Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాల రాశి సీతాఫలం...
చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్ యాపిల్ అనీ షుగర్ యాపిల్ అనీ పిలుస్తారు. పచ్చి సీతాఫలం తినడానికి పనికిరాదు. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బాగా పండినతర్వాత మాత్రమే తినడానికి వీలవుతుంది. సీతాఫలం చుట్టూ కళ్లులాగా బెరడులాంటి పధార్థం ఉంటుంది. పండిన సీతాఫలంపై ఈ కళ్లను విడదీస్తే లోపల ఒక్కొక్క గింజ చుట్టూ తెల్లటి గుజ్జు మధురంగా ఉంటుంది.
కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు.
సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం నొక్కినొక్కాణిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు. దేహాపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి సీతాఫలాంనికి ఉంది. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంతమొందించిచడానికి సీతాఫలంలో దాగి ఉన్నాయి. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది.

1. హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. డైటింగ్ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.
2. సీతాఫలంతో కొన్ని చిట్కాలు సీతాఫలంలోని గుజ్జును పాలతో కలిపి తాగితే శీరీరంలోని వేడి, అతి దాహం తగ్గుతాయి. జ్వరంగా ఉండి నాలు పిడచకట్టి ఒకటే దాహంగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జును, పాలు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే దాహ బాద తగ్గిపోతుంది.
3. బలహీనంగా ఉన్నపిల్లలకు, బాలింతలకు సీతాఫలం గుజ్జను తేనెతో కలిపి ఇస్తే అది వాళ్లకు అధిక శక్తి చేకూరడానికి ఉపకరిస్తుంది. సీతాఫలాల గుజ్జును జ్యూస్ లా చేసి పటికి బెల్లం లేదా చక్కెర వేసి పాలతో కలిపి ఇస్తే పాలిచ్చే తల్లులకు, ఎదిగే పిల్లలకు మంచి ఆహారం.
4. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి
5. తలలో చుండ్రు వున్నవారికి ఎండిన సీతాఫలం గింజను మెత్తగా పొడి కొట్టి, ప్రతిరోజు ఆ పొడిని షాంపులాగా ఉపయోగిస్తూ స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. మెదడుకు, నరాల వ్యవస్థకూ సీతాఫలం చాలా ఉపకరం అంటున్నారు.
6. పండులోని సల్ఫర్ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది
7. సీతాఫలం పండు తింటే అజీర్తి మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నరాలు, కండరాలు బలహీనత గలవారికి ఈ పండు మంచి ఫోషకాహారం. చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications