Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
కుంకుమ పువ్వులో గొప్పఆరోగ్యప్రయోజనాలు
కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా చెబుతోంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.
కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ ఫ్రాన్ అంటారు. ఇది జాఫరాన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది. అంతే కాదు మంచి సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల అనేక వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఉదా: పుడ్డింగ్ లేదా క్యారెట్ హాల్వాలో ఉపయోగిస్తుంటారు. మరియు ఫెర్ ఫ్యూమ్స్ లో విరిగా వాడుతుంటారు.
గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, బట్టతల, మలబద్దకం, క్యాన్సర్, నిద్రలేమి మరియు మరికొన్ని ఇతర జబ్బుల బారిన పడకుండా సహాయపడుతుందని చెబుతుంటారు. మరియు రుతుక్రమ తిమ్మెరలను తగ్గించి మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా డిప్రెషన్ మరియు నిద్రలేమితో బాధపడేవారికి కుంకుమ పువ్వు మంచిది. అంతే కాదు, అనేక బ్యూటీ ట్రీట్మెంట్స్ లో కూడా దీన్ని విరివిగా ఉపయోగించారు. అనేక ఫేస్ ప్యాక్స్ మరియు కాస్మోటిక్స్ లో ఉపయోగించి చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికి ఉపయోగిస్తుంటారు. మరి మీరు కూడా దీని ప్రయోజనాలు పొందాలంటే మీ కుంకుమ పువ్వును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి తీసుకోవచ్చు. మరి కుంకుమ పువ్వులో ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలేంటో చూద్దాం..

యాంటీఆక్సిడెంట్స్ మరియు మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ పుష్కలం :
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్స్ మరియు మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ పుష్కలంగా ఉండి, అనేక జబ్బు నుండి మన శరీరాన్ని కాపాడుతుంది మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మరియు ఇందులో అనేక రకాల విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లొవిన్ మరియు నయాసిన్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:
మీ కంటి చూపును మెరుగుపరుచుకోవాంటే, ప్రతి రోజూ ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి రెగ్యులర్ గా తీసుకోవండి. ఇందులో కంటిచూపును సంబంధించిన సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు కంటి జబ్బులను నిరోధిస్తుంది. దీన్ని చాలా మంది సైంటిస్టులు కూడా నిర్ధారించారు.

డిప్రెషన్ ను తగ్గిస్తుంది:
అనేక పరిశోధనల ప్రకారం స్వల్పకాలిక మరియు దీర్ఘకాలి డిప్రెషన్ ను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుందని, నిర్ధారించారు. మీరు రెగ్యులర్ గా కుంకు పువ్వును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డిప్రెషన్ ను క్రమంగా తగ్గించుకోవచ్చు. మీ స్నేహితులు, బందువులు ఎవరైనా సరే డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు కుంకుమపువ్వు ఒక మంచి పరిష్కార మార్గం అని చెప్పండి.

రుతుక్రమ సమస్యలను మరియు నొప్పిలను నివారిస్తుంది:
చాలా మంది మహిళలు, అమ్మాయిలు ఈ రుతుక్రమ సమస్యలతో బాధపడుతుంటారు. భరించలేని నొప్పిని, బాధను ఎదుర్కొంటుంటారు. మరి మీరు కూడా ఈ క్యాటగిరీలో ఉన్నప్పుడు, ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుము పువ్వు వేసి ప్రతి రోజూ తీసుకోండి . ఇది రుతుక్రమ నొప్పిని తగ్గిస్తుంది మరియు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నొప్పి పూర్తిగా తొలగిపోతుంది.

కడుపు లోపాలు:
మీకు మలబద్ద సమస్య ఉన్నప్పుడు లేదా ఇతర జీర్ణవ్యవస్థ యొక్క సమస్యలు ఉన్నప్పుడు కుంకుము పువ్వు ఒక గొప్ప పరిష్కారం. కాబట్టి, ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి, రెగ్యులర్ గా త్రాగడం వల్ల పొట్టకు సంబంధించిన అని భాదలు తొలగిపోతాయి.

నిద్రలేమి సమస్యను నయం చేస్తుంది:
మీరు నిద్రలేమి రాత్రులు చాలానే పొంది ఉంటారు. మీరు ఎంత కష్టపడినా నిద్ర పట్టక మరియు మద్యహ్నానంలో నిద్రపోలేక, ఇప్పుటికీ మీలో ఈ సమస్య ఉన్నట్లైతే, ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి, రాత్రి నిద్రించడానికి ముందుగా ఈ సఫ్రాన్ మిల్క్ త్రాగాలి.
అయినా కూడా సమస్య అలాగే ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రధించాల్సిందే..

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
అవును, కుంకుమ పువ్వు మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కలర్ ఫుల్ మసాలా దినుసు, ఒక్క ముదురు వర్ణం కలిగి ఉండటం మాత్రమే కాదు, బ్రైట్ క్వాలిటీస్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇది మిమ్మల్ని అనేక హార్ట్ డిసీజ్ ల నుండి రక్షిస్తుంది. అందువల్లే దీన్ని అనేక ఆయుర్వేద మరియు హోమియో పతి మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారు.

యాంటీ క్యాన్సర్ లక్షణాలు:
క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో వుంది కాబట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన.

బ్యూటీ బెనిఫిట్స్:
కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కుంకుమ పువ్వును ఫేస్ ప్యాక్స్ లేదా డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక చర్మ సంబంధ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇది మీ చర్మానికి మెరుపును తీసుకొస్తుంది మరియు చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. మరియు బట్టతలను నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
కుంకుమ పువ్వులో అధిక శాతంలో మినిరల్స్ -పొటాషియం, కాపర్, క్యాల్షియం, మెగ్నీషియ, ఐరన్ , సెలీనియం, మెగ్నీషియ, మరియు జింక్ కలిగి ఉన్నాయి . పొటాషియం మన శరీరంలో హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

గర్భిణీ స్త్రీలకు:
గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. గర్భిణీ స్త్రీలు మొదటి నెల నుండి కుంకుమ పువ్వును వాడవచ్చు. కానీ మొదటి మూడు నెలలు వేవిళ్ళు(వాంతులు) ఉంటాయి కాబట్టి, అనుకూలత బట్టి వాడాలి .

కుంకుమ పువ్వు తో గాఢనిద్ర :
రాత్రివేళ ఆహారములోనో , ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .

వీర్యవృద్ధి:
ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది. శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్ ఫైన్లను వృద్ధి చేస్తుంది.

మోనోపాజ్ సమస్యలు:
మోనోపాజ్ సమస్యల చికిత్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు.

కడుపు ఉబ్బరం:
ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు.



Click it and Unblock the Notifications