Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వేసవి తాపం మాత్రమే కాదు...అనేక రుగ్మతలకు దివ్వౌషదం...!
వేసవి కాలం వచ్చిందంటే చాలు కర్బూజాలు, మామిడి, పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకొదగ్గవి మాత్రం కర్బూజ పండ్లు. ఇవి మామిడి పళ్లంత రంగూ రుచీ ఉండవు, పుచ్చకాయలంత ఆకర్షణీయంగానూ కనిపించవు. అందుకే చాలామంది దృష్టి వీటి మీదకు పోదు. కాని కర్బూజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ.
రాబోయే వేసవి కాలంలో ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. ఎ, బి, మరియు సి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. కానీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?.

పురుష హార్మోనులను రెట్టింపు చేస్తుంది: వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ (తర్భూజా)లో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేగాకుండా ఈ లైకోపీన్ వీర్యకణాలు ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8 శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది.

బ్లాక్ హెడ్స్: చర్మ రక్షణలో బాగంగా ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించడం సహాయపడుతుంది.

గుండెకు: గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్-బి6వల్ల మహిళల్లో గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. శరీరానికిహానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి.

వద్యాప్యం: వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది: వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.

కీళ్ళ నొప్పులు: వబలమైన కీళ్ళ కోసం: దోసకాయలోని సిలికా కీళ్ళ జాయింట్లను, సహాయపడే కణజాలాలకు పటిష్టం చేయడానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీళ్ళ జబ్బులకు కీర రసంలో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. ఆర్థరైటిస్ మరియు గౌట్ నివారణకు: ఆర్థరైటిస్ మరియు గౌట్ నొప్పి నివారణకు ఉపశమనం కలిగించే యూరిక్ ఆమ్లస్థాయిని తగ్గిస్తుంది. ఎగ్జిమ , గౌట్ రోగులు క్రమం తప్పకుండ కీర రసం తీసుకోవడం వల్ల పలితం ఉంటుంది.

ఫ్లూ: మనందరికి తెలుసు జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సాధారణ జబ్బుల నుండి బయటపడాటానికి వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి, సరైన ఆహార, పానియాలు తీసుకోవాలని. ఐతే అందులో కూడా ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి సమయంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది. ముక్కు మరియు గొంతు, మ్యూకస్ పొర యొక్క వాపు కూడా దోసకాయ గింజలు తగ్గిస్తుంది. దోసకాయ గింజలను పొడి చేసి నీటిలో కలిపి త్రాగడం వల్ల ఈ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

బరువు తగ్గడానికి: కాని కర్బూజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కొవ్వు పదార్థాలు అత్యంత తక్కువుగానూ, పీచు పదార్థాలు అధికంగానూ ఉండే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి వరం లాంటింది.

కేశ సంరక్షణకు: పుచ్చకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీర రసం కలపి తరచు తాగితే శీరోజాలు చక్కగా పెరుగుతాయి.

పళ్ళు మరియు మంచి చిగుళ్ళ ఆరోగ్యానికి: దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి పుచ్చకాయ రసం చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

క్యాన్సర్: పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడటమే కాకుండా గుండె జబ్బులను, మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను (కంటిలోపలి పొర క్షీణించి పోవటం) సైతం నిరోధిస్తుంది. క్యాన్సర్ నివారణకోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటాకెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లను, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఇదే బీటాకెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ల రూపంలో వాడినప్పుడు ఈ ప్రయోజనం కనిపించలేదు.

చర్మ సంరక్షణకు: కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

హైబీపి: రక్తపోటు (హైబీపీ)ని తగ్గించడానికి, నివారించడానికి సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. సాధారణ స్థాయికి మించి హైపర్‌టెన్షన్ కనిపిస్తున్న వారు రోజూ పుచ్చకాయ తినడం మంచిది. దీనిలోని సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరచి ఉంచేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనల్లో తెలిసింది.

మలబద్దకం: కర్బూజ తినడం వల్ల శరీరంలోని అధిక వేడి తొలగిపోతుంది. దీంతో పాటు కర్బూజలోని విటమిన్-ఏ, విటమిన్-బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తిగా శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. దీనికి తోడు ఇందులో ఉండే పొటాషియమ్ రక్తపోటును, గుండెపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. దీనివల్ల ఎన్నో వ్యాధులు నివారితమవుతాయి.

మహిళల్లో చక్కటి స్తన ఆకృతి: వీటిలో పుష్కలంగా లభ్యమయ్యే కెరొటినాయిడ్లు మహిళల్లో స్తనాల ఆకృతి చక్కగా ఉండేలా చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.

వడదెబ్బ: ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

కంటి ఆరోగ్యానికి: పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను (కంటిలోపలి పొర క్షీణించి పోవటం) సైతం నిరోధిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు: జన్మతఃప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసి పాపాయిల్లో గ్రహణం మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది.

డయాబెటిస్: పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి.



Click it and Unblock the Notifications











