Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!
ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో...ఎందుకంటే ఉసిరికాయతో రకరకాల వంటలు, ఊరగాయలు తయారుచేస్తారు. అంతే కాదండోయో ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఉసిరికాయను ఇంగ్లీష్ లో gooseberry అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.
అందుకే మన పూర్వికులు ఎపటినుంచో వీటి గురించి చెపుతూనే వున్నారు. అందుకే దీన్ని ప్రకతి ప్రసాధించిన వరం అంటుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ. ఈ ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకోవడం వల్ల నిజమైన ప్రయోజనాలేంటో మనకు తెలుస్తాయి. మరి ఆ ప్రయోజనాలు మీరు కూడా ఒక సారి తెలుసుకోండి.. ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి....

ఆస్త్మా మరియు బ్రోన్కైటిస్: ప్రతి రోజూ ఆమ్ల(ఉసిరి)జ్యూస్ లో తేనె కలిపి రెండు సార్లు సేవించడం వల్ల ఆస్త్మా మరియు బ్రోన్త్కెటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.

అందానికి:
అందానికి: దీనిలో అద్బుతమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వృద్ధాప్యంను దరిచేరనివ్వదు. తేనెతో కలపి ఆమ్లా జ్యూస్ ను త్రాగడం వల్ల ముఖం ఎల్లప్పుడు తాజాగా మెరుస్తుంటుంది.

బరువు నియంత్రణకు:
బరువు నియంత్రణకు: ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

మూత్రనాళ సమస్యలు/మూత్రాశయ మంటను తగ్గిస్తుంది:
మూత్రనాళ సమస్యలు/మూత్రాశయ మంటను తగ్గిస్తుంది: ఉసిరి జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది. ఇంకా యూరినర్ బర్నింగ్ ను కూడా తగ్గిస్తుంది.

డీహైడ్రేషన్: వేసవి కాలంలో ఉసిరికాయ జ్యూస్ త్రాగడం వల్ల, శరీరాన్ని చల్లగా ఉంచి చర్మాన్నికి కావల్సినంత తేమనందిస్తుంది. మెత్తానికి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

రుతుక్రమసమస్యలు: ఉసిరికాయ తినటం లేదా ఆమ్లా జ్యూసును త్రాగడం వల్ల ఆడవాళ్ళలో ఉండే నెలసరి సమస్యలు తగ్గుతాయి.

మలబద్దకాన్ని: ఉసిరికాయ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పేగు కదలికలను క్రమబద్ద చేసి దీర్ఘకాల మలబద్దకం నియంత్రిస్తుంది.

రక్తకణాలు మరియు రక్తం శుభ్రతకు:
రక్తకణాలు మరియు రక్తం శుభ్రతకు: ఉసిరిరసం మరియు తేనే కలిపి తీసుకుంటే రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఉసిరితినటం వల్ల రక్త హీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు.

శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది: ఆమ్లా జ్యూసును క్రమం తప్పకుండా చూసుకోవడం వల్ల ఎర్రరక్తణాలను పెంచి, తగిన శక్తిని అందిస్తుంది. ఉసిరి రసం వల్ల ఒంట్లోని వ్యాది నీరోదక శక్తీ పెరుగుతుంది.

కళ్ళ ఆరోగ్యానికి:
కళ్ళ ఆరోగ్యానికి: ఉసిరికాయలను తిన్నవారిలో కంటి చూపు సమస్యలు ఉండవు. ఆమ్లా జ్యూసును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఐసైట్ బాగా మెరుగుపడుతుంది.

మెటిమల నివారణకు: ఆమ్లా జ్యూస్ చర్మసమస్యలను పోగొట్టడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ముఖంలో ఏర్పడ్డ మొటిమలని, మచ్చలని తగ్గిస్తుంది.

పైల్స్: ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల పైల్స్ నివారించబడుతుంది.

మధుమేహం: ఉసిరి కాయలో క్రోమియం అధికంగా ఉంటుంది. దీని వలన మధుమేహాన్నిఅదుపులో ఉంచుతుంది. ఉసిరికాయ జ్యూస్ తో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గుండెకు: ఉసిరి రసం గుండెను బలంగా తయారుచేస్తుంది. గుండె కండరాలను గుండె సంబంధిత సమస్యలకు దివ్వఔషదంగా పనిచేస్తుంది.

సంతానోత్పత్తి: ఉసిరికాయ వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఉసిరికాయ జ్యూసు ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆడవారిలో మరియు మగవారిలో పిల్లలు పుట్టే వ్యవస్తను బాగు చేస్తుంది.

కడుపు ఉబ్బరం/గ్యాస్:
కడుపు ఉబ్బరం/గ్యాస్: ఎవరైతే గ్యాస్ సమస్యతో బాద పడుతున్నారో వారు ఒక గ్రామ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం పంచదార కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తాగాలి.

కురుల సంరక్షణకు
కురుల సంరక్షణకు: ఉసిరి రసం చుండ్రుని తగ్గిస్తుంది. ఉసిరి కాయల గింజలను తీసుకొని నీమ్మరసంతో కలిపి రాసుకుంటే ఒక గంటలో పేలు చచ్చిపోతాయి. కురులు నల్లగా, మంచి షైనింగ్ తో మెరిసేలా చేస్తుంది.

మౌత్ అల్సర్:
మౌత్ అల్సర్: ఎవరైతే నోటి అల్సర్స్ తో బాధపడుతున్నారో వారు కొంచెం ఉసిరి రసాన్ని, తేనెతో కలిపి పుకిలిస్తే అల్సర్ తగ్గుతుంది.

కీళ్ళ నొప్పుల నివారణకు:
కీళ్ళ నొప్పుల నివారణకు: కీళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఉసిరి పొడికానీ లేదా ఉసిరికాయను కానీ నేరుగా తీసుకోవటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

గొంతు సమస్యలు:
గొంతు సమస్యలు: ఉసిరికాయ తినటం వల్ల గొంతు సమస్యలు తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications