Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం ఉన్న జాబ్ ఫ్రొఫైల్స్ లో నైట్ సిఫ్స్ చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎలాంటి జాబ్స్ లోనైనా నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అన్నీ యూకే, యూఎస్, ఆస్ర్టేలియా బేస్డ్డ్ క్లైంట్స్ తో కలిగిన కంపెనీలే ఎక్కువగా ఉండటం వల్ల నైట్ షిఫ్ట్స్ తప్పడం లేదు. అలాగే మీడియా రిలేటెడ్ జాబ్స్ కూడా రాత్రివేళల్లో పనిచేయక తప్పడం లేదు. నైట్ షిఫ్ట్స్ చేయడం కష్టమే కాదు.. ఆరోగ్యానికీ అనర్థమే.
కొన్ని సందర్భాల్లో, కొంతమంది జాబ్ ప్రొఫైల్స్ కారణంగా రాత్రివేళలు పనిచేయాల్సి రావడం తప్పనిసరి అయింది. అవకాశం లేనప్పుడు నైట్ షిఫ్ట్స్ ని వదులులేకపోతున్నారు. అయితే.. ఆరోగ్యానికి అనర్థం జరగకుండా.. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటే..మంచిది. రాత్రివేళల్లో పనిచేసే వాళ్లు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

పంచదారకు దూరం
ఉదయం వేళల్లో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి శరీరానికి ఉంటుంది. కానీ రాత్రివేళల్లో ఆ శక్తిని కోల్పోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రిపూట తీపి పదార్థాలకు నో చెప్పడం మంచిది.

స్నాక్స్
నైట్ షిఫ్ట్స్ లో నిద్ర కామన్ సమస్య. దాన్ని ఆపుకోవడానికి రకరకాల స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే నూనెలో వేయించిన డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తీసుకోకుండా ఉండాలి. అవి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతాయి. దీనివల్ల ఊబకాయం సమస్య ఎదురవుతుంది. కాబట్టి అలాంటి స్నాక్స్ కి బదులు క్యారెట్, ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం మంచిది.

కార్బొహైడ్రేట్స్
రాత్రిపూట పనిచేసేవాళ్లకు కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం జీర్ణమవడం కష్టం. కాబట్టి.. అన్నం, బ్రెడ్, బంగాళాదుంప, ధాన్యాలతో తయారు చేసిన ఎలాంటి వంటకానికైనా.. దూరంగా ఉండటం మంచిది. ఈజీగా జీర్ణమయ్యే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే.. ఉల్లాసంగా గడిపేయవచ్చు.

కాఫీ
నిద్రను ఆపుకోవడానికి చాలా మంది వెతుక్కునే పరిష్కారం కాఫీ. నిద్రరాకూడదని.. చాలామంది టైంతో సంబంధం లేకుండా.. కాఫీ లాగించేస్తారు. కానీ కాఫీ ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సాఫ్ట్ డ్రింక్స్
రాత్రివేళల్లో సాఫ్ట్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. అదికూడా పనిచేసే సమయంలో ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది. దీనికి బదులు ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆహారం
రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కాస్త విరామంతో.. కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల.. చాలా రిలాక్స్ గా ఉంటుంది. అది జీర్ణమవడానికి కూడా మంచిది.

వాకింగ్
నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్లు తప్పకుండా చేయాల్సిన ఎఫెక్టివ్ హెల్త్ టిప్ నడక. మధ్యలో బ్రేక్ తీసుకోవడం, నడవడం వల్ల కళ్లకు, మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడంతో పాటు, ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
