Latest Updates
-
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా..
ఒక చదునైన బెల్లీ పొందడానికి తెలివైన మార్గాలు
AB వ్యాయామాలు మీకు కావలసిన ఫలితాలు కనపడకపోతే మీరు ఎందుకు విచారిస్తారు? బహుశా మీరు ఏదో తప్పిస్తున్నారేమో!
ఏ "మేజిక్ బుల్లెట్" పొట్టకొవ్వును తీసివేయలేకపోతే, పొట్టకొవ్వు ఎందుకు పెరుగుతుంది, దానికిగల కారణాలు ఏమిటి మరియు దానిని ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాలను ఈ వ్యాసం వివరిస్తుంది.
ఈ సులభమైన చిట్కాలు మీ వ్యాయామంలో బాగా పనిచేసి, అవి మీమీద ప్రభావం చూపుతాయి.

చిన్న కదలికలతో ప్రారంభించండి
సుళువుగా ప్రారంభించండి-మీరు ఎలా సైకిలింగ్ చేయాలి మొదట తెలుసుకొని, తరువాత వేగంగా చేయండి మరియు అదేవిధంగా మీరు మొదట 50 క్రంచెస్ కన్నా ఎక్కువ చేయలేరు. మొదట చిన్న స్థాయిలో చేయండి-20 సెకన్ల ప్లాంక్ పట్టుకోండి లేదా ప్రారంభంలో 10 క్రంచెస్ మాత్రమే చేయండి.

తగినంత వెచ్చదనం?
కొంతమంది వ్యాయామం సెషన్ ముందు సరైనరీతిలో వెచ్చదనం పొందటంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు మరియు సమయం వృధా అని నమ్ముతారు. కాని మీ కండరాలు వెచ్చగా అవటంవలన గాయాలను నివారించవొచ్చు. ఒక చిన్న వాకింగ్,అక్కడికక్కడ కవాతు చేయటం, మీ పాదాన్ని ముందుకు వంగి తాకటం, మీ శరీర మధ్యభాగాన్ని నెమ్మదిగా కదల్చటం వంటివి చేయటం వలన AB వ్యాయామం కోసం మీ కోర్ వేడి అవుతుంది.

శ్వాస
మీ ముఖ్యమైన కండరాలు వాటి యొక్క పూర్తి సామర్థ్యంలో పని చేయాలంటే వాటికి ఆక్సిజన్ చాలా ముఖ్యం. కాబట్టి, మీ శ్వాసను పట్టి ఉంచకండి. సులభమైన కదలికను చేస్తున్నప్పుడు శ్వాసను లోపలికి పీల్చండి మరియు మీరు శక్తిని ప్రయోగిస్తున్నప్పుడు శ్వాసను బయటకు వదలండి.

పరధ్యానంలో ఉండకండి
పుష్ అప్స్ చేస్తున్నప్పుడు మీ కండరాలు మాత్రమే ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అనుకుంటే మీ ఆలోచన తప్పు-వ్యాయామం షెడ్యూల్ లో మన మనస్సు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి, వ్యాయామం చేస్తున్నప్పుడు టి.వి. చూడటం నివారించండి. దానికి బదులుగా మీ కండరాలమీద ధ్యాస ఉంచండి మరియు వాటిని కదిలించండి, ముడవండి మరియు సాగాదీయండి. దీనివలన ఫలితాలు మెరుగుపడతాయి.

ఆల్ రౌండర్ గా ఉండండి
మీరు వేగంగా ఒక ఫ్లాట్ బెల్లీ పొందాలనుకుంటే, మీ కదలికలను అన్ని కోణాలనుండి చేయండి. కేవలం క్రంచెస్ మీదనే దృష్టి ఉంచకండి-ఇతర వ్యాయామాలు కూడా చేయండి మరియు వక్రాసన వంటి ఆసనాలు మీరు మీ శరీరాన్ని త్రిప్పటానికి మరియు ట్విస్ట్ చేయటానికి సహాయపడతాయి.

సమతుల్యత
బలమైన ABS కోసం మీరు మీ దినచర్యలో కొంత సమతుల్యత చొప్పించే ప్రయత్నం చేయాలి. చాలా సులువైనవి-మీరు ఒక కాలిమీద నిలుచుని, ఇంకొక కాలును మీ తొడపై ఉంచడం, మీ తలపైగా మీ భుజాలను ఎత్తుగా ఉంచడం మరియు అరికాళ్ళను తాకడం-వ్రిక్షాసన లేదా చెట్టు భంగిమలో ఉండటం.

విశ్రాంతిగా ఉండండి
మీకు మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడే, వ్యాయామం పని చేస్తుంది. ఎక్కువగా శ్రమపడటం వలన మీ చేసిన ABS మీకు సహాయపడవు. విశ్రాంతి మీ కండరాలకు సహాయపడుతుంది మరియు తిరిగి బలం చేకూరుస్తుంది.

నిదానం మరియు నిలకడ
మీరు వ్యాయామం వేగవంతంగా చేసినంతమాత్రాన మీ కొవ్వు కరగటంలో ఏమాత్రం సహాయపడదు.

యోగా ప్రయత్నించండి
జిమ్మింగ్ విసుగ్గా ఉన్నదా? యోగ ప్రయత్నించండి. యోగ భంగిమలు చాలా మీ మొత్తం శరీరం బలంగా అవటానికి అద్భుతంగా పనిచేస్తాయి. మీ శరీరంతోపాటుగా, మీ మనస్సు కూడా ప్రభావితం అవుతుంది. యోగా మిమ్మలిని సరళంగా మారుస్తుంది మరియు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.

బరువు విషయాలు
మీరు బరువులు ఎత్తినప్పుడు మీ ఉదర కండరాలు బాగా పనిచేస్తాయి. మీ సాధారణ వ్యాయామంలో ఒక కిలో బరువు ఎత్తటం లేదా బరువు విసిరివేత కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి.

మీరు తీసుకునే ఆహారంమీద శ్రద్ధ ఉంచండి
మీరు వాష్బోర్డ్ ఆబ్స్ కోరుకుంటే, మీరు సరిఅయిన ఆహారం తీసుకోవటం తప్పనిసరి-కేవలం రోజు తర్వాత రోజు భారీ జిమ్ నిత్యకృత్యాలను చేయటం వంటివి ఏమి సహాయపడవు. ఒక నగరం ఆధారిత పౌష్టికాహార నిపుణుడు, "మీ ఆహారంలో ప్రోటీన్లు,తక్కువ కొవ్వు ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులు,పండ్లు మరియు తాజా కూరగాయలు పుష్కలంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోండి." అని అన్నారు.



Click it and Unblock the Notifications
