Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిత్యం వంటకాల్లో పసుపు వాడకం వల్ల పొందే లాభాలేంటి ?
ప్రతి వంటలో నేనున్నానంటూ రంగుని, సువాసనను అందిస్తుంది పసుపు. చక్కటి రంగు, ఘాటైన సువాసన, తినాలనిపించే రుచి కలిగిన పసుపులో ఆరోగ్యప్రయోజనాలెన్నో ఉన్నాయి. నిత్యం పసుపును తీసుకోవడం వల్ల అనేక సర్వరోగాలకు దూరంగా ఉండవచ్చు. ఎలాంటి రంగు వంటకైనా.. కలర్ ఫుల్ ఎట్రాక్షన్ తీసుకొస్తుంది పసుపు.
పసుపుని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తాం. ముఖవర్ఛస్సు పెరగడానికి ఫేస్ ప్యాక్ లలో వాడుతూ ఉంటాం. అయితే పసుపు అందానికే కాదు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. నిత్యం ఆహారంలో పసుపు వాడటం తప్పనిసరి. ప్రతిరోజూ ఆహారంలో పసుపు చేర్చుకోవడం వల్ల పొందే లాభాలేంటో చూద్దాం..

బరువు తగ్గడానికి
పసుపులో ఉండే కార్కుమిన్ ఫ్యాట్ స్టోరేజ్ ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి పసుపును ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలని పసుపు తినాల్సిన అవసరం లేదు. మీ రెగ్యులర్ డైట్ లో పసుపు భాగం చేసుకుంటే చాలు. బరువు తగ్గవచ్చు.. ఆరోగ్యమూ పొందవచ్చు.

వాపు తగ్గించడానికి
శరీరక శ్రమ చేస్తున్నప్పుడు వైరస్, ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా గాయం ద్వారా శరీరంలో వాపు, నొప్పి వస్తుంటాయి. దీనివల్ల చాలా అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరానికి అందిన పసుపు ఈ వాపు, నొప్పిని తగ్గిస్తాయి. సర్జరీ పేషంట్స్ కూడా ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

వయసు ఛాయలతో పోరాడుతుంది
పసుపులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యూవీ, కాలుష్యం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. ఇది ఏజింగ్ కి కారణమవుతుంది. ఈ వయసు ఛాయలు తగ్గించడానికి వంటల్లో చేరిన పసుపు సహకరిస్తుంది.

క్యాన్సర్ నిరోధించడానికి
యాంటీ కార్కినోజెనిక్ గుణాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడతాయి. కార్క్యుమిన్ అనేది పసుపు ఉండే గుణం. ఇది క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించడమే కాదు, శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తాయి.

న్యూరోజెనరేటివ్ డిజీస్ లతో పోరాడుతుంది
న్యూరాలజికల్ సిస్టమ్స్ పై ప్రభావం చూపే అల్జీమర్స్, హంటింగ్టన్ వంటి జబ్బులతో పోరాడాలంటే నిత్యం తీసుకునే ఆహారంలో పసుపు చేర్చుకోవాలి.
పసుపు మనకు సహజసిద్ధంగా లభించే పవర్ ఫుల్ మెడిసిన్.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయిన జలుబుతో పోరాడుతాయి. అంతేకాదు రోగ నిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

రిప్రొడక్టివ్ సిస్టమ్స్
శరీరంలో యాంటీ ఆక్సిడేషన్ ని ఉత్పత్తిచేయడానికి అవసరమైన గుణాలు పసుపులో ఉంటాయి. అలాగే కాలేయాన్ని రక్షిస్తుంది. హార్మోన్ రెగ్యులేషన్ సరిగ్గా ఉండే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థ
ఆర్థరైటిస్ వంటి సమస్యలు నయం కావడానికి పసుపు సహకరిస్తుంది. శరీరం శక్తిని కోల్పోయినప్పుడు కావాల్సిన వ్యాధినిరోధక శక్తిని అందించి, ఇమ్యూన్ సిస్టమ్ సజావుగా ఉండటానికి పసుపు సహాయపడుతుంది.

పసుపు తీసుకోవడం ఎలా
పసుపుని డైట్ చేర్చుకోవడానికి చాలా మార్గాలున్నాయి. సాస్, ఫ్రై, ఏదైనా స్నాక్ ఐటమ్స్ పై కాస్త పసుపును చల్లుకుంటే చాలు. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications