Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వర్షాకాలం, శీతాకాలలో కమలాపండ్లు తినచ్చా ?
ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతున్న పండ్లు కమలాలు. వర్షాకాలం, చలికాలంలో వీటిని తినాలంటే చాలా మంది జలుబు చేస్తుందని ఫీలవుతూ ఉంటారు. కానీ వీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరగడానికి సహకరిస్తాయి.
ఈ కాలంలో చీప్ గా, విరివిగా దొరికే కమలాపండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని డైరెక్ట్ గా తీసుకున్నా.. రసం తీసి తీసుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు. కాబట్టి రెగ్యులర్ గా కమలాపండ్లను తీసుకుంటే పొందే లాభాలేంటో చూద్దాం..

కిడ్నీ
కమలాపండ్లు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు చేరడాన్ని నిరోధిస్తాయి. ఆరంజ్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.

కాలేయానికి
కాలేయ క్యాన్సర్‌ను అరికట్టే శక్తి కమలాపండ్లకు ఉంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయంలో వచ్చే ఇన్ఫెక్షన్ ల నుంచి దూరంగా ఉండవచ్చు.

కొలెస్ర్టాల్ కరిగించడానికి
శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని కమలాపండు అరికడుతుంది. కొలెస్ర్టాల్ పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి.

జీర్ణశక్తి
కమలాపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దాంతోపాటు ఆకలిని పెంచుతుంది. జీర్ణసంబంధ సమస్యలతో బాధపడే వాళ్లకు కమలాపండ్లు చక్కటి పరిష్కారం.

గుండె ఆరోగ్యానికి
హృదయస్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్ రేటులో హెచ్చుతగ్గులు రాకుండా చూస్తాయి.

చర్మానికి
కమలాపండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి చర్మానికి ఉపయోగపడతాయి. చర్మకణాలు పాడవకుండా, చర్మం నిగారింపుతో ఉండటానికి సి విటమిన్ సహాయపడుతుంది.

టైఫాయిడ్, టీబీ
టీబీ, టైఫాయిడ్ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం మంచి శక్తినిచ్చి వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది.

రోగనిరోధక శక్తికి
కమలాపండ్ల రసాన్ని తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జలుబు, తుమ్ముల నుంచి దూరంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి.

మూత్రంలో ఇన్ఫెక్షన్స్
చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి తాగితే యూరిన్ లో వచ్చే మంట వంటి సమస్యలు తగ్గిపోయి మంచి ఉపశమనం కలిగిస్తాయి.

బీపీ
బీపీని కంట్రోల్ చేయడంలో ఆరంజెస్ బాగా ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.

కంటి చూపుకి
కంటిచూపు సమస్యలతో బాధపడేవాళ్లకు ఆరంజ్ చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి.

వైరల్ ఇన్ఫెక్షన్స్
వర్షాకాలం, శీతాకాలాలలో వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్ రాకుండా కమలాలు కాపాడతాయి. శరీరంలోని మలినాలను శుద్ధిచేసి ఉల్లాసంగా ఉంచడానికి కమలాపండ్లు ఉపయోగపడతాయి.
రోజూ కమలాపండ్లను తినడం వల్ల మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు



Click it and Unblock the Notifications