పిల్లలు తీవ్రమైన మానసికపరమైన ఒత్తిడికి లోనైనపుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంటారు. ఈ పరిస్ధితి నుంచి వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. పిల్లలు ఎదుటి వారి మీద తరచూ దాడికి దిగడం అనేది ఎంత ప్రమాదకరమో, తమని తాము శిక్షించుకోవడం అంటే గాయపరుచుకోవడం, కొట్టకోవడం లాంటివి కూడా అంతే హానికరం. ఈ లక్షణాలు పిల్లల్లో కనిపించిన వెంటనే సరైన మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా అవసరం అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూనే వారికి ఏ మాత్రం కోపం రానీయకుండా వారిని ఓ కంట కనిపెడుతుండాలి. మనం వారిని కనిపెడుతున్నట్లుగా వారికి ఎలాంటి పరిస్ధితుల్లోనూ తెలియనీయకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అలాగే ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు మీ పిల్లలతో కలిసి మీరు కూడా ధ్యానం చేస్తుంటే వారిలో నున్న మానసికపరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని కూడా సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications