పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా, వేసవిలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు.
READ MORE: దాహాన్నితీర్చడమేకాదు, అందాన్ని కూడా వేగంగా పెంచతుంది
అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. అలాగే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే ప్రయోజనాలు కూడా ఎన్నో....ఎన్నెన్నో...తెలుసుకోవాలంటే, క్రింది స్లైడ్ ఒక్కసారి క్లిక్ చేయండి...
బరువు తగ్గడానికి:
కొవ్వు పదార్థాలు అత్యంత తక్కువుగానూ, పీచు పదార్థాలు అధికంగానూ ఉండే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి వరం లాంటింది.
గుండెకు:
గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్-బి6వల్ల గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.
కీళ్ళ నొప్పులు:
వబలమైన కీళ్ళ కోసం: దోసకాయలోని సిలికా కీళ్ళ జాయింట్లను, సహాయపడే కణజాలాలకు పటిష్టం చేయడానికి బాగా సహాయపడుతుంది.
పళ్ళు మరియు చిగుళ్ళ ఆరోగ్యానికి:
దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడేవారికి పుచ్చకాయ రసం చాలా సహాయపడుతుంది.
క్యాన్సర్:
పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడుతుంది.
డయాబెటిస్:
పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి. గుండెజబ్బులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి.
ఫ్లూ:
జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి సమయంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది.
పురుష హార్మోనులను రెట్టింపు చేస్తుంది:
వేసవి తాపాన్నితగ్గించే పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
హైబీపి:
హైబీపీని తగ్గించడానికి, సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. సాధారణ స్థాయికి మించి హైపర్‌టెన్షన్ తో కనిపిస్తున్నవారు రోజూ పుచ్చకాయ తినడం మంచిది.
మహిళల్లో చక్కటి స్తన ఆకృతి:
వీటిలో పుష్కలంగా లభ్యమయ్యే కెరొటినాయిడ్లు మహిళల్లో స్తనాల ఆకృతి చక్కగా ఉండేలా చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.
కంటి ఆరోగ్యానికి:
పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను సైతం నిరోధిస్తుంది.
గర్భిణీ స్త్రీలకు:
జన్మతఃప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు.
మలబద్దకం:
కర్బూజ తినడం వల్ల శరీరంలోని అధిక వేడి తొలగిపోతుంది. దీంతో పాటు కర్బూజలోని విటమిన్-ఏ, విటమిన్-బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తిగా శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:
పుచ్చకాయ బాడీ హీట్ తగ్గించి, శరీరాన్ని తేమగా ఉంచతుంది.
బ్రెయిన్ పవర్ పెంచుతుంది:
వాటర్ మెలోన్ లో విటమిన్ బి6 బ్రెయిన్ పవర్ పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:
కర్భూజలో విటమిన్ బి6, బి1, సి మరియు మ్యాంగనీస్ వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
కిడ్నీ సపోర్ట్ :
వాటర్ మెలోన్ ఒక నేచురల్ డ్యూరియాటిక్ ఫుడ్ ఇది యూరిన్ ఫ్లోను పెంచతుంది. లివర్ జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మినిరల్స్ అందుకు బాగా సహాయపడుతాయి.
మూడ్ ను మెరుగుపరుస్తుంది:
తరచూ వాటర్ మెలో తింటుంటే, డిప్రెషన్ తగ్గించి మంచి మూడ్ ను పెంచతుంది. అందుకు విటమిన్ బి6 బాగా సహాపడుతుంది
కండరాలను బలోపేతం చేస్తుంది:
శరీరంలో కండరాలను, జీవక్రియలను బలోపేతం చేస్తుంది
చెడు శ్వాసను నివారిస్తుంది:
ఎక్స్ పర్ట్స్ ప్రకారం, వాటర్ మెలోన్ చెడు శ్వాసను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
చర్మ సంరక్షణకు:
వాటర్ మెలోనలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు ఎక్కువ.ఇవి హానికారక ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.
వడదెబ్బ:
ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
వద్యాప్యం:
వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.
బ్లాక్ హెడ్స్:
చర్మ రక్షణలో బాగంగా ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించడం సహాయపడుతుంది.
కేశ సంరక్షణకు:
పుచ్చకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఎనర్జీ డ్రింక్:
ఒక గ్లాస్ వాటర్ మెలోన్ జ్యూస్ మన శరీరానికి కావల్సిన శక్తిని తక్షణం అందిస్తుంది.



Click it and Unblock the Notifications