ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు

గుడ్డు ఒక మంచి పౌష్టికాహారం. అయితే గుడ్డు గురించి ప్రపంచంలో తప్పుగా భావించేవారు చాలా మందే ఉన్నారు . ఎందుకంటే చాలా మంది, గుడ్డులో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నాయని ఇది హార్ట్ పేషంట్స్ కు అంత మంచిది కాదని చెబుతుంటారు. అయితే గుడ్డులో అనేక కోణాలు ఉన్నాయి. ఎగ్ వైట్ (గుడ్డు తెల్ల సొన)లో ఉండే ఆరోగ్యప్రయోనాలు తెలియని వారు, ఎగ్ వైట్ ను అంతగా తినరు. ఎగ్ వైట్ కంటే గుడ్డు పచ్చసొననే ఎక్కువగా ఇష్టపడుతుంటారు . అయితే ఎగ్ వైట్ కూడా ఎక్కువ శాతం న్యూట్రీషియన్లను అంధిస్తుంది.

కేవలం గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలని మొత్తం గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనే వారు అనేకమందే ఉన్నారు. అందుకు కారణం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండడమే. అయితే తెల్లగుడ్డు నిస్పందేహంగా మంచిదే. అయితే రోజుకు ఒక్క పచ్చసొన అయినా తినాలి అంటారు ఆరోగ్య నిపుణులు. గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది తమను తమూ ఎగ్ టేరియన్స్ గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు.

గుడ్డు పచ్చసొనలోకూడా ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువే:తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

అంతే కాకుండా గుడ్డును మాసాంహరం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగా నే భావిస్తున్నారు కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

కాబట్టి, ఎగ్ వైట్ తినేటప్పుడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు గుడ్లను తీసుకొనే బదులు 3-4గుడ్ల యొక్క తెల్లని పదార్థం తీసుకోవడం ఉత్తమం. ఈ మార్గంలో కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్స్ శరీరానికి అందకుండా పూర్తి పోషకాలను శరీరానికి అందివ్వవచ్చు.

ఎగ్ వైట్ లో వీటితో పాటు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ క్రింది విధంగా...

టన్స్ ఆఫ్ ప్రోటీలు

టన్స్ ఆఫ్ ప్రోటీలు

ఎగ్ వైట్ లో పుష్కలమైన అల్బుమిన్ ఉంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ ఉండదు

కొలెస్ట్రాల్ ఉండదు

గుడ్డులోని పచ్చసొన కాకుండా ఎగ్ వైట్ లో కొలెస్ట్రాల్ ఉండదు . కాబట్టి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే మీ రెగ్యులర్ డైట్ లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తప్పక చేర్చుకోవాలి.

లోక్యాలరీ బ్రేక్ ఫాస్ట్:

లోక్యాలరీ బ్రేక్ ఫాస్ట్:

ఎగ్ వైట్ లో ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరియు చాలా తక్కవ క్యాలరీలను కలిగి ఉన్నది. అందుకే ఇది బెస్ట్ లోకాలరీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం రిచ్ ఫుడ్

మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం రిచ్ ఫుడ్

ఎగ్ వైట్ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది.ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్ ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు

పురుషుల్లో మేల్ హార్మోన్ టెస్టో స్టిరోన్ ఉత్పత్తికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్లే పురుషులు ఎగ్ బైట్ ను ఎక్కువగా తీసుకోవాలి.

సెలీనియం-కాన్సర్ రక్షణకు

సెలీనియం-కాన్సర్ రక్షణకు

అల్బుమిన్ అనే పోషకాంశంలో సెలీనియం అనే కెమికల్ కలిగి ఉండి, మన శరీరంలో ఏర్పడే కాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేసై్తుంది. ఇది ఫర్టికులర్ గా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

విటమిన్ బి12-నాడీ ఆరోగ్య సంరక్షణకు

విటమిన్ బి12-నాడీ ఆరోగ్య సంరక్షణకు

విటమిన్ బి12 ఆరోగ్యకరమైన నాడీ సంరక్షణ కొరకు విటమిన్ బి12 అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 పొందడానికి ఎగ్ వైట్ అద్భుతంగా సహాయపడుతుంది.

కోలిన్ ఫర్ బెటర్ స్లీప్

కోలిన్ ఫర్ బెటర్ స్లీప్

గుడ్డులో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం కోలిన్ రెగ్యులర్ స్లీప్ అంధించడంలో బాధ్యత వహిస్తుంది. కాబట్టి మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే గుడ్డులోని తెల్లని పదార్థం రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి.

రక్తం ఉత్పత్తికి అవసరం అయ్యే ఐరన్

రక్తం ఉత్పత్తికి అవసరం అయ్యే ఐరన్

ఎగ్ వైట్ లో పుష్కలంగా ఐరన్ ఉంటుందని చాలా మందికి తెలియదు . ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది .

సోడియం పొటాషియం బ్యాలెన్స్

సోడియం పొటాషియం బ్యాలెన్స్

ఎగ్ వైట్ లో సోడియం మరియు పొటాషియం అధికంగా ఉండి శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మినిరల్స్

మినిరల్స్

ఎగ్ వైట్ లో ట్రేస్ మినిరల్స్ మెగ్నీషియం మరియు ఫాస్పరస్ లు కలిగి ఉన్నాయి ఈ మినిరల్స్ చర్మం అందానికి మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి.

Desktop Bottom Promotion