Latest Updates
-
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం!
తాజా పండ్ల కంటే ఎండిన పండ్లలో ఉండే విశేషం ఏమిటి...?
సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి.
అయితే మనలో చాలా మందికి ఈ ‘ఎండిన పండ్లు' గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి ఏవిధంగా పనిచేస్తాయో తెలియదు. తెలుసుకోరుకూడా.. అదే సమయంలో కొంతమంది స్వీట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టంచూపుతుంటారు. బయట బేకరీల్లో, స్వీట్స్ స్టాల్స్ లో, మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల స్వీట్స్ మీద ఈ డ్రైఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసి, క్యాండీలకు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయాలుగా ఆకర్షిస్తుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని ఒత్తిడి వల్ల భోజనం చేసే సమయం కూడా ఉండదు. అటువంటి సమయంలో ఎక్కువ సమయం వృథా కాకుండా ఈ డ్రైఫ్రూట్స్ (ఎండిన పండ్లు) ఉత్తమ ప్రత్యామ్నాయం. ఎండిన పండ్లును ఒక్కొక్కటే నోట్లో వేసుకొని నమలడం వల్ల రుచిగా అనిపించడమే కాకుండా మీ ఆకలిని తెలియనివ్వదు. ఈ డ్రైఫ్రూట్స్ లో రుచి మాత్రమే కాదు అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. సలాడ్స్ మీద వీటితో గార్నిష్ చేయడం కూడా చాలా ఆరోగ్యకరం.
మరి డ్రై ఫ్రూట్స్(ఎండిన పండ్లు) యొక్క న్యూట్రీషినల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం....

ఆప్రికాట్: ఇందులో అధిక శాతంలో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ మరికు సి, పొటాషియం, అదేవిధంగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండిన పండు తినడం వల్ల శరీరంలో బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ఇది అనీమియా(రక్తహీనత)తో బాధ పడేవారికి చాలా ఉత్తమం. అలాగే జీర్ణ సంబంధిత మరియు మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ తీసుకోవడం వల్ల శరీరం, అంటువ్యాధులు సోకకుండా పోరాడటానికి దెబ్బతిన్న కణజాలాల డ్యామేజ్ ను అరికట్టడానికి, బలమైన పళ్ళు, ఎముకలు నిర్మించడానికి సహాయం చేస్తుంది. మరియు కంటి చూపు మెరుగుపరుస్తుంది.

ఫిగ్: ఫిగ్ ఎండిన పండులో కూడా అధికంగా విటమిన్స్ (విటమిన్ కె, బి6, సి, ఇ)ఇతర పోషకాంశాలు మరియు ఫాస్పరస్ లు ఉంటాయి. ఇంకా దీనిలో కాపర్ ఎక్కువగా ఉండి రక్తనాళాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతే కాదు క్యాన్సర్, డయాబెటిస్, జీర్ణసమస్యలు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

టమోటో: ఎండలో ఎండబెట్టిన టామోటోలు. ఇందులో జీరో ఫ్యాట్ మరియు లో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. టమోటోలో అధికంగా యాంటిఆక్సిడెంట్స్ , విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎండిన టమోటోలోని విటమిన్ సి క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పకుండా నిరోధిస్తుంది.

ఓల్ఫ్ బెర్రీ: ఈ రెడ్ ఆరెంజ్ బెర్రీ టమోటో మరియు మిరప కుంటుంబంలో ఒక భాగం. మరియు ఇందులో ప్రసిద్ది చెందిన వైద్యపరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. చైనాలో ఈ ఓల్ఫ్ బెర్రీని విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా రైస్ వంటలు, సూప్స్ మరియు టీ మాదిరి కాచుతారు.ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, జింక్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కిడ్నీ మరియు కాలేయ సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ ఓల్ఫ్ బెర్రీ పురుషుల్లో లైంగిక హార్మోన్ సమస్యల నివారణకు సహాయపడుతుంది.

క్రాన్ బెర్రీ: క్రాన్ బెర్రీ జ్యూస్ ను చాలా మంది ఇష్టపడుతారు. అయితే కొంత మందికి మాత్రమే వీటిలోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసు. క్రాన్ బెర్రీస్ ను చాలా వరకూ మూత్రనాళాల సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇంకా ఈ క్రాన్ బెర్రీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హృదయ సంబంధమైన వ్యాధులు సోకకుండా పోరాడగలిగే వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాదు దంత క్షయం సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుంది.

సుల్తానా: చాలా వరకూ మనం వీటిని ఎండుద్రాక్షగా పిలుచుకుంటాం. ఈ ఎండు ద్రాక్షలో పోషకాంశాలు(క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫ్లోరైడ్ మరియు జింక్ అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యాంటీ ఇన్ప్లమేటరీ, క్యాన్సర్ వ్యతిరేక మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మెలనోమా, పెద్దప్రేగు & ప్రోస్టేట్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్, నరాల వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి మరియు వైరల్ లేదా ఫంగల్ అంటువ్యాధులు వంటి ఇతర వ్యాధుల వంటి క్యాన్సర్లు భారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది.

లాన్గాన్: దీన్ని ఇలాచీ(యాలకుల)కు చిన్న సోదరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాచీలో ఉండే సుగుణాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కడుపు ఇబ్బందలకు, నిద్రలేమి మరియు స్మృతి బాధపడుతున్న వ్యక్తులు ఉత్తమ నివారణా లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పండు నాడీ వ్యవస్థ మీద నిధానంగా ప్రభావం చూపుతుంది. మరియు రక్త పోషణకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications