Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లేలేత తమలపాకుతో ఆరోగ్యానికి చాలా లాభాలు!
ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
READ MORE: వివిధ రకాల జబ్బులకు తమలపాకు ఓ పరామవధి..
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.

చాలా తక్కువ మూత్రం లేదా మూత్ర విసర్జనకు ఆటంకం:
ఈ తమలపాకులోని డ్యూరియాటిక్ లక్షనాలు మరియు అసిస్ట్స్ ఈ తమలపాకు నుండి సేకరించిన పాలనుండి ఈ సమస్యను నివారించుకోవచ్చు.

తమలపాకు
తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.

మంట:
ఆర్థరైటిస్ మరియు శోధము ( వృషణాలు యొక్క వాపు ) తమలపాకు స్థానిక అప్లికేషన్ ద్వారా చికిత్స చేస్తారు. తలమపాలకును గోరువెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయల మీద అప్లై చేసి తక్షణం మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది;

వెన్ను నొప్పి:
వేడిగా ఉండే తమలకు రసాని కొబ్బరినూనెతో కలిపి బాగా మిక్స్ చేసి, వెన్నుకు మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

రొమ్ముల్లో పాలు
ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలు:
ఎవరైన సరే శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుంటే, తమల పాకును గోరువెచ్చని ఆవనూనెలో నానబెట్టి, ఈ మిశ్రమాన్ని ఎదమీద అప్లై చేయాలి. తమలపాకు రసంలో బెర్రీ , తేనె మిక్స్ చేసి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. తమలపాకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు ఆకులకు నూనెను రాసి కొద్దిగా వేడిచేసి ఎధపై ఉ:చిన శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

డయాబెటిస్:
పరిశోధనలు ప్రకారం ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు, షుగర్ వ్యాధుగ్రస్తుల చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతాయి.

వీక్ నెస్ లేదా నెర్వస్:
తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలాపాకును వేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.

తలనొప్పి:
చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

మలబద్దకం:
మలబద్దకం: తమలపాకు తినే వారిలో, పెద్దవారిలో మలబద్దక సమస్య లేకుండా చేస్తుంది. తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)

గాయాలు:
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.గాయమైన వారు దీని లేత ఆకులను నెయ్యి రాసి గాయలపైన కట్టిన అవి గాయం తక్కవవుతుంది. దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

అధిక రక్తపోటు:
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

ఓరల్ హెల్త్:
తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు.

గొంతునొప్పి:
గొంతునొప్పి గలవారు ఈ ఆకుల రసము త్రాగిన నొప్పి నివారించవచ్చును.

జీర్ణక్రియకు:
తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:
ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

చర్మ సమస్యలను నివారిస్తుంది:
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యానికి:
గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.

జ్వరం:
తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

చుండ్రు:
తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.



Click it and Unblock the Notifications











