Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గ్రీన్ టీలోని టాప్ 10 హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్
పొద్దున్నే టీ కప్పు కనిపిస్తే మనిషికి ఉదయించే సూర్యుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. టీ మాధుర్యాన్ని చవి చూసిన ఆనందంలో కొందరు పాలు కలపడానికి కూడా ఇష్టపడక ఏకంగా బ్లాక్ టీనే తాగడం మొదపూట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ టీ పట్ల మోజు బాగా పెరుగుతోంది. ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలకు గ్రీన్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. అందుకే దీన్ని తీసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. గ్రీన్ టీలోని విశేషాలను, ఔషధ గుణాలను మరింత లోతుగా పరిశీలిస్తే....
అన్ని పానీయాల్లోకంటే అత్యంత ప్రజాదరణ పొందినది టీ. అలసిపోయినప్పుడు టీ తాగితే రిఫ్రెష్ అవుతారు. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మనకు ఆలంబనగా నిలిచి మానసికోల్లాసానికి మార్గంగా మారుతుంది టీ. అలాంటి ఈ టీస్థానంలో గ్రీన్ టీ వచ్చింది. మామూలు టీకన్నా గ్రీన్ టీ తాగితే శరీరానికి చాలా మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకపాత్ర పోషిస్తుంది. సుదీర్ఘకాలం పాటు చెప్పుకోదగినంతగా ఆరోగ్య లాభాలు చేకూర్చిపెడుతుంది. గ్రీన్ టీలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, సాధారణంగా మామూలు టీలో ఏ మేరకు చక్కెర వాడుతున్నామనే స్పృహ మనకు ఉండదు. అదే గ్రీన్ టీలో అలా కాదు. అందుకే, తీసుకొనే చక్కెర మొత్తాన్ని తగ్గించాలన్నా, లావెక్కే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా అందుకు చక్కటి మార్గం - గ్రీన్ టీ. అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

1.వృద్ధాప్యం తగ్గిస్తుంది
గ్రీన్ టీల ఉన్న యాంటీఆక్సిడెంట్స్ వీటినే మనం ఫాలీపినాల్స్ అని పిలుస్తాము. ఇవి వృద్ధాప్యంకు కారణం అయ్యే మోలీక్యులర్ ఫ్రీరాడికల్స్ తో పోరాడి ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది.

2.యాంటీఆక్సిడెంట్స్
గ్రీట్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు క్యాన్సర్ వ్యాధులు సోకుకుండా నివారిస్తుంది. (టీ లో కనిపించే యాంటీఆక్సిడెంట్లు) టీ లోని పాలీఫేనాల్స్ వల్ల, ఒక కప్పు టీ లో కాన్సర్ ఎదుర్కొనే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే పరిశోధన అసంపూర్తిగా ఉన్నప్పటికీ, టీ లో పాలీఫేనల్స్ అధికంగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి, ముఖ్యంగా కాటచిన్స్, కాన్సర్ నివారణకు సంబంధించిన జీవకార్యకలాపాలను కలిగి ఉండవచ్చు.

3.ఆస్తమా
గ్రీన్ టీలో థయోఫైలిన్ కలిగి ఉంది. ఇది బ్రోకియల్ ట్యూబ్స్ ను విశ్రాంతి పరుస్తుంది దాంతో ఆస్తమాను రాకుండా నిరోధించవచ్చు.

4.క్వొవ్వుతో పోరాడుతుంది
గ్రీన్ టో ఫ్యాట్ సెల్స్ లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. దాంతో స్థూలకాయం సమస్యకు దూరంగా ఉంచుతుంది.

5.బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది
ఫుడ్ పాయిజన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గ్రీన్ టీలోని కెటాచిన్ అనే కంటెంట్ అందుకు బాగా సహాయపడుతుంది.

6.జలుబు మరియు ఫ్లూ
గ్రీన్ టీలోని విటమిన్ సి సాధారణంగా వచ్చే జలుబు మరియు ఫ్లూ వంటి జబ్బులను దూరంగా ఉంచుతుంది.

7.చర్మానికి సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తుంది
మీరు సన్ బర్న్ కు గురైనప్పుడు మీ చర్మం ఎర్రగా, దద్దర్లు ఏర్పడినప్పుడు, ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నించండి. గ్రీన్ టీ బ్యాగ్స్ తో పాటు, బ్లాక్ టీ బ్యాగ్స్ ను కూడా వేడి చేసి, తర్వాత చల్లార్చి త్రాగడం వల్ల నొప్పి నుండి, చర్మం ఎర్రగా మారడం నుండి తక్షణ ఉపశనం కలిగిస్తుంది.

8.కళ్ళ ఉబ్బును
ప్రస్తుత రోజూల్లో కళ్ళ ఉబ్బు చాలా మందిలో ఇది ఒక సాధారణ సమస్యగా ఉంది. ముఖ్యంగా ఎక్కువ పనిగంటలు పనిచేసేవారికి మరియు ఇతర కారణాల వల్ల కూడా కళ్ళ ఉబ్బు ఉంది. కాబట్టి, గ్రీ టీ బ్యాగ్స్ ను కళ్ళ మీద ఉంచుకొని విశ్రాంతి పొందవచ్చు. గ్రీన్ టీలోని కెఫిన్ కళ్ళక్రిందినల్లటి వలయాలను నివారించడానికి సహాయపడుతుంది.

9.జుట్టుకు మంచి మెరుపును అంధిస్తుంది
గ్రీన్ టీతో హెయిర్ వాష్ చేయడం వల్ల మీ కేశాలు మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి . రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకొని నీళ్ళలో వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత తలారా పోసుకొని పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం ద్వారా మంచిఫలితం ఉంటుంది.

10.చర్మాన్ని కూల్ గా మార్చుతుంది
షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మం దురదా అనిపిస్తుంటే, ఆప్రదేశంలో చల్లటి గ్రీన్ టీ బ్యాగ్స్ ను అప్లై చేయాలి. ఇది రేజర్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications