Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
జీడిపప్పులోని15 ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు
జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. జీడిపప్పును కాజు అని కూడా పిలుస్తారు. రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అలా వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా వుంటాయి. వాటిలో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని ఏమీ చేయకుండా ఊరికే నోట్లో వేసుకున్నా తినాలనిపించే విధంగా వుంటుంది. దీన్ని డ్రైఫ్రూట్‌గా చెప్పుకుంటారు. ఇక జీడిపప్పులను వంటల్లో అటు స్వీట్లలోనూ ఇటు హాట్‌లలోనూ వాడుతారు. పాయసం, ఖీర్, రకరకాల స్వీట్లు వంటి వాటిపైన కనపడుతూ నోరూరిస్తూ వుంటాయి. ఫ్రైడ్ రైస్, బిర్యాని వంటి మరెన్నింటిలోనూ కలుపుకున్నా వాటి రుచిని మరింత పెంచుతాయి. నేతిలో వేయించి కారం, ఉప్పు చల్లుకుంటే ఈవెనింగ్ స్నాక్‌లా తినవచ్చు. పిల్లలకు, పెద్దలకు అందరికీ బలమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని ముద్దచేసి కూరలకు, కూర్మాలలో వాడితే చిక్కదనాన్ని, కమ్మదనాన్ని అందించగలవు. అయితే వీటి ధర కాస్త ఎక్కువే.తాజా పండ్ల
తాజా పండ్ల కంటే ఎండిన పండ్లు శక్తి వంతమైనవి:క్లిక్ చేయండి
జీడిపప్పులో ఎ, బి, సి, డి, ఇ, కె విటమిన్స్‌తోపాటు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి శక్తినిచ్చే ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినిరల్స్ అనేక పోషక విలువలున్నాయి. ఇంకా వీటిలో అయాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి, శరీరంలోని జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఈ రుచికరమైన జీడిపప్పు అంటే పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా అమితంగా ఇష్టపడుతారు. మరి ఈ టేస్టీ కిడ్నీ షేప్ లేదా బీన్స్ ఆకారం కలిగిన వీటిలో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..
స్పెర్మకౌంట్(వీర్యకణాల)పెరుగుదలకు జీడిపప్పు:క్లిక్ చేయండి

గుండె ఆరోగ్యానికి:
ఇతర డ్రై నట్స్ తో పోల్చినప్పుడు, జీడిపప్పు లోఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పులో గుండెకు రక్షణనిచ్చే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని బ్యాడ్ కొలెస్టరాల్‌ను తగ్గించడంలోనూ, మంచి కొలెస్టరాల్‌ను పెంచడంలోనూ ఉపయోగపడతాయి. మెడిటేరియన్ డైట్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లోసైతం వెల్లడయింది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
జీడిపప్పులు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూక్లియిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

యాంటీయాక్సిడెంట్స్:
జీడిపప్పులో ఉండే, సెలీనియం, మెగ్నీషియం మొదలగునవి అనేక ఎంజైముల ఉత్పత్తికి కో ఫ్యాక్టర్ గా పనిచేస్తాయి.

బరువు తగ్గిస్తుంది:
ప్రొటీన్లు 21 శాతం, తేమ 6 శాతం, కార్బోహైడ్రేట్ 2 శాతం, పీచు 3 శాతం, కాల్షియం 0.5 శాతం, ప్రతీ వంద గ్రాములకు ఐదు గ్రాముల ఐరన్ వుంటుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా శక్తినిచ్చే ప్యాట్ 41 శాతం ఉంటుంది. ఈ ఫ్యాట్‌వలన ఆరోగ్య రీత్యా ఎటువంటి హాని చేకూరదు.

విటమిన్స్ అధికంగా ఉన్నాయి:
జీడిపప్పులు విటమిన్స్ అంటే రిబోప్లెవిన్, పానాథోనిక్ యాసిడ్, థయమిన్, నియాసిన్ వంటి విటమినులు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ అనీమియాకు గురికాకుండా కాపాడుతాయి. జీడిపప్పు తింటే రక్త్భావృద్ధి జరుగుతుంది. ఎనీమియా వ్యాధిని నివారిస్తుంది.

ఎముకలను బలోపేతం చేయడానికి:
ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడే మెగ్నీషియం, క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంది.

నిద్ర:
మోనోపాజ్ తర్వాత, తగినంత నిద్రను పొందడానికి ఈ జీడిపప్పులు అద్భుతంగా సహాయపడుతాయి.

క్యాన్సర్ నివారిస్తుంది:
ప్రొఆన్తసైయనిడిన్స్ ప్లెవనాల్ కు సంబంధించినది ఇది ట్యూమర్ సెల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రొఆన్తసైయనిడిన్స్ మరియు అధిక కాపర్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడి, కోలన్ క్యాన్సర్ నుండి మనల్ని రక్షిస్తుంది. జీడిపప్పుతో ఇది ఒక గొప్ప ప్రయోజనం.

చిగుళ్ళ వ్యాధులు మరియు దంత క్షయాన్ని నివారిస్తుంది:
ముందుగా చెప్పినట్లు, ఇందులో ఉండే మెగ్నీషియం కంటెంట్ ఎముకలకు చాలా మంచిది. అది దంతా ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది:
జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

నాడికణాల ఆరోగ్యానికి :
జీడిపప్పులోని మెగ్నిషియంలో ఎములకను బలోపేతం చేస్తే, కాల్షియం నాడికణాల్లోకి ప్రవేశించి బ్లడ్ సెల్స్ మరియు కండరాలను విశ్రాంతి పరుస్తుంది.

ఫీరాడికల్స్:
జీడిపప్పులు రెగ్యులర్ గా తినడం వల్ల ఇందులోఐరన్ శరీరం గ్రహించి ఫ్రీరాడికల్స్ నుండి మన శరీరాన్ని, మరియు చర్మాన్ని రక్షిస్తుంది.

గాల్ స్టోన్ నివారిస్తుంది:
జీడిపప్పు పలుకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడటాన్ని 25% తగ్గిస్తుంది.

కంటి సమస్యలు:
యూవీ కిరణాల వల్ల కంటి సమస్యలు ఏర్పడకుండా కాపాడే శక్తి సామర్థ్యాలు జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయి.

జుట్టుకు :
జీడిపప్పులు కాపర్ అనేటటువంటి మినిరల్, ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నా ఈ జీడిపప్పును మీరు తీసుకోవడం వల్ల మీకు నచ్చే బ్లాక్ హెయిర్ ను మీరు సొంతం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications