Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు
యోగా, ఆసనాలు, శ్వాస ప్రక్రియల సమ్మేళనం వల్ల ప్రశాంత జీవితాన్ని ఏర్పరిచే ఒక పురాతన పద్ధతి. ఇది పార్శ్వపు నేప్పిపై పోరాడే దుష్ప్రభావాలు లేని పద్ధతులలో ఒక మంచి భాగం. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఈ చిన్ని చిన్ని ఆసనాలు వేయడం వల్ల మరోసారి పార్శ్వపు నొప్పిని కూడా మీ శరీరం తట్టుకోనడానికి సహాయపడుతుంది.

హస్తపాదాసన (నిలవబడి ముందుకు వంగడం)
నిలబడి ముందుకు వంగే ఆసనం రక్త ప్రసరణను పెంచడం ద్వారా నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది, మెదడును ప్రశాంతంగా కూడా ఉంచుతుంది.

సేతుబంధాసన (వంతెన భంగిమ)
ఈ ఆసనం మీ రక్తపోటు ను నియంత్రించి, మెదడుకు విశ్రాంతిని, ప్రసంతతను ఇచ్చి ఆతృతను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ ఆసనం చేసేటపుడు రక్తం మెదడుకు సరఫరా అయి నొప్పి నివారణకు సహాయపడుతుంది.

బాలాసన (బాలల ఆసనం)
పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ బాల భంగిమ బాధను నివారించి, నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం)
పిల్లిలాగా సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు ప్రశాంతంగా ఉంది, ఒత్తిడిని నివారించి, మంచి శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆసనానికి మంచి భాగం కండరాలు, ఇది నొప్పిని పోగొట్టుకోవడానికి ప్రభావిత మార్గమైన కండరాల ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది. మార్జారి ఆసన లేదా పిల్లిలా సాగడం భంగిమ ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

పశ్చిమోత్తాసనం (రెండు కాళ్ళూ ముందుకు వంచడం)
రెండు కాళ్ళూ ముందుకు వంచే ఆసనం మెదడును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించి, తలనొప్పిని నుండి ఉపశమనం కలిగిస్తుంది. పశ్చిమోత్తాసనం లేదా రెండు కాళ్ళూ ముందుకు వంచే భంగిమ ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

అధోముఖ స్వానాసన (కిందకు చూస్తున్న కుక్క భంగిమ)
కిందకు చూస్తున్న కుక్క భంగిమ మెదడుకు రక్త ప్రసరణను అభివృద్ది చేసి దానివల్ల తలనొప్పి తగ్గెట్లు చేస్తుంది. కిందకు చూస్తున్న కుక్క భంగిమ లేదా అధోముఖ శ్వాసన ఆసనం ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

పద్మాసనం (పద్మం భంగిమ)
పద్మాసనం మనసుకి ప్రశాంతతను కలిగించి, పార్శ్వపు నొప్పిని ఉపశమనం కలిగిస్తుంది. మీరు పద్మం భంగిమ లేదా పద్మాసనం ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

శవాసనం (శవం భంగిమ)
శవాసనం ధ్యాన ముద్రలో లోతుగా తీసుకువెళ్ళి శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొన్ని నిమిషాలు ఈ భంగిమలో ఉండి రోజువారీ యోగా ముగుస్తుంది. మీరు శవాసన లేదా శవ భంగిమను సరైన విధంగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది.
ఈ చిన్న చిన్న యోగాసనాలను అభ్యసించడం వల్ల పార్శ్వపు నొప్పి ప్రభావాన్ని తగ్గించి, దాదాపు శాస్వతంగా తలనొప్పి రాకుండా ఆపుతుంది. అందువల్ల, యోగా చాపను మడిచి, రోజులో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, మీ మంచికోసం పార్శ్వపు నెప్పి మీ జీవితం నుండి దూరమౌతుంది.
జాగ్రత్త అనే పదం: మీ డాక్టర్ ఇలా చెయ్యి అని సలహా ఇచ్చేవరకు మందులు వాడడ౦ ఆపొద్దు. యోగా మీ మైగ్రేన్ కి వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అంతేకాని మందులకు బదులుగా ఉపయోగించేది కాదు.



Click it and Unblock the Notifications