ఒత్తిడి(స్ట్రెస్)తో అధికంగా బాధపడుతున్నారనడానికి సంకేతాలివే...

స్ట్రెస్ (ఒత్తిడి)అనేది సైలెంట్ కిల్లర్. ఇది మీ జీవితంలోని మీకు తెలియకుండానే ప్రవేశిస్తుంది, అంతే కాదు ఇది మీలో అలజడి సృష్టిస్తుంది. అంతే కాదు మీకు ఏమాత్రం తెలియనియ్యకుండానే మీ ఆరోగ్యాన్ని కొంతైనా కాదు..కాదు..చాలానే నాశనం చేస్తుంది. చాలా తరచుగా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. చాలా చిన్న సమస్యలకే అధికంగా ఒత్తిడికి గురివౌతుంటారు. దీన్ని మనం స్ట్రెస్ అని చెప్పవచ్చు. అయితే స్ట్రెస్ కు సంబంధించిన సంకేతాలు(సిమ్టమ్స్) చాలా సింపులాగా తీసేసేంత చిన్నది కాదు. ఎందుకంటే ఒత్తిడి మెల్లిగా ప్రారంభమైన నిశ్శబ్దంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది.

కాబట్టి, స్ట్రెకు కారణం అయ్యే సంకేతాలను మిస్ చేయకండి. వాటిని మీరు గమనించే ఉంటారు, మీరు ఒత్తిడికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఒక వేళ ప్రస్తుతానికి చిన్న సమస్యగా మీరు ఈ ఒత్తిడిని విస్మరిస్తే, దాని ప్రభావం ముందుముందు చాలా ప్రభావాలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మ్యూజిక్ వినడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, మరియు ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొనడం వంటివి ప్రయత్నించడం వల్ల ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి అందరికీ ఒకేలా ఉండదు. అది ఒక్కొక్కరిలో ఒక్కో రూపంలో బయటపడొచ్చు. ఈ ఒత్తిడి లక్షణాలు మనిషికీ మనిషికీ మారిపోతుంటాయి. ఒత్తిడి(స్ట్రెస్) లక్షణాలు ఒక పనిచేసేవారిలో మాత్రే వస్తుందనుకుంటే పొరపాటే. మీరు ఇంట్లో ఉన్నాకూడా, స్ట్రెస్ లక్షణాలు కనిపిస్తాయి. అదీ ఒక్కరే ఉండటం వల్ల ఒత్తిడి లక్షణాలు ఇంకా వృద్ధి చెందుతాయి. కాబట్టి స్ట్రెస్ కు ఎవరూ మినహా కాదాని గుర్తించాలి. అయితే ఒత్తిడినితో బాధపడుతున్నారన్న విషయాన్ని ఎలా తెలుసుకొనేది? అంటే అందుకు క్రింది సంకేతాలు మీరు తీవ్రంగా జబ్బుపడక ముందే ఈ లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

ఒత్తిడి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం:

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

గుండె దడ: విపరీతమైన ఆందోళనతో ఉండడం. ఒత్తిడి ఆందోళనకు దారితీస్తుంది మరియు ఈ ఆందోళన రక్తపోటుకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె రక్తపోటు రావడానికి ప్రదానలక్షణాల్లో ఇది ఒకటి. మీకు తరచూ ఇలా గుండె దడగా అనిపిస్తుంటే డాక్టర్ తప్పకుండా కలవాలి.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

తలనొప్పి: తరచూ తలనొప్పి, దవడల నొప్పులు రావడం. ఇవి టెన్షన్ వల్లే వస్తాయి. ఎక్కువగా ఒత్తిడికి గురైన్పుడు మెదడు లోని రక్త నాళాలు స్తంభించడం వల్ల తలనొప్పికి కారణం అవుతుంది.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

ముక్కులో రక్త కారడం: మీలో బ్లడ్ ప్రెజర్ సడెన్ గా పెరిగినప్పుడు ముక్కులో నుండి రక్తం కారుతుంది. మీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి కొన్ని సహజ రక్షణ పద్దతులు ఉన్నాయి. కాబట్టి ముక్కులో రక్తం కారుతుంటే ఈ సమస్యను తక్కువగా అంచానా వేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళండి.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

జుట్టు రాలడం: ఈ మోడ్రన్ యుగంలో జుట్టు రాలడానికి ప్రధాన కారణం స్ట్రెస్. మీరు 20వయస్సు వాళ్ళలోనే చాలా మందిలో ఈ సమస్యను గమనించవచ్చు. ఇవన్నీ వర్క్ ప్రెజర్ మరియు ఒత్తిడి వల్లే జరుగుతున్నాయి.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

టెంపరెరీ మెమొరీ లాస్: ఒత్తిడి మిమ్మల్ని తాత్కాలికంగా మతిమరుపుకు గురిచేస్తుంది. మీరు ఎప్పుడైతే అధిక పని ఒత్తిడి లేదా పూర్తిగా ఒత్తిడితో కూడి జీవశైలి ఉన్నప్పుడు ఇలా షార్ట్ టర్మ్ మెమరీలాస్ జరుగుతుంది. మీ మెమరీ లాస్ అవుతున్నట్లు మీకు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా విరామం తీసుకోవడం చాలా అవసరం.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

అధిక చెమట: ఒత్తిడికి గురియైన్పుడు మీలో అధికంగా చెమట పడుతుంది. కాళ్ళు, చేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం మరియు కాళ్ళచేతుల్లో వేడిపుట్టడం ఇవన్నీ కూడా అధిక స్ట్రెస్ కు సంకేతాలే. మీరు ఎయిర్ కండీషన్ రూమ్ లో కూర్చొని ఉన్నా మీకు అధిక చెమటుల పడుతున్నట్లైతే, మీరు ఖచ్చితంగా మీ స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించుకోవాలి.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

అనుకోకుండా కేశాలు గ్రే కలర్ లోనికి మారడం. ఇలా జరడం వంశపారం పర్యంగా కావచ్చు లేదా ఒత్తిడి కారణం కావచ్చు. అధిక ఒత్తిడి వల్ల మీ కేశాలను గ్రేకలర్ లోని మార్చుతుంది. ప్రస్తుత రోజుల్లో అతి చిన్న వయస్సులోని వారికి కూడా ఈ గ్రేహెయిర్ సర్వ సాధారణం అయిపోయింది.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

చికాకు: ఒత్తిడిలో ఉన్న వాళ్ళల్లో విపరీత పరిణామాలు కన్పిస్తాయి. విపరీతమైన కోపం లేదా విపరీతమైన మౌనం. ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోట్లాడుతుంటారు. ఇటు వంటి సమయంలో మీకు ఖచ్చితంగా విరామం అవసరం. అప్పుడప్పుడు కోపం రావడం సహజం. అయితే తరచూ కోపాని గురిఅవుతుంటే మాత్రం తప్పనిసరిగా ఒత్తిడి తగ్గించుకొనే మార్గాలు వెతకాలి.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

వ్యాధినిరోధక శక్తిని కోల్పోవడం: ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే తరచూ మీరు అనారోగ్యం బారీన పడుతుంటారు.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

వయస్సు మీద పడినట్లు కనిపించడం: అధికంగా ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే అది మిమ్మల్ని వయస్సు మీదపడినట్టుగా చూపుతుంది. మీరు నిజంగా ఉన్నదానికి కంటే ఇంకా పెద్దవయస్సు వారిగా చూపిస్తుంది. మీరు మీ ముఖంలో ముడుతలు లేదా నల్ల మచ్చలు గుర్తించినట్లైతే మీరు అధిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సంకేతం.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

సమస్యాత్మక దాంపత్యం: పురుషులు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు వారిలో అంగస్తంభన లేదా అకాల స్ఖలనం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ఒత్తిడికి గురవుతున్నారని తెలుసుకోవటం ఎలా..?

ఎడతెగకుండా వాంతులగుట: ఇది నిజం. ఒత్తిడి మిమ్మల్ని వాంతులకు గురిచేస్తుంది. ఇది క్రమానుగతంగా వామిటింగ్ కు గురిచేస్తుంది. ఈ పరిస్థితి పూర్తి ఒత్తిడి వల్లే ఏర్పడుతుంది.

Story first published: Friday, March 29, 2013, 17:29 [IST]
Desktop Bottom Promotion